కెనడా: అస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న హాలీవుడ్ చిత్రం ‘ది రెవనాంట్’ చిత్రం చూశారా.. అందులో ఓ భారీ ద్రువపు ఎలుగుబంటి హంటర్ అయిన లియోనార్డో డికాప్రియోపై దాడి చేస్తుంది. తన తోటి వేటగాళ్లతో కలిసి ఓ పెద్ద అడవిలోకి వేటకు వెళ్లి పిల్లలతో కలిసి తిరుగుతున్న ఓ భారీ ఎలుగుపై బాణం వేయడంతో దెబ్బతిన్న ఆ ఎలుగుబంటి అతడిపై క్రూరంగా దాడి చేసి దాదాపు చంపేసినంత పని చేస్తుంది. అచ్చం ఇప్పుడు అలాంటి వీడియోనే యూట్యూబ్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. కెనడాలోని ఒంటారియోలో ఫైర్ నది పక్కన రిచర్డ్ వెస్లీ అనే ఓ వ్యక్తి సరదాగా వేటకు వెళ్లాడు. అతడికి ఓ నల్లటి ఎలుగుబంటి కనిపించింది.
అయితే, తొలుత అది దాని దారిన వెళ్లిపోతుందని అనుకున్నాడు. క్షణంలోనే అది కాస్త తన వైపు మళ్లింది. దాంతో అతడు బాణాన్ని దానివైపు ఎక్కుపెట్టి గట్టిగా అరిచి భయపెట్టే ప్రయత్నం చేశాడు. దాంతో అది తన నడకను ఆపి పరుగందుకొని వేగంగా అతడు బాణం సందించేలోగా మీదకు దూసుకొచ్చి దాడి చేసింది. దీంతో అతడి వద్ద ఉన్న కెమెరా కిందపడిపోయింది.అందులో రికార్డయిన వీడియో, వాయిస్ ప్రకారం ఎలుగుబంటితో అతడు గట్టిగానే పోరాడాడు. అదృష్టవశాత్తు అతడిని ఎలుగు వదిలిపెట్టి వెళ్లిపోయింది. దీంతో ఆ వీడియోలో తన చివరి మాటలుగా ‘దాన్ని దూరంగా ఉన్నప్పుడే బాణంతో కొట్టాల్సింది. నాకు చాలా భయం వేసింది’ అని అన్నాడు. అతడి మోచేతికి గాయం కూడా అయింది.
మనిషి వర్సెస్ ఎలుగుబంటి.. షాకింగ్ ఫైట్
Published Thu, May 25 2017 5:29 PM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM
Advertisement
Advertisement