
టొరంటో: సరదాగా పార్కులో గడుపుదామనుకుని అక్కడికి విచ్చేసిన సందర్శకులకు చేదు అనుభవం ఎదురైంది. వారు ఎక్కిన లాంబర్‌జాక్ రైడ్ పైకి వెళ్లాక హఠాత్తుగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో చిక్కుకుపోయిన సందర్శకులు 30 నిమిషాలపాటు తలకిందులుగా వేలాడుతూ సాయంకోసం అరి్థంచారు.
కెనడాలోని ఒంటారియా నగరంలోని వండర్‌ల్యాండ్ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. రైడ్‌లో భాగంగా అందులో కూర్చున్న వారంతా అలా గాల్లో తలకిందులుగా వేలాడుతూ హాహాకారాలు చేస్తున్న వీడియో ప్రసుత్తం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఎట్టకేలకు 30 నిమిషాలకు అందరినీ ఎలాగోలా కిందకు సురక్షితంగా తీసుకొచ్చారు. అంతసేపు తలకిందులుగా వేలాడటంతో కొందరు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment