
ఏసీబీకి చిక్కిన కానిస్టేబుల్
హైదరాబాద్ : నగరంలోని పహడీషరీప్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాలు..కానిస్టేబుల్ జనార్థన్, అలీ అనే వ్యక్తిని రూ. 4 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ మేరకు అలీ ఏసీబీ అధికారులను అశ్రయించాడు. దీంతో కానిస్టేబుల్ పై నిఘా వేశారు. కాగా సోమవారం అలీ నుంచి కానిస్టేబుల్ లంచం తీసుకుంటుండగా పథకం ప్రకారం పట్టుకున్నారు.
(పహడీషరీప్)