రెండో రైడ్‌కు రెడీ | Bhushan Kumar confirms the sequel to Raid starring Ajay Devgn | Sakshi
Sakshi News home page

రెండో రైడ్‌కు రెడీ

Published Sat, Apr 25 2020 4:19 AM | Last Updated on Sat, Apr 25 2020 4:19 AM

 Bhushan Kumar confirms the sequel to Raid starring Ajay Devgn - Sakshi

అజయ్‌ దేవగన్

అజయ్‌ దేవగన్‌ హీరోగా రాజ్‌కుమార్‌ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రైడ్‌’ (2018) చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. బాక్సాఫీసు వద్ద చెప్పుకోదగ్గ వసూళ్లను కూడా రాబట్టిందీ చిత్రం. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘రైడ్‌ 2’ను సెట్స్‌పైకి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ‘రైడ్‌’ చిత్రనిర్మాతల్లో ఒకరైన భూషణ్‌కుమార్‌ తెలిపారు. ‘‘ప్రస్తుతం ‘రైడ్‌ 2’ స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. తొలి పార్ట్‌ సక్సెస్‌ సాధించింది. దీంతో సీక్వెల్‌పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను చేరుకునేలా సీక్వెల్‌ను ప్లాన్‌ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు భూషణ్‌కుమార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement