KVPS
-
దళితుల భూములు లాక్కోవద్దు
డాపూర్(సంగారెడ్డి): సదాశివపేట దళితుల భూములు గుంజుకోవద్దని, హెచ్ఎండీ లేఅవుట్ పేరిట వారి భూముల్లో రియల్ ఎస్టేట్ దందా ఆపాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సదాశివపేట దళితులు వారి భూములను రియల్ ఎస్టేట్ దందాకు ఇవ్వొద్దని కోరుతూ కులవ్యవక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ సదాశివపేట పట్టణ శివారులోని సర్వే నంబర్ 165లోగల 114.21 ఎకరాల భూమిలో గత 50 సంవత్సరాలుగా 200 మంది దళిత కుటుంబాలు వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారన్నారు. హైదరాబాద్ – ముంబయి నేషనల్ హైవే కు ఆనుకొని ఆ భూములు ఉన్నాయన్నారు. వాటి విలువ సుమారు రూ.350 కోట్లకు పైగా ఉంటుందన్నారు. పేద దళితుల భూములను గుంజుకొని రియల్ ఎస్టేట్ దందా చేస్తారా? అని ప్రశ్నించారు. హెచ్ఎండీఏ లే అవుట్ పేరుతో రియల్ ఎస్టేట్ దందా వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, జిల్లా సభ్యుడు మోహన్ దాస్, సదాశివపేట దళిత రైతులు సిద్దాపురం శంకరయ్య, చుక్కల మానేయ, కర్రె సుధాకర్, సంజీవులు, సునందరావు, అనూప్ కుమార్, ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు . -
స్పీకర్ గారూ.. మీకు ఇది తగునా?
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సీట్లు మిగిలితే వాటిని ఇతరులకు కేటాయించాలంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు స్పీకర్ కోడెల శివప్రసాదరావు వినతిపత్రం ఇవ్వడం సిగ్గు చేటు అని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి విమర్శించారు. ఢిల్లీలో అక్టోబర్ 10న స్పీకర్ కోడెల ఈ మేరకు వినతిపత్రాన్ని ఇచ్చారని, ఇంతకన్నా దుర్మార్గం మరొకటి లేదని అన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని కేంద్రీయ విద్యాలయంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సీట్లు ఎందుకు మిగిలిపోయాయో ఆలోచించి, వారిని చేర్చేలా చర్యలు తీసుకోవడానికి బదులు.. మిగిలిన సీట్లన్నీ ఇతరులకు లాటరీ పద్ధతిలో కేటాయించేలా జీవో ఇవ్వాలంటూ విన్నవించడం దళిత వ్యతిరేక చర్య తప్ప మరొకటి కాదని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయంలో సీట్లు మిగిలి పోవడానికి ప్రభుత్వ ప్రచారం లేకపోవడమే కారణమన్నారు. ఒక బాధ్యతగల ప్రజా ప్రతినిధిగా వున్న స్పీకర్ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి దళిత కాలనీలకు వెళ్లి కేంద్రీయ విద్యావిధానంపై అవగాహన కల్పించలేకపోయారని, వారిని ఆ విద్యాలయంలో చేర్చేలా చర్యలు తీసుకోలేకపోయారని విమర్శించారు. -
నోట్ల రద్దుతో ప్రజలకు ఇక్కట్లు
* కేవీపీఎస్ రౌండ్ టేబుల్లో సమావేశంలో వక్తల ఆవేదన విజయవాడ(లబ్బీపేట): పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అల్లాడుతున్నారని వివిధ సంఘాల నాయకులు మండిపడ్డారు. ‘కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్) ఆధ్వర్యంలో గురువారం ‘పెద్ద నోట్లు రద్దు– దళిత గిరిజన ప్రజల ఇక్కట్లు’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. స్థానిక గిరిపురం బాబూజగ్జీవన్‌రామ్ గ్రంథాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు సంఘాలకు చెందిన నేతలు మాట్లాడుతూ నోట్ల రద్దు విషయంలో ప్రధాని క్షమాపణ చెప్పాలన్నారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్దానం ప్రకారం జన్‌ధన్‌యోజన అకౌంట్లో రూ.10 వేలు వేయాలని డిమాండ్ చేశారు. కొత్త నోట్లు వచ్చేంత వరకూ పాత నోట్లు చలామణిలో ఉంచాలన్నారు. క్యూలైన్లలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు నవంబర్ జీతాలు నగదు రూపంలోనే చెల్లించాలని కోరారు. దేశంలో చలామణిలో ఉన్న నగదులో 86 శాతం రూ.500, రూ1000 నోట్లు ఉన్నాయని, 90 శాతం నగదు రూపంలోనే ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుట్టి రాయప్ప, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నత్తా యోనారాజు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు కె. ఏసు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె. సుబ్బరావమ్మ, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు జి.నటరాజు. మాతంగి దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దళితులపై దాడులను ప్రతిఘటిద్దాం
గోదావరిఖని : దళితులపై దాడులకు, కుల వివక్షకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు పిలుపునిచ్చారు. దళితుల ఆత్మగౌరవ ఉద్యమ బస్సుయాత్ర మంగళవారం గోదావరిఖనికి చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితులపై దాడులు పెరిగాయన్నారు. దాడులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఆర్ఎస్ఎస్, గోరక్షక దళాలతో దళితులపై దాడులు చేయిస్తూ, మరోపక్క నన్ను కాల్చండి అంటున్నారని ఆరోపించారు. దేశంలో సర్వత్రా కులవివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. అంతకుముందు స్థానిక కార్పొరేషన్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ ఉపాధ్యక్షుడు సుంకరి సంపత్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.సురేశ్, కె.అశోక్, రామగుండం డివిజన్ అధ్యక్షుడు సీహెచ్.ఓదెలు, గుత్తికొండ గోపాల్, బండారి మొగిళి, నర్మెట్ల నర్సయ్య, కుంబాల లక్ష్మయ్య, నాంపెల్లి సమ్మయ్య, పి.రాము, లక్ష్మీనారాయణ, లావణ్య, జి.రమణ, పారిజాతం, నాగమణి, ఉపేందర్, ఎం.రామాచారి, లక్ష్మణ్‌రెడ్డి, వి.కుమారస్వామి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
దళితులకు సంక్షేమ పథకాలు అందాలి
మునగాల : దళితులు సామాజికంగా, ఆర్ధికంగా ఎదగాలంటే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు సకాలంలో అందాలని కులవివక్షవ్యతిరేక పోరాటకమిటీ (కేవీపీఎస్) రాష్ట్ర కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్‌బాబు తెలిపారు. పదిరోజుల క్రితం మెదక్ జిల్లాలో ప్రారంభమైన కేవీపీఎస్ బస్సుయాత్ర 25న నల్లగొండలో ప్రవేశించి మంగళవారం మునగాలకు చేరుకున్న సందర్భంగా స్థానిక నాయకులు బస్సుయాత్రకు ఘనస్వాగతం పలికారు. ఆతర్వాత హారిజన కాలనీలో ఏర్పాటు చేసిన సదస్సులో స్కైలాబ్‌బాబు మాట్లాడారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మామిడి గుర్వయ్య, కార్యదర్శి కొండమడుగు నర్సింహ, డివిజన్ కార్యదర్శి మిట్టగణుపులు సుందరం, కోట గోపి, సుధాకర్, ఎస్.జానయ్య, కిన్నెర వెంకన్న, ఎం.సురేందర్, గడ్డం లింగయ్య పాల్గొన్నారు. -
దళితులపై మూకుమ్మడి దాడులు
రియల్టరుగా మారిన చంద్రబాబు కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ తెనాలి : దళిత, పీడిత కులాల ప్రజలపై దేశంలోని అగ్రకుల భూస్వామ్య పాలకులు, హిందూ మతోన్మాదులు, సామ్రాజ్యవాదులు కలిసి ఉమ్మడిగా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక దాడులకు తెగబడుతున్నారని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ ఆరోపించారు. జూలై 17 (కారంచేడు) నుంచి ఆగస్టు 6 (చుండూరు వరకు) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజాచైతన్య యాత్ర ముగింపు సభ శనివారం ఇక్కడి ఎన్జీవో కల్యాణమండపంలో నిర్వహించారు. దళితులపై కులపరమైన దాడులు, ముస్లింలు, క్రై స్తవులపై మతపరమైన దాడులు, జనాభాలో 55 శాతంగా వున్న బీసీలపై ఆర్థికపరమైన దాడులు జరుగుతున్నాయని చెప్పారు. 15 లక్షల భూబ్యాంకు ఏర్పాటు చేశామంటూ విదేశీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత, పీడిత కులాల భూముల్ని లాక్కోవటమే కాకుండా లక్షలాది తీరప్రాంత ప్రజలను నిరాశ్రయుల్ని చేస్తున్నారని మండిపడ్డారు. నగర సుందరీకరణ పేరుతో నిరుపేదల్ని నిరాశ్రయుల్ని చేసే పనిలో ఉన్నారన్నారు. రియల్టర్‌గా మారిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యలను ప్రజల ద్వారా అడ్డుకొంటామని హెచ్చరించారు. -
దళితులపై ఉమ్మడి దాడులు
రియల్టరుగా మారిన చంద్రబాబు కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ తెనాలి : దళిత, పీడిత కులాల ప్రజలపై దేశంలోని అగ్రకుల భూస్వామ్య పాలకులు, హిందూ మతోన్మాదులు, సామ్రాజ్యవాదులు కలిసి ఉమ్మడిగా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక దాడులకు తెగబడుతున్నారని కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ ఆరోపించారు. జూలై 17 (కారంచేడు) నుంచి ఆగస్టు 6 (చుండూరు వరకు) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజాచైతన్య యాత్ర ముగింపు సభ శనివారం ఇక్కడి ఎన్జీవో కల్యాణమండపంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దళితులపై కులపరమైన దాడులు, ముస్లింలు, క్రైస్తవులపై మతపరమైన దాడులు, జనాభాలో 55 శాతంగా వున్న బీసీలపై ఆర్థికపరమైన దాడులు జరుగుతున్నాయని చెప్పారు. 15 లక్షల భూబ్యాంకు ఏర్పాటు చేశామంటూ విదేశీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత, పీడిత కులాల భూముల్ని లాక్కోవటమే కాకుండా లక్షలాది తీరప్రాంత ప్రజలను నిరాశ్రయుల్ని చేస్తున్నారని మండిపడ్డారు. నగర సుందరీకరణ పేరుతో నిరుపేదల్ని నిరాశ్రయుల్ని చేసే పనిలో ఉన్నారన్నారు. రియల్టర్‌గా మారిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యలను ప్రజల ద్వారా అడ్డుకొంటామని హెచ్చరించారు. -
దళితులపై దాడులు పెరిగాయి: కేవీపీఎస్
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాకే దళితులపై దాడులు పెరిగాయని పలువురు వక్తలు విమర్శించారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి(కెవిపిఎస్) ఆధ్వర్యంలో గుజరాత్‌లోని దళితులపై దాడులను ఖండిస్తు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మాజీ కార్యదర్శి జాన్‌వెస్లీ, టిపిఎస్‌కె కన్వీనర్ జి.రాములు, బిసి సబ్ ప్లాన్ సాధన సమితి కన్వీనర్ కిల్లే గోపాల్, డీబీఎస్ అధ్యక్షులు శంకర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.వారు మాట్లాడుతూ బీజేపీ ఒక నాడు ముస్లీం మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని అధికారంలోకి వచ్చిందని, నేడు దళితులను లక్ష్యంగా చేసుకొని బ్రాహ్మణీయ అధిపత్యాన్ని సాధించి హిందూ రాజ్యంగా మార్చటానికి కుట్ర చేస్తుందని వారు విమర్శించారు. గుజరాత్‌లోని ఊనలో గోరక్షక సమితి వారు నలుగురు దళితులపై విచక్షణ రహితంగా దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవటం సిగ్గు చేటు అని వారు అన్నారు. గుజరాత్ దళితులు చేస్తున్న ఆందోళనకు తాము కూడ మద్దతు ఇస్తున్నామని వారు చెప్పారు. వారికి మద్దతుగా పెద్ద ఎత్తున త్వరలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు జి.నాగయ్య, రాములు, ఆర్.శ్రీరాం నాయక్, సత్తార్, ఎం.డి.అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. -
కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడాలి
కేవీపీఎస్ నేత నర్సింహ పిలుపు యాచారం: కుల వివక్షపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేవీపీఎస్ రాష్ట్ర నాయకుడు ఈ. నర్సింహ పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో ఆ సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నేటికీ కొన్ని గ్రామాల్లో అగ్రవర్ణాల చేతుల్లో దళితులు అణుగుతునే ఉన్నారని అన్నారు. ఎక్కడో ఓ చోట దాడులకు గురివుతున్నారని పేర్కొన్నారు. ఎన్ని ప్రభుత్వాలు దళితుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వారికి చేరకుండా పోతున్నాయని అన్నారు. బ్యాంకులు కూడ మోసం చేసే బడా వ్యాపారులనే నమ్ముతున్నాయని, అదే కాయకష్టం చేసుకునే వారిని మాత్రం పైస రుణాలు ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నాయని అన్నారు. సమ న్యాయం వస్తే వివక్షత పోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోడ క్రిష్ణ, నాగని బుగ్గరాములు, పి.అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
దళితుల సమస్యలపై పోరాటం
దళిత ఆత్మగౌరవ ఉద్యమం కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.నాగయ్య కరీంనగర్ : దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు ‘దళిత ఆత్మగౌరవ ఉద్యమం’ చేపడుతున్నట్లు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.నాగయ్య తెలిపారు. భగత్‌నగర్‌లోని మెడికల్ రిప్స్ భవనంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇంకా దళితులను అస్పృశ్యత, అంటరానితనం వెంటాడుతుందన్నారు. దళిత వాడలో అభివృద్ధి చెందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ రుణాల మంజూరులో జాప్యమవుతుందన్నారు. ప్రజాసాంస్కృతిక వేదిక రాష్ట్ర కన్వీనర్ జి.రాములు మాట్లాడుతూ ప్రజలను ప్రజాసాంస్కృతిక విప్లవం వైపు మళ్లించాలన్నారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి టి.సురేష్, అధ్యక్షుడు కె.అశోక్, ఉపాధ్యక్షులు మర్రి వెంకటస్వామి, సంపత్, నరేందర్, కృష్ణ, నాయకులు కరుణాకర్, జిట్టు లింగామూర్తి పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట కేవీపీఎస్ ధర్నా
సుబేదారి : ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ విడుదల చేయాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్) ఆధ్వర్యంలో సోమవారం లబ్ధిదారులు, కేవీపీఎస్ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అంతకుముందు ఏకశిలా పార్కు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించా రు. డప్పుచప్పుళ్లతో ర్యాలీగా వచ్చి కలెక్టర్ కార్యాలయంలోనికి వెళ్లడానికి యత్నించా రు. కలెక్టర్ కార్యాలయంలోనికి చొచ్చుకపోవడానికి యత్నించిన కేవీపీఎస్ కార్యకర్తలను పోలీ సులు అడ్డుకున్నారు. పోలీసులు కేవీపీఎస్ కార్యకర్తలను అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగింది. దీంతో కేవీపీఎస్ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయ గేట్ల ఎదుట బైటాయించి అర్ధగంట సేపు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి టి. స్కైలాబ్‌బాబు మాట్లాడారు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ కింద గుర్తించిన లబ్ధిదారుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందన్నా రు. బ్యాంక్‌లు రుణం ఇవ్వడానికి అంగీకరించినట్లు పత్రాలు ఇచ్చిన ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేయకపోవడంతో దళితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్సిడీ రాక దళితులు ఆందోళన చెందుతున్నారని, వెంటనే గత ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులకు కేసీఆర్ ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జాయింట్ కలెక్టర్ పౌసుమి బసుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆమె చాంబర్లో కలిసి ఆ సంఘం ప్రతినిధు లు అందజేశారు. కేవీపీఎస్ అధ్యక్షుడు వేల్పుల రాజేష్, జిల్లా ఉపాధ్యక్షులు మంద మల్లేషం, సుంచు విజేందర్, డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి వి.విజయరత్నం, తెలంగాణ దళిత ఐక్యవేదిక నాయకులు తాటికొండ యాద గిరి. చర్మకారుల సంఘం జిల్లా నాయకులు కర్రె కిష్టయ్య, మాస ఈశ్వరయ్య, కేవీపీఎస్ నాయకులు కె.బాబు, ఎస్.ఎల్లయ్య, ఎడెల్లి వెంకన్న, దంతాల రవి, కె.రాములు, తారమ్మ, కమల, కవిత, ఏలియాలు పాల్గొన్నారు.