లేడీ సింగమ్ సవారీ! | Actor Suriya teaches wife Jothika to ride a bullet | Sakshi
Sakshi News home page

లేడీ సింగమ్ సవారీ!

Published Thu, Sep 15 2016 11:08 PM | Last Updated on Wed, Apr 3 2019 8:56 PM

లేడీ సింగమ్ సవారీ! - Sakshi

లేడీ సింగమ్ సవారీ!

అది చెన్నైలోని ఓ రోడ్. తెల్లవారుజాము కావడంతో పెద్దగా రద్దీగా లేదు. స్టార్ కపుల్ సూర్య, జ్యోతికలు ఆ రోడ్ మీదున్నారు. వచ్చే పోయేవాళ్లు ఈ జంటను ఆసక్తిగా చూడటం మొదలుపెట్టారు. బ్రాండ్ న్యూ రాయల్ ఎన్‌ఫీల్డ్ మీద లేడీ సింగమ్‌లా జ్యోతిక సవారీ చేస్తున్నారు. జ్యోతికకు బండి నడపడం వచ్చా.. వంటి సందేహాలు అవసరం లేదు. పక్కనున్న దర్శకుడు ఎవరనుకున్నారు? సింగమ్ సూర్య. బండి ఎలా నడపాలో దగ్గరుండి మరీ శ్రీమతికి ట్రైనింగ్ ఇస్తున్నారు.
 
 జ్యోతిక ఇంటిలిజెంట్ స్టూడెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే సునాయాసంగానే నేర్చేసుకున్నారు. రయ్.. రయ్.. మంటూ జ్యోతిక సవారీ చేస్తుంటే, ఆమెను గమనిస్తూ సూర్య వెనకాలే నడుచుకుంటూ వెళ్లారు. శ్రీమతి ముచ్చటపడిందని సూర్య బైక్ రైడింగ్ నేర్పారో? లేదా ఏదైనా కొత్త సినిమా కోసం జ్యోతిక ట్రైనింగ్ తీసుకున్నారో? త్వరలోనే తెలుస్తుంది. ఆ విషయం పక్కన పెడితే.. సూర్య, జ్యోతికలు ఎంత హ్యాపీ కపుల్ అనేది ఈ ఫొటోలు చూస్తే అర్థమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement