కలెక్టరేట్ ఎదుట కేవీపీఎస్ ధర్నా
సుబేదారి : ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ విడుదల చేయాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్) ఆధ్వర్యంలో సోమవారం లబ్ధిదారులు, కేవీపీఎస్ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అంతకుముందు ఏకశిలా పార్కు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించా రు. డప్పుచప్పుళ్లతో ర్యాలీగా వచ్చి కలెక్టర్ కార్యాలయంలోనికి వెళ్లడానికి యత్నించా రు. కలెక్టర్ కార్యాలయంలోనికి చొచ్చుకపోవడానికి యత్నించిన కేవీపీఎస్ కార్యకర్తలను పోలీ సులు అడ్డుకున్నారు. పోలీసులు కేవీపీఎస్ కార్యకర్తలను అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగింది.
దీంతో కేవీపీఎస్ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయ గేట్ల ఎదుట బైటాయించి అర్ధగంట సేపు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి టి. స్కైలాబ్‌బాబు మాట్లాడారు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ కింద గుర్తించిన లబ్ధిదారుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందన్నా రు. బ్యాంక్‌లు రుణం ఇవ్వడానికి అంగీకరించినట్లు పత్రాలు ఇచ్చిన ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేయకపోవడంతో దళితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్సిడీ రాక దళితులు ఆందోళన చెందుతున్నారని, వెంటనే గత ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులకు కేసీఆర్ ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ధర్నా అనంతరం జాయింట్ కలెక్టర్ పౌసుమి బసుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆమె చాంబర్‌లో కలిసి ఆ సంఘం ప్రతినిధు లు అందజేశారు. కేవీపీఎస్ అధ్యక్షుడు వేల్పుల రాజేష్, జిల్లా ఉపాధ్యక్షులు మంద మల్లేషం, సుంచు విజేందర్, డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి వి.విజయరత్నం, తెలంగాణ దళిత ఐక్యవేదిక నాయకులు తాటికొండ యాద గిరి. చర్మకారుల సంఘం జిల్లా నాయకులు కర్రె కిష్టయ్య, మాస ఈశ్వరయ్య, కేవీపీఎస్ నాయకులు కె.బాబు, ఎస్.ఎల్లయ్య, ఎడెల్లి వెంకన్న, దంతాల రవి, కె.రాములు, తారమ్మ, కమల, కవిత, ఏలియాలు పాల్గొన్నారు.