దళితులకు సంక్షేమ పథకాలు అందాలి | dothat welfairsceems in dalithas | Sakshi
Sakshi News home page

దళితులకు సంక్షేమ పథకాలు అందాలి

Published Wed, Aug 31 2016 12:32 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

దళితులకు సంక్షేమ పథకాలు అందాలి

దళితులకు సంక్షేమ పథకాలు అందాలి

మునగాల : దళితులు సామాజికంగా, ఆర్ధికంగా ఎదగాలంటే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు సకాలంలో అందాలని కులవివక్షవ్యతిరేక పోరాటకమిటీ (కేవీపీఎస్‌) రాష్ట్ర కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్‌బాబు  తెలిపారు. పదిరోజుల క్రితం మెదక్‌ జిల్లాలో ప్రారంభమైన కేవీపీఎస్‌ బస్సుయాత్ర 25న నల్లగొండలో ప్రవేశించి మంగళవారం మునగాలకు చేరుకున్న సందర్భంగా స్థానిక నాయకులు బస్సుయాత్రకు ఘనస్వాగతం పలికారు. ఆతర్వాత హారిజన కాలనీలో ఏర్పాటు చేసిన సదస్సులో స్కైలాబ్‌బాబు మాట్లాడారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు మామిడి గుర్వయ్య, కార్యదర్శి కొండమడుగు నర్సింహ, డివిజన్‌ కార్యదర్శి మిట్టగణుపులు సుందరం,  కోట గోపి, సుధాకర్, ఎస్‌.జానయ్య, కిన్నెర వెంకన్న, ఎం.సురేందర్, గడ్డం లింగయ్య పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement