dalithas
-
అరే పప్పు నిన్ను చెప్పుతో కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్
-
దళిత హక్కుల నేత.. డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ కన్నుమూత..
సాక్షి, నార్నూర్(ఆదిలాబాద్): బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఏజెన్సీ దళితుల హక్కుల కోసం పోరాడిన దళిత నేత ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్(65) హఠాన్మరణం చెందారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుంజాల గ్రామానికి చెందిన ఆయన బుధవారం గుండెపోటుతో హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నాందేవ్ మంగళవారం ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటనలో పాల్గొన్నారు. రాత్రి తొమ్మిది గంటలకు స్వగ్రామానికి చేరుకున్నారు. ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి 2గంటల సమయంలో గుండెపోటు రావడంతో ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఉట్నూర్ నుంచి ఆదిలాబాద్‌కు చేరుకుని తన సొంత వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాందేవ్ మృతిచెందారు. ఆయన స్వగ్రామం గుంజాలలో విషాదం నెలకొంది. గురువారం ఉదయం 11 గంటలకు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. స్వయంకృషితో ఎదిగారు.. నాందేవ్ వ్యవసాయ కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయనకు భార్య సత్యభామ, ఐదుగురు కూతుళ్లు, నలుగురు కుమారులు ఉన్నారు. రెండేళ్ల క్రితం కుమారుడు అనారోగ్యంతో చనిపోయాడు. నాందేవ్ 1990లో విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్‌గా పని చేస్తూనే ఏ1కాంట్రాక్టర్‌గా ఎదిగారు. 1989లో పీఏసీఎస్ తాడిహత్నూర్‌కు చైర్మన్‌గా తొలిసారి ఎన్నికయ్యారు. 1994–95లో జరిగిన ఎన్నికల్లో నార్నూర్ పీఏసీఎస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆరు సార్లు చైర్మన్‌గా ఎన్నిక కావడంతోపాటు ఆరు సార్లు డీసీసీబీ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. 1997లో ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా దళితుల సమస్యలపై పోరాటం చేశారు. 1/70 చట్టంతో ఏజెన్సీ ప్రాంత దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, దళితుల సాగు భూములకు పట్టాలు, పహాణి పత్రాలు ఇవ్వాలని, ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేయాలని అప్పటి ముఖ్యమంత్రులు వైఎస్ఆర్, చంద్రబాబు, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దళితులకు పహాణి పత్రాలు ఇప్పించారు. డీసీసీబీ చైర్మన్‌గా ఉంటూనే ఏజెన్సీ దళితులకు రైతుబంధు, రైతుబీమా వర్తింప చేయాలని తీవ్ర ప్రయత్నం చేశారు. టీడీపీలో సామాన్య కార్యకర్తగా అడుగుపెట్టి తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2020–21ఫిబ్రవరిలో జరిగిన పీఏసీఎస్ ఎన్నికల్లో చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి ఐకే రెడ్డి సంతాపం నిర్మల్‌రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ హఠాన్మరణంపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నాందేవ్ మృతి బాధాకరమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఇక్కడ చిలుకలు కత్తులు దూస్తాయి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఇక్కడ చిలుకలు కత్తులు దూస్తాయి.. చీమలు పాములను బెదిరిస్తాయి.. సిక్కోలు గురించి ఎప్పుడో స్థిరపడిన ఈ నానుడిని ప్రజా గాయకుడు గద్దర్ మరోసారి గుర్తు చేశారు. శ్రీకాకుళంలో ఆదివారం రాత్రి ఆయన ఓ ప్రైవేటు హోటల్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 40 కోట్ల మంది దళితులు ఉన్నారని, వారిపై జరుగుతున్న దాడులను వ్యతిరేకించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. 1970లోనే సిక్కోలులో ఉద్యమాలు ప్రారంభమయ్యాయని, ఇది ఉద్యమాల పురిటి గడ్డ అని అన్నారు. దళితులపై దాడులు అరికట్టాలంటే రాష్ట్రంలో ఉన్న దళిత ఎంపీలు, కేంద్ర మంత్రులు ఏకకాలంలో రాజీనామాలు చేయాలన్నారు. అలా చేస్తేనే ఈ తరహా దాడులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయని అన్నారు. దళితులకు రాజ్యాంగంలో పొందుపరిచిన 89 యాక్ట్‌ను నిర్వీర్యం చేసి దాన్ని సవరించడం సరికాదన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన ప్రజాప్రతినిధులు అవినీతిలో కూరుకుపోయి, దాని నుంచి తప్పించుకునేందుకు అనేక చట్టాలను సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని నిర్జీవంగా తయారు చేశారని మండిపడ్డారు. మత, కుల, ప్రాంతం, భాష పిచ్చితో నీతి నిజాయితీ, సామాజిక అభివృద్ధిని ఖూనీ చేస్తున్నారని అన్నారు. దళిత ప్రజల రక్షణ కు ఏ విధమైన విధానాలు కావాలో తయారు చేసి దానికి ఏ పార్టీ మద్దతిస్తే వారికే సహకరిస్తామని చెప్పాలని, లేకుంటే తమ ఓట్లతో తగిన బుద్ధి చెబుతామని ఎదురు తిరగాలని సూచించారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లు దోపిడీ చేసి తమకు ఇష్టం వచ్చినట్లు కార్పొరేట్లకు అనుకూలంగా పాలన కొనసాగిస్తున్నారన్నారు. సమాజంలో అందరితోపాటుగా సమాన హోదా కల్పించనాడే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలి పారు. నేటి ప్రభుత్వాలు ప్రపంచబ్యాంకులు, ఎమ్ఎన్సీ, డబ్ల్యూటిఓ, సెజ్లతో చేతులు కలిపి పూర్తిగా పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిని గాలికి వదిలేస్తున్నాయని ఆరోపించారు. విద్య, వైద్యం ఉచితంగా అందించిన నాడే సమాజం అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా దళిత మహాసభ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బెంజిమన్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు వివాదాస్పదమైన తీర్పునిచ్చిందని, అందుకు నిరసనగా నేడు శ్రీకాకుళం నగరంలో దళిత ప్రజల మానవ హక్కుల మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్దర్ హాజరవుతున్నారని తెలిపారు. దళిత మహాసభను శ్రీకాకుళం నగరంలో ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్లో సోమవారం సాయంత్రం 3.30గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు జిల్లాలో గల దళితులంతా అధిక సంఖ్యలో హాజరవ్వాలని కోరారు. -
30 లక్షల మందితో దళిత సింహగర్జన
రాజేంద్రనగర్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకునేందుకు దళిత సోదరులు ముందుకు రావాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మంగళవారం గండిపేట మండలంలోని బండ్లగూడ కాళీమందిర్ వద్ద నిర్వహించిన దళిత సంఘాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జూన్ 10వ తేదీన దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలను కలుపుకుంటూ వరంగల్‌లో భారీ సభను నిర్వహిస్తున్నామన్నారు. దాదాపు 30 లక్షల మందితో దళిత సింహగర్జన మహాసభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి దళితులంతా హాజరై విజయవంతం చేయాలన్నారు. తమ హక్కులను సాధించుకునేందుకు పోరాటం ఒక్కటే మార్గమన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జీ వనం నర్సింహమాదిగ, గండిపేట ఇన్చార్జి ఐత రమేష్‌బాబు, గండిపేట మండల అధ్యక్షుడు యాదవరావు, ప్రవీణ్‌మాదిగ, శివ, మాదిలేటి మాదిగ, శంకర్రావు, సత్యనారాయణ, నరేందర్, జగన్ తదితరులు పాల్గొన్నారు. -
దళితులకు సంక్షేమ పథకాలు అందాలి
మునగాల : దళితులు సామాజికంగా, ఆర్ధికంగా ఎదగాలంటే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు సకాలంలో అందాలని కులవివక్షవ్యతిరేక పోరాటకమిటీ (కేవీపీఎస్) రాష్ట్ర కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్‌బాబు తెలిపారు. పదిరోజుల క్రితం మెదక్ జిల్లాలో ప్రారంభమైన కేవీపీఎస్ బస్సుయాత్ర 25న నల్లగొండలో ప్రవేశించి మంగళవారం మునగాలకు చేరుకున్న సందర్భంగా స్థానిక నాయకులు బస్సుయాత్రకు ఘనస్వాగతం పలికారు. ఆతర్వాత హారిజన కాలనీలో ఏర్పాటు చేసిన సదస్సులో స్కైలాబ్‌బాబు మాట్లాడారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మామిడి గుర్వయ్య, కార్యదర్శి కొండమడుగు నర్సింహ, డివిజన్ కార్యదర్శి మిట్టగణుపులు సుందరం, కోట గోపి, సుధాకర్, ఎస్.జానయ్య, కిన్నెర వెంకన్న, ఎం.సురేందర్, గడ్డం లింగయ్య పాల్గొన్నారు.