ఇక్కడున్న ఫొటో చూసి అర్జున్ కపూర్‌నే మోస్ట్ వాంటెడ్ అనుకోకండి. ఆయన కాదు. వేరే వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో సినిమాలో చూపిస్తారట. ఈ మోస్ట్ వాంటెడ్ పర్సన్‌ను పట్టుకోవడం కోసమే అర్జున్ కపూర్ ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవతారం ఎత్తారు. ‘రైడ్’ ఫేమ్ రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో అర్జున్ కపూర్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’.
ఈ సినిమా షూటింగ్ ముంబైలో మొదలైంది. ‘‘కొత్త సినిమా మొదలైన ప్రతిసారి ఏదో న్యూ మిషన్ స్టార్ట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు మొదలైన ఈ ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’ చిత్రం నా కెరీర్‌లో 12వది’’ అన్నారు అర్జున్ కపూర్. ఫస్ట్ షెడ్యూల్‌ను ముంబైలో కంప్లీట్ చేసిన తర్వాత నెక్ట్స్ షెడ్యూల్‌ను నేపాల్‌లో ప్లాన్ చేశారు. అన్నట్లు.. ఈ మోస్ట్ వాంటెడ్ పర్సన్ ఎప్పుడు దొరకుతాడో తెలుసా? వచ్చే ఏడాది మే 24న. అదే సినిమా రిలీజ్ డేట్ అని చెబుతున్నాం.
మోస్ట్ వాంటెడ్!
Published Wed, Aug 15 2018 1:33 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment