ఎర్రచందనం పేరుతో దగా
నిందితుల అరెస్ట్
కల్వకుర్తి రూరల్ : మండలంలోని కుర్మిద్ద గ్రామంలోని ఓ మామిడితోటలో ఉంచిన దుంగలు ఎర్ర చందనం కాదని, సండ్ర కలప దుంగలని ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి తెలిపారు. ఎర్రచందనం పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నించి తమ చేతికి చిక్కారని చెప్పారు. గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కొల్లాపూర్ తాలూకా పెద్దకొత్తపల్లికి చెందిన నాయినంపల్లి భాస్కర్‌రెడ్డి, పర్వతాలు, ముల్లచింతలపల్లికి చెందిన చింతపల్లి భాస్కర్ కుర్మిద్ద గ్రామంలో తోటలో కలపను నిల్వ ఉంచారని చెప్పారు. పోలీసులు ఎర్రచందనం వ్యాపారుల పేరుతో వెళ్లి పర్వతాలును, రితీష్‌ను అదుపులోకి తీసుకోగా భాస్కర్‌రెడ్డి, భాస్కర్ పరారయ్యారని వెల్లడించారు.