కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడాలి | Fight against caste discrimination | Sakshi
Sakshi News home page

కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడాలి

Published Sun, Jul 24 2016 11:04 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM

కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడాలి - Sakshi

కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడాలి

కేవీపీఎస్‌ నేత నర్సింహ పిలుపు

యాచారం: కుల వివక్షపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేవీపీఎస్‌ రాష్ట్ర నాయకుడు ఈ. నర్సింహ పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో ఆ సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నేటికీ కొన్ని గ్రామాల్లో అగ్రవర్ణాల చేతుల్లో  దళితులు అణుగుతునే ఉన్నారని అన్నారు. ఎక్కడో ఓ చోట దాడులకు గురివుతున్నారని పేర్కొన్నారు. ఎన్ని ప్రభుత్వాలు దళితుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వారికి చేరకుండా పోతున్నాయని అన్నారు. బ్యాంకులు కూడ మోసం చేసే బడా వ్యాపారులనే నమ్ముతున్నాయని, అదే కాయకష్టం చేసుకునే వారిని మాత్రం పైస రుణాలు ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నాయని అన్నారు. సమ న్యాయం వస్తే వివక్షత పోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోడ క్రిష్ణ, నాగని బుగ్గరాములు, పి.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement