
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ
రాజేంద్రనగర్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకునేందుకు దళిత సోదరులు ముందుకు రావాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మంగళవారం గండిపేట మండలంలోని బండ్లగూడ కాళీమందిర్ వద్ద నిర్వహించిన దళిత సంఘాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జూన్ 10వ తేదీన దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలను కలుపుకుంటూ వరంగల్‌లో భారీ సభను నిర్వహిస్తున్నామన్నారు.
దాదాపు 30 లక్షల మందితో దళిత సింహగర్జన మహాసభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి దళితులంతా హాజరై విజయవంతం చేయాలన్నారు. తమ హక్కులను సాధించుకునేందుకు పోరాటం ఒక్కటే మార్గమన్నారు.
కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జీ వనం నర్సింహమాదిగ, గండిపేట ఇన్‌చార్జి ఐత రమేష్‌బాబు, గండిపేట మండల అధ్యక్షుడు యాదవరావు, ప్రవీణ్‌మాదిగ, శివ, మాదిలేటి మాదిగ, శంకర్‌రావు, సత్యనారాయణ, నరేందర్, జగన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment