దళితులపై దాడులను ప్రతిఘటిద్దాం
Published Tue, Sep 6 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
గోదావరిఖని : దళితులపై దాడులకు, కుల వివక్షకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు పిలుపునిచ్చారు. దళితుల ఆత్మగౌరవ ఉద్యమ బస్సుయాత్ర మంగళవారం గోదావరిఖనికి చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితులపై దాడులు పెరిగాయన్నారు. దాడులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్, గోరక్షక దళాలతో దళితులపై దాడులు చేయిస్తూ, మరోపక్క నన్ను కాల్చండి అంటున్నారని ఆరోపించారు. దేశంలో సర్వత్రా కులవివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. అంతకుముందు స్థానిక కార్పొరేషన్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ ఉపాధ్యక్షుడు సుంకరి సంపత్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.సురేశ్, కె.అశోక్, రామగుండం డివిజన్ అధ్యక్షుడు సీహెచ్.ఓదెలు, గుత్తికొండ గోపాల్, బండారి మొగిళి, నర్మెట్ల నర్సయ్య, కుంబాల లక్ష్మయ్య, నాంపెల్లి సమ్మయ్య, పి.రాము, లక్ష్మీనారాయణ, లావణ్య, జి.రమణ, పారిజాతం, నాగమణి, ఉపేందర్, ఎం.రామాచారి, లక్ష్మణ్‌రెడ్డి, వి.కుమారస్వామి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement