Lumber
-
గాల్లో తలకిందులుగా 30 నిమిషాలు.
టొరంటో: సరదాగా పార్కులో గడుపుదామనుకుని అక్కడికి విచ్చేసిన సందర్శకులకు చేదు అనుభవం ఎదురైంది. వారు ఎక్కిన లాంబర్‌జాక్ రైడ్ పైకి వెళ్లాక హఠాత్తుగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో చిక్కుకుపోయిన సందర్శకులు 30 నిమిషాలపాటు తలకిందులుగా వేలాడుతూ సాయంకోసం అరి్థంచారు. కెనడాలోని ఒంటారియా నగరంలోని వండర్ల్యాండ్ అమ్యూజ్మెంట్ పార్క్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. రైడ్‌లో భాగంగా అందులో కూర్చున్న వారంతా అలా గాల్లో తలకిందులుగా వేలాడుతూ హాహాకారాలు చేస్తున్న వీడియో ప్రసుత్తం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఎట్టకేలకు 30 నిమిషాలకు అందరినీ ఎలాగోలా కిందకు సురక్షితంగా తీసుకొచ్చారు. అంతసేపు తలకిందులుగా వేలాడటంతో కొందరు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. -
ఎర్రచందనం పేరుతో దగా
నిందితుల అరెస్ట్ కల్వకుర్తి రూరల్ : మండలంలోని కుర్మిద్ద గ్రామంలోని ఓ మామిడితోటలో ఉంచిన దుంగలు ఎర్ర చందనం కాదని, సండ్ర కలప దుంగలని ఎస్ఐ జలంధర్‌రెడ్డి తెలిపారు. ఎర్రచందనం పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నించి తమ చేతికి చిక్కారని చెప్పారు. గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కొల్లాపూర్ తాలూకా పెద్దకొత్తపల్లికి చెందిన నాయినంపల్లి భాస్కర్‌రెడ్డి, పర్వతాలు, ముల్లచింతలపల్లికి చెందిన చింతపల్లి భాస్కర్ కుర్మిద్ద గ్రామంలో తోటలో కలపను నిల్వ ఉంచారని చెప్పారు. పోలీసులు ఎర్రచందనం వ్యాపారుల పేరుతో వెళ్లి పర్వతాలును, రితీష్‌ను అదుపులోకి తీసుకోగా భాస్కర్‌రెడ్డి, భాస్కర్ పరారయ్యారని వెల్లడించారు.