Ontario
-
విమానం గాల్లో ఉండగా ఊడిపోయిన డోర్.. వీడియో వైరల్
అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా.. ఎయిర్‌క్రాఫ్ట్ డోర్ ఒక్కసారిగా ఊడిపోయింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 9(1282) విమానం పోర్టులాండ్ నుంచి ఒంటారియాకు(కెనడా) గురువారం సాయంత్రం బయలు దేరింది. 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్ టేకాఫ్ అయిన కొంత సమయానికే మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ విమానం నుంచి పూర్తిగా విడిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు. వెంటనే గమనించిన పైలెట్.. విమానాన్ని తిరిగి పోర్ట్లాండ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. 🚨#BREAKING: Alaska Airlines Forced to Make an Emergency Landing After Large Aircraft Window Blows Out Mid-Air ⁰⁰📌#Portland | #Oregon ⁰A Forced emergency landing was made of Alaska Airlines Flight 1282 at Portland International Airport on Friday night. The flight, traveling… pic.twitter.com/nt0FwmPALE — R A W S A L E R T S (@rawsalerts) January 6, 2024 విమానం ఆకాశంలో ఉండగా డోర్ ఊడిపోయి సమయం దృశ్యాలను ప్రయాణికులు వీడియో తీయగా.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై అలస్కా ఎయిర్‌లైన్స్ స్పందించింది. ఈ ఘటనతో ప్రభావితులైన ప్రయాణికులు, సిబ్బంది పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. AS1282 from Portland to Ontario, CA experienced an incident this evening soon after departure. The aircraft landed safely back at Portland International Airport with 171 guests and 6 crew members. We are investigating what happened and will share more as it becomes available. — Alaska Airlines (@AlaskaAir) January 6, 2024 ఇక ఈ సంఘటన అనంతరం అలాస్కా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ‘ఫ్లైట్ 1282లో గురువారం రాత్రి జరిగిన పరిణామంతో మా బోయింగ్ 737-9కు సంబంధించిన 65 విమానాలను ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తాత్కాలికంగా నేలకు పరిమితం చేస్తున్నాం’ అని ఎయిర్లైన్సన్ సీఈవో బెన్స్ మినికుచి పేర్కొన్నారు. పూర్తి మెయింటెనెన్స్, సేఫ్టీ తనిఖీల తర్వాత ప్రతి విమానం తిరిగి సేవలందించనున్నట్లు ఆయన తెలిపారు. -
గాల్లో తలకిందులుగా 30 నిమిషాలు.
టొరంటో: సరదాగా పార్కులో గడుపుదామనుకుని అక్కడికి విచ్చేసిన సందర్శకులకు చేదు అనుభవం ఎదురైంది. వారు ఎక్కిన లాంబర్‌జాక్ రైడ్ పైకి వెళ్లాక హఠాత్తుగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో చిక్కుకుపోయిన సందర్శకులు 30 నిమిషాలపాటు తలకిందులుగా వేలాడుతూ సాయంకోసం అరి్థంచారు. కెనడాలోని ఒంటారియా నగరంలోని వండర్ల్యాండ్ అమ్యూజ్మెంట్ పార్క్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. రైడ్‌లో భాగంగా అందులో కూర్చున్న వారంతా అలా గాల్లో తలకిందులుగా వేలాడుతూ హాహాకారాలు చేస్తున్న వీడియో ప్రసుత్తం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఎట్టకేలకు 30 నిమిషాలకు అందరినీ ఎలాగోలా కిందకు సురక్షితంగా తీసుకొచ్చారు. అంతసేపు తలకిందులుగా వేలాడటంతో కొందరు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. -
కెనడాలో ఆలయం వద్ద విద్వేష ఘటన
టొరొంటో: హిందూ వ్యతిరేక శక్తులు కెనడాలో మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డాయి. ఒంటారియో ప్రావిన్స్‌లోని విండ్సర్ నగరంలోని బాప్స్ స్వామినారాయణ ఆలయ గోడపై భారత్‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా రాతలు రాశారు. ఇందుకు పాల్పడ్డవారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. దీన్ని ఒట్టావాలోని భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. జనవరిలో సైతం కెనడాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఒంటారియో ప్రావిన్స్‌లోని బ్రాంప్టన్ నగరంలోని గౌరీశంకర్ ఆలయంపై భారత వ్యతిరేక రాతలు రాశారు. గతేడాది సైతం కెనడాలో ఇలాంటి మూడు ఘటనలు జరిగాయి. కెనడా గణాంకాల ప్రకారం 2019–2021 మధ్య మత, లింగ, జాతివిద్వేష నేరాలు 72 శాతం పెరిగాయి. కెనడా జనాభాలో 4 శాతమున్న భారతీయుల్లో ఇవి అభద్రతను పెంచుతున్నాయి. ఈ శక్తులకు అడ్డుకట్టవేయాలని కెనడా సర్కార్‌ను భారత్ కోరింది. -
Varatha Shanmuganathan: వరతమ్మా నీకు వందనాలమ్మా!
‘ఈ వయసులో చదువు ఏమిటి!’ అనుకునేవాళ్లు ఒక్కసారి వరత షణ్ముగనాథన్ గురించి చదివితే– ‘అవును. నాకు కూడా చదువుకోవాలని ఉంది’ అని బలంగా అనుకుంటారు. చదువుకు ఉన్న బలం అదే! కెనడాలోని ‘యార్క్ యూనివర్శిటీ’ నుంచి 87 సంవత్సరాల వయసులో మాస్టర్స్ డిగ్రీ చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకుంటోంది వరత షణ్ముగనాథన్. విద్యారంగంలో ఆమె స్ఫూర్తిదాయకమైన కృషిని గుర్తించి గౌరవించింది ఆంటేరియో లెజిస్లేచర్ అసెంబ్లీ. షణ్ముగనాథన్ హాలులోకి అడుగు పెడుతున్న సమయంలో సభ్యులు లేని నిల్చొని జయజయధ్వానాలు చేశారు. ‘ఈ తరానికి ఎన్నో రకాలుగా స్ఫూర్తిని ఇచ్చే మహిళ’ అంటూ షణ్ముగనాథన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు అసెంబ్లీ సభ్యులు. షణ్ముగనాథన్ కెనడాకు వెళ్లిన సమయంలో సీనియర్స్‌కు ‘యార్క్ యూనివర్శిటీ’లో మాస్టర్స్ డిగ్రీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుసుకొని ఎంతో సంతోషించింది. అలా మాస్టర్స్ ప్రోగ్రాంలో భాగం అయింది. కూతురు ఎంతోప్రో త్సాహకంగా నిలిచింది. ‘యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్’లో డిగ్రీ చేసిన షణ్ముగనాథన్ ‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లో ఫస్ట్ మాస్టర్స్ డిగ్రీ చేసేనాటికి ఆమె వయసు యాభై సంవత్సరాలు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వరత షణ్ముగనాథన్ వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చి వైరల్‌గా మారింది. షణ్ముగనాథన్‌ను ప్రశంసిస్తూ అన్ని వయసులవారి నుంచి కామెంట్స్ వచ్చాయి. మచ్చుకు కొన్ని.... ‘కాస్త వయసు పైబడగానే ఈ వయసులో ఏం నేర్చుకుంటాం అనే నిర్లిప్తత చాలామందిలో ఉంటుంది. ఇలాంటి వారిలో మార్పు తీసుకువచ్చే విజయం ఇది’ ‘నేను ఉద్యోగం నుంచి రిటైరయ్యాను. ఏదైనా చేయాలి...అని ఆలోచించేవాడిని. అంతలోనే ఈ వయసులో ఏం చేస్తాములే అని వెనక్కి వెళ్లేవాడిని. వరతమ్మ వీడియో చూసిన తరువాత నాలో చాలా మార్పు వచ్చింది. ఆమెలాగే నేను కూడా చదువుకోవాలని బలంగా నిర్ణయించుకున్నాను’ చదువు ఎప్పుడూ మనల్ని చురుగ్గా ఉంచుతుంది. జ్ఞాపకశక్తి బలహీనం కాకుండా చూస్తుంది. చదువుకు వయసుతో సంబంధం లేదు. -
కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం
జలంధర్ : కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు. వారిని పంజాబ్‌లోని గుర్దాస్పూర్, జలంధర్ జిల్లాలకు చెందిన తన్వీర్ సింగ్, గుర్విందర్, హర్‌ప్రీత్ కౌర్‌లుగా గుర్తించారు. ఉన్నత విద్య కోసం కెనడాలకు వెళ్లిన వీరు శుక్రవారం అర్ధరాత్రి కారులో బయటకు వెళ్లారు. అయితే వీరి వాహనం ఒంటారియోలోని అయిల్ హరిటేజ్ రోడ్డులో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఈ వార్తతో బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తన్వీర్ ఈ ఏడాది ఆరంభంలో కెనడాకు వెళ్లగా.. మిగిలిన ఇద్దరు ఏప్రిల్‌లో అక్కడికి వెళ్లినట్టు వారి కుటుంబసభ్యులు తెలిపారు. -
మంచు కొండలా మారిన నయాగరా
-
ఓ వ్యక్తి వర్సెస్ ఎలుగుబంటి.. షాకింగ్ ఫైట్
-
మనిషి వర్సెస్ ఎలుగుబంటి.. షాకింగ్ ఫైట్
కెనడా: అస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న హాలీవుడ్ చిత్రం ‘ది రెవనాంట్’ చిత్రం చూశారా.. అందులో ఓ భారీ ద్రువపు ఎలుగుబంటి హంటర్ అయిన లియోనార్డో డికాప్రియోపై దాడి చేస్తుంది. తన తోటి వేటగాళ్లతో కలిసి ఓ పెద్ద అడవిలోకి వేటకు వెళ్లి పిల్లలతో కలిసి తిరుగుతున్న ఓ భారీ ఎలుగుపై బాణం వేయడంతో దెబ్బతిన్న ఆ ఎలుగుబంటి అతడిపై క్రూరంగా దాడి చేసి దాదాపు చంపేసినంత పని చేస్తుంది. అచ్చం ఇప్పుడు అలాంటి వీడియోనే యూట్యూబ్‌లో తెగ హల్చల్ చేస్తోంది. కెనడాలోని ఒంటారియోలో ఫైర్ నది పక్కన రిచర్డ్ వెస్లీ అనే ఓ వ్యక్తి సరదాగా వేటకు వెళ్లాడు. అతడికి ఓ నల్లటి ఎలుగుబంటి కనిపించింది. అయితే, తొలుత అది దాని దారిన వెళ్లిపోతుందని అనుకున్నాడు. క్షణంలోనే అది కాస్త తన వైపు మళ్లింది. దాంతో అతడు బాణాన్ని దానివైపు ఎక్కుపెట్టి గట్టిగా అరిచి భయపెట్టే ప్రయత్నం చేశాడు. దాంతో అది తన నడకను ఆపి పరుగందుకొని వేగంగా అతడు బాణం సందించేలోగా మీదకు దూసుకొచ్చి దాడి చేసింది. దీంతో అతడి వద్ద ఉన్న కెమెరా కిందపడిపోయింది.అందులో రికార్డయిన వీడియో, వాయిస్ ప్రకారం ఎలుగుబంటితో అతడు గట్టిగానే పోరాడాడు. అదృష్టవశాత్తు అతడిని ఎలుగు వదిలిపెట్టి వెళ్లిపోయింది. దీంతో ఆ వీడియోలో తన చివరి మాటలుగా ‘దాన్ని దూరంగా ఉన్నప్పుడే బాణంతో కొట్టాల్సింది. నాకు చాలా భయం వేసింది’ అని అన్నాడు. అతడి మోచేతికి గాయం కూడా అయింది. -
పాత టీవీలో భారీ నగదు చూసి...
కష్టార్జితం పొరపాటున చేయి జారిపోతే.. అది ఎప్పటికైనా మనచేతికి అంది తీరుతుందని అన్న పెద్దలమాట అక్షరాలా నిజమైన అరుదైన సంఘటన ఇది. ఎపుడో 30ఏళ్ల క్రితం దాచి పెట్టిన నోట్ల కట్టలు తిరిగి అనూహ్యంగా ఓ పెద్దాయన చెంతకు చేరాయి. దీంతో ఆశ్చర్యం, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవడం ఆయన వంతు అయింది. వివరాల్లోకి వెళితే కెనడాకు చెందిన వ్యక్తి (68) ఇంట్లో వాళ్లకి తెలియకుండా 30ఏళ్ల క్రితం సుమారు లక్ష కెనడా డాలర్లను టీవీ డబ్బాలో దాచి పెట్టాడు. కానీ ఆసంగతి మర్చిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ టీవీని ఓ స్నేహితుడికి కానుకగా ఇచ్చాడు. అలా.. అలా.. ఆ టీవీ చివరకి ఓ రీక్లింగ్ యూనిట్‌కు చేరడంతో కథ పెద్ద మలుపు తిరిగింది. గత నెలలో రీసైక్లింగ్ ప్లాంట్ కి చేరిన ఈ టీవీ తెరిచిన కార్మికురాలు విస్తుపోయారు. 76,560 డాలర్లు( సుమారు రూ.67లక్షలు) విలువగల నోట్ల కట్టల్ని కొనుగొన్నారు. వెంటనే సమాచారాన్ని యాజమాన్యానికి చేరవేశారు. ఉత్తర టొరంటో, ఒంటారియా,బారీలోని ఎలక్ట్రానిక్స్ రీసైక్లింగ్ ప్లాంట్ జీప్ యజమాని వెంటనే పోలీసులను సంప్రదించింది. అలాగే తమ ఉద్యోగి నిజాయితీని ప్రశంసించింది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే తన కుటుంబానికి వారసత్వంగా ఈ సొమ్మును అందించాలనుకున్న ఆయన డబ్బుతో పాటు కొన్ని డాక్యుమెంట్లను కూడా జతచేశాడట. వీటి ఆధారంగానే పోలీసులు నిజమైన యజమాని అడ్రస్ తెలుసుకొని సొమ్మును అతనికి అందజేశారు. 50 డాలర్ల నోట్ల కట్టలు చూసి పోలీసులకు సమాచారం అందించామని ప్లాంట్ జనరల్ మ్యానేజర్ రిక్ డే ఛాంప్స్ తెలిపారు. -
కారు అద్దం పగులగొట్టి హీరో అయ్యాడు..
ఒంటారియో: పార్కింగ్‌లో ఉన్న ఓ కారు అద్దాన్ని బండరాయితో పగులగొట్టి, ఓ వ్యక్తి హీరో అయ్యాడు. ఈ సంఘటన కెనడాలో ఒంటారియోలోని గ్రాండ్ బెండ్లో చోటు చేసుకుంది. గ్రాండ్ బెండ్ లో జరుగుతున్న ఓ ఫెస్ట్‌కు చాలా మంది వచ్చారు. అక్కడికి వచ్చిన ఇద్దరు దంపతులు తమ కుక్కను కారులోనే వదిలేసి వెళ్లారు. లాక్ చేసి ఉన్న కారులోనే ఆ కుక్క చాలా సమయం నుంచి ఉంది. అక్కడ ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉండటంతో అప్పటికే ఆ శునకం నీరసించిపోయింది. అయితే కుక్క కారులో ఉందని, యజమానులు రావల్సిందిగా ముందుగా ఓ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. అక్కడికి ఎవరూ రాకపోవడంతో చివరకు అక్కడే ఉన్న బండ సాయంతో కారు అద్దం పగులగొట్టి కుక్కను బయటకు తీశాడు ఓ బాటసారి. 'ఆ కుక్క పరిస్థితి చూసి చాలా జాలేసింది. బయట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో కారులో మరింత వేడికి కుక్క మగ్గిపోయింది. కారు అద్దాలు పగుల గొట్టిన మరో గంట వరకు అక్కడికి కారు యజమానులు రాలేదు. ఒక వేళ ఆ వ్యక్తి అలా చేసి ఉండకపోతే కుక్క పరిస్థితి మరింత విషమంగా మారేది..'అని ప్రత్యక్ష సాక్షి విల్ కోస్టా తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుక్క యజామానులను స్టేషన్ కు తీసుకువెళ్లారు. బాటసారి కారు అద్దం పగులగొడుతున్న సంఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టడంతో అతన్ని అందరూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పడు ఆ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా యజమానుల నిర్లక్ష్య ధోరణితో ఎన్నో పెంపుడు శునకాలు కార్లలోనే వదిలి వెళ్లడంతో వేడిమికి, ఊపిరాడక బలవుతున్నాయి. ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని జంతుప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. -
పరస్పర ఆర్థిక సహకారం దిశగా కృషి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఒంటారియో మధ్య పరస్పర ఆర్థిక సహకారానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. కెనడాలోని ఒంటారియో-తెలంగాణ మధ్య లాభదాయకమైన రీతిలో ఆర్థిక సహకారం ఉండేలా రూపొందించిన పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై గురువారం మంత్రి కేటీఆర్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రం తరఫున పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ఒంటారియో పక్షాన వాణిజ్య ఉప మంత్రి హెలెన్ అంగన్ సంతకాలు చేశారు. ఇరు ప్రాంతాల్లో వాణిజ్య అవకాశాలపై దేశీయ కంపెనీలకు అవగాహన కల్పించడం.. ఆయా రంగాల్లో దిగ్గజ కంపెనీలతో దేశీయ కంపెనీలను అనుసంధానించడం.. ఇరు ప్రాంతాల్లో మార్కెటింగ్ అవకాశాలు మెరుగు పరిచేలా వాణిజ్య బృందాల పర్యటనలు, సదస్సులు ఏర్పాటు చేయాలని ఒప్పందంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. నూతన విధానం ద్వారా 18 నెలల కాలంలోనే గూగుల్, అమెజాన్, ఉబెర్ వంటి పెద్ద సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐటీ, వ్యవసాయం, మౌలిక వసతులకు సంబంధించిన రంగాల్లో తెలంగాణ-ఒంటారియో మధ్య పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక సహకారానికి అవకాశముందని ఒంటారియో ప్రీమియర్ కాథలిన్ వీన్ అన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఒంటారియో మంత్రి దీపికా దామెర్ల, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంస్థల మధ్య కీలక ఒప్పందాలు.. గురువారం హైదరాబాద్‌లో జరిగిన మరో కార్యక్రమంలో ఒంటారియోకు చెందిన పలు సంస్థలు.. తెలంగాణ సంస్థలు, కంపెనీలతో కీలక ఒప్పందాల (ఎంవోయూ)ను కుదుర్చుకున్నాయి. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఒంటారియో ప్రీమియర్ కాథలిన్ వీన్ సమక్షంలో వీటిపై సంతకాలు జరిగాయి. శంషాబాద్ వద్ద రూ.వంద కోట్లతో ట్యాబ్లెట్, సెల్‌ఫోన్, నోట్‌బుక్‌ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు డేటావిండ్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీ హైదరాబాద్-మిచిగాన్ యూనివర్సిటీ, ఆస్ట్రా మైక్రోవేవ్.. యూనిక్ బ్రాడ్‌బ్యాండ్, న్యూక్లియన్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్సీ).. కనెక్ట్రిక్స్, షోలాంట్రో.. స్మార్ట్‌ట్రాక్ కంపెనీల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఒంటారియోలో ఏడు లక్షల మందికి పైగా భారత సంతతివారు ఉన్నారని కాథలీన్ వీన్ వెల్లడించారు. హైదరాబాద్‌లో జన్మించిన తాను సొంత గడ్డకు రావడం ఆనందంగా ఉందని ఒంటారియో మంత్రి దీపిక దామెర్ల అన్నారు.