బెంగళూరు యువతులతో హైటెక్ వ్యభిచారం | Cops Ride Prostitution Center In Mahabubnagar | Sakshi
Sakshi News home page

బెంగళూరు యువతులతో హైటెక్ వ్యభిచారం

Published Mon, Aug 8 2022 1:23 PM | Last Updated on Mon, Aug 8 2022 1:24 PM

Cops Ride Prostitution Center In Mahabubnagar - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మహబూబ్‌నగర్ (గద్వాల క్రైం): జిల్లా కేంద్రంలోని ఓ వ్యభిచార గృహంపై ఆదివారం పోలీసులు దాడులు చేశారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యొన్నబత్తిని రమాదేవి(ఒంగోలు), సాంబశివరావు(విజయవాడ) కొంతకాలంగా గద్వాల పట్టణ శివారులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

 బెంగళూరు, ఒంగోలు నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సమాచారం అందడంతో పట్టణంలోని బీరోలు రోడ్డు(తాయమ్మ దేవాలయం) సమీపంలోని ఇంటిపై దాడులు చేశారు. నిర్వాహకులతోపాటు చెనుగోనిపల్లికి చెందిన యువకులు ఎం.డి ఫాయాజ్, ఎండి సోహెల్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ గదిలోని సెల్‌ఫోన్‌లు స్వాదీనం చేసుకున్నారు. వారిని పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. మరొకరు పరారయ్యారని స్థానికులు తెలిపారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement