Rajkumar Gupta
-
సల్మాన్ ఖాన్ నటించనున్న తొలి బయోపిక్! వివరాలివే..
గూఢచారిగా మారనున్నారు బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్. హిందీ ‘రైడ్’ (2018)తో హిట్ అందుకున్న దర్శకుడు రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలోనే సల్మాన్ గూఢచారిగా కనిపించనున్నారని టాక్. ఆల్రెడీ సల్మాన్‌ను రాజ్‌కుమార్ గుప్తా కలిసి కథ చెప్పారట. ఈ చిత్రం భారతీయ గూఢచారి రవీంద్ర కౌశిక్ జీవితం ఆధారంగా రూపొందనుందని సమాచారం. ఇందులో రవీంద్ర కౌశిక్ పాత్రలో సల్మాన్ నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. రవీంద్ర కౌశిక్‌కు బ్లాక్ టైగర్‌గా కూడా పేరుంది. ప్రస్తుతం ‘టైగర్ 3’తో బిజీగా ఉన్న సల్మాన్ ఆ తర్వాత ఫర్హాద్ సామ్జీ డైరెక్షన్లో ‘భాయీజాన్’లో నటిస్తారు. ఈ చిత్రానికి ముందు ‘కభీ ఈద్ కభీ దీవాలి’ అని టైటిల్ పెట్టారు. అయితే ‘భాయీజాన్’గా మార్చారట. ఆ నెక్ట్స్ సల్మాన్‌ఖాన్, రాజ్‌కుమార్ గుప్తా కాంబినేషన్లో రవీంద్ర కౌశిక్ బయోపిక్ సెట్స్‌పైకి వెళుతుందని ఊహించవచ్చు. ఇదిలా ఉంటే 32 ఏళ్ల కెరీర్లో సల్మాన్ నటించనున్న తొలి బయోపిక్ ఇదే కావడం విశేషం. -
రెండో రైడ్‌కు రెడీ
అజయ్ దేవగన్ హీరోగా రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రైడ్’ (2018) చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. బాక్సాఫీసు వద్ద చెప్పుకోదగ్గ వసూళ్లను కూడా రాబట్టిందీ చిత్రం. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘రైడ్ 2’ను సెట్స్‌పైకి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ‘రైడ్’ చిత్రనిర్మాతల్లో ఒకరైన భూషణ్‌కుమార్ తెలిపారు. ‘‘ప్రస్తుతం ‘రైడ్ 2’ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. తొలి పార్ట్ సక్సెస్ సాధించింది. దీంతో సీక్వెల్‌పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను చేరుకునేలా సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు భూషణ్‌కుమార్. -
మళ్లీ రైడ్
గత ఏడాది హీరో అజయ్ దేవగన్ బాలీవుడ్ వెండితెరపై చేసిన ‘రైడ్’ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దీంతో మళ్లీ ‘రైడ్’ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అజయ్. తొలి రైడ్‌లో అజయ్ సరసన హీరోయిన్గా నటించిన ఇలియానాయే మలి రైడ్‌లోనూ నటించబోతున్నారని బాలీవుడ్ సమాచారం. 1980 నేపథ్యంలో అప్పటి వాస్తవ సంఘటనల ఆధారంగా రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో ‘రైడ్’ చిత్రం తెరకెక్కింది. తాజాగా మరో భారీ ఐటీ రైడ్ నేపథ్యంలో ‘రైడ్’కు సీక్వెల్ తీయాలనే ఆలోచనలో ఉన్నారట అజయ్ దేవగన్. ఇందుకు తగిన కథాచర్చలు కూడా జరుగుతున్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి.. రెండో ‘రైడ్’కు కూడా రాజ్‌కుమార్ గుప్తాయే దర్శకత్వం వహిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
మోస్ట్ వాంటెడ్!
ఇక్కడున్న ఫొటో చూసి అర్జున్ కపూర్‌నే మోస్ట్ వాంటెడ్ అనుకోకండి. ఆయన కాదు. వేరే వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో సినిమాలో చూపిస్తారట. ఈ మోస్ట్ వాంటెడ్ పర్సన్‌ను పట్టుకోవడం కోసమే అర్జున్ కపూర్ ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవతారం ఎత్తారు. ‘రైడ్’ ఫేమ్ రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో అర్జున్ కపూర్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’. ఈ సినిమా షూటింగ్ ముంబైలో మొదలైంది. ‘‘కొత్త సినిమా మొదలైన ప్రతిసారి ఏదో న్యూ మిషన్ స్టార్ట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు మొదలైన ఈ ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’ చిత్రం నా కెరీర్లో 12వది’’ అన్నారు అర్జున్ కపూర్. ఫస్ట్ షెడ్యూల్‌ను ముంబైలో కంప్లీట్ చేసిన తర్వాత నెక్ట్స్ షెడ్యూల్‌ను నేపాల్‌లో ప్లాన్ చేశారు. అన్నట్లు.. ఈ మోస్ట్ వాంటెడ్ పర్సన్ ఎప్పుడు దొరకుతాడో తెలుసా? వచ్చే ఏడాది మే 24న. అదే సినిమా రిలీజ్ డేట్ అని చెబుతున్నాం. -
పచ్చజెండా ఊపితే ఏం పోతుంది?
కత్రినా కైఫ్ అందచందాలు చూసి రేఖ అసూయకు గురయ్యారా? కరీనా మనసెందుకు ఆ సినిమాపై మొగ్గలేదు? ఆ సినిమాను ఆలియా భట్ ఎందుకు వద్దనుకున్నారు? దర్శక, నిర్మాతలను కంగనా డైలమాలో పడేశారా? ప్రస్తుతం హిందీ రంగంలో ఈ కథానాయికల గురించి జరుగుతున్న చర్చ ఇది. ఒక సినిమా ఒప్పుకుని, తీరా చిత్రీకరణ మొదలుపెట్టేసరికి తప్పుకున్నా... కారణాలు చెప్పకుండా సినిమా తిరస్కరించినా.... చర్చ మొదలవుతుంది. అలా ఈ నలుగురు తారలూ ఇప్పుడు చర్చనీయాంశాలు అయ్యారు. ఇంతకీ వీళ్లు వదులుకున్న చిత్రాలేంటి?... దాని వెనుక కథేంటి? అభద్రతాభావంతో... అందాల అభినేత్రి రేఖ ‘ఫితూర్’ చిత్రంలో ‘మిస్ హవీశమ్’ అనే పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు. అది వృద్ధురాలి పాత్ర. కానీ, పెళ్లి కూతురిలా అనుకుని, ఎప్పుడూ అలానే అలకరించుకుంటుంది హవీశమ్. ఈ పాత్ర ఆసక్తికరంగా ఉంటుందనీ, కథకు కీలకమనీ చిత్రదర్శకుడు అభిషేక్ కపూర్ పేర్కొన్నారు. రేఖ కొన్నాళ్లు చిత్రీకరణలో కూడా పాల్గొన్నారు. కానీ, చిత్రకథానాయిక కత్రినా కైఫ్ అందం ముందు తాను వెలతెలపోతున్నానని రేఖ భావించారట. అభద్రతాభావానికి గురై, ఏకంగా ఈ చిత్రం నుంచే ఆమె తప్పుకున్నారనే ఊహాగానాలున్నాయి. ఆ తర్వాత రేఖ స్థానంలో టబూను తీసుకున్నారు. ‘సెక్షన్ 84’కి నో! కథానాయిక ప్రాధాన్యంతో సాగే ‘సెక్షన్ 84’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాలనుకున్నారు రాజ్‌కుమార్ గుప్తా. మానసిక వైకల్యం ఉన్న మహిళ చుట్టూ తిరిగే కథ ఇది. ఏం చేస్తున్నామో గ్రహించలేని ఆ మహిళ ఓ నేరానికి పాల్పడుతుంది. మానసిక వైకల్యం ఉన్న వ్యక్తి నేరం చేస్తే శిక్ష వేయాలా? అనే కథాంశంతో సాగే ఈ చిత్రంలో కరీనా కపూర్‌ను కథానాయికగా తీసుకోవాలనుకున్నారు. ఈ పాత్రలోకి కరీనా పరకాయ ప్రవేశం చేయగలరన్నది ఆయన నమ్మకం. కానీ, కరీనాకు అపనమ్మకమో ఏమో ఈ చిత్రాన్ని తిరస్కరించారు. వాస్తవానికి ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించాలనుకున్నారు. కానీ, కరీనా తిరస్కరించడంతో జాప్యమైంది. సినిమా డైలమాలో పడింది. ఏమో దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో? బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కంగనా రనౌత్ చేతి నిండా అవకాశాలే. దేనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలో తెలియని పరిస్థితి. ఈ అవకాశాల్లో జపనీస్ చిత్రం ‘ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్’ చిత్రం ఒకటి. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో సైఫ్ అలీఖాన్, కంగనా రనౌత్ జంటగా ఈ చిత్రం రూపొందనుందనే వార్త వచ్చింది. కంగనను ఈ చిత్రం కోసం సంప్రతించారట. కానీ, ఆమె వైపు నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదట. ‘ఈ సినిమా నుంచి తప్పుకున్నారట’ అని ఎవరైనా కంగనను అడిగితే, ‘నేను ఒప్పుకున్నదెప్పుడు?’ అని ఆమె రివర్స్‌లో అడుగుతున్నారట. ‘ఇంతకీ ఈ సినిమా చేయాలనుకుంటున్నారా?’ అంటే మౌనం వహిస్తున్నారట. చేతిలో ఉన్న ఇతర సినిమాలతో పోల్చి చూసుకొని, అప్పుడు గ్రీన్‌సిగ్నల్ ఇస్తారట. అప్పటివరకూ దర్శకుడికి వెయిటింగే. మరో ప్రేమకథ చేయడం ఇష్టం లేక...! కుర్రకారు కలల రాణి ఆలియా భట్ ఒక సినిమాను తిరస్కరించడంవల్ల అది ఇప్పటివరకూ ఆరంభం కాలేదు. ఆ చిత్రం పేరు ‘రాబ్తా’. హోమీ అడజానియా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన ఆలియా భట్‌ను కథానాయికగా తీసుకోవాలనుకున్నారు. కానీ, ఆలియా ఈ చిత్రాన్ని నిర్మొహమాటంగా తిరస్కరించేశారు. ఇప్పటికే ‘షాన్‌దార్’, ‘ఉడ్తా పంజాబ్’, ‘కపూర్ అండ్ సన్స్’ వంటి ప్రేమకథా నేపథ్యంలో సాగే చిత్రాల్లో నటిస్తున్నందున మరో లవ్‌స్టోరీలో నటించడం ఇష్టం లేక ‘రాబ్తా’ను తిరస్కరించారనే వార్త ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా ఈ కథలో వేరే కథానాయికను దర్శకుడు ఊహించుకోలేకపోతున్నారట. ఆలియాకు బదులుగా వేరే ఎవరైతే బాగుంటుందో ఆలోచిస్తున్నారట. ఈ కారణంగా ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ చిత్రం అక్కడే ఆగింది. మొత్తం మీద కరీనా, కంగనా, ఆలియా భట్లు దర్శక, నిర్మాతలను డైలమాలో పడేశారు. పాపం ఈ దర్శక, నిర్మాతల పరిస్థితి చూసి, ‘ఈ ముద్దుగుమ్మలు పచ్చజెండా ఊపితే ఏం పోతుంది? మహా అయితే సినిమా తీస్తారు? అంతేగా’.. అని పరిశ్రమ జనం చెప్పుకుంటున్నారు.