Black Bear
-
డబ్బా మొత్తం నాకే; అమ్మదొంగా!
ఆహారం కోసం బయల్దేరిందో ఎలుగుబంటి. కానీ ఎక్కడా ఏమీ కనిపించకపోవడంతో చెత్త డబ్బా దగ్గరికెళ్లి ఏమైనా దొరుకుతుందోమోనని దానిని తెరిచేందుకు ప్రయత్నించింది. అయితే ఎంతసేపటికి అది ఓపెన్ కాకపోవడంతో ఏకంగా డబ్బా మొత్తాన్ని తనతో పాటు తీసుకెళ్లింది. ఈ సరదా సంఘటన కొలెరెడోలో చోటుచేసుకుంది. ‘పాపం ఎలుగుబంటి దొంగగా మారింది. కానీ దురదృష్టవశాత్తు ఆహారం సంపాదించలేకపోయింది. కాబట్టి దానికి ఎటువంటి శిక్ష వేయబోము’ అంటూ కొలెరెడో పార్క్స్, వైల్డ్‌లైఫ్ తన ట్విటర్ ఖాతాలో ఎలుగుబంటి వీడియోను పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో కొలెరెడో వైల్డ్‌లైఫ్ అధికారి మాట్లాడుతూ... ఆహారం కోసం ఎలుగుబంట్లు రాత్రుళ్లు ఎక్కువగా సంచరిస్తుంటాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ఓ వ్యక్తి వర్సెస్ ఎలుగుబంటి.. షాకింగ్ ఫైట్
-
మనిషి వర్సెస్ ఎలుగుబంటి.. షాకింగ్ ఫైట్
కెనడా: అస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న హాలీవుడ్ చిత్రం ‘ది రెవనాంట్’ చిత్రం చూశారా.. అందులో ఓ భారీ ద్రువపు ఎలుగుబంటి హంటర్ అయిన లియోనార్డో డికాప్రియోపై దాడి చేస్తుంది. తన తోటి వేటగాళ్లతో కలిసి ఓ పెద్ద అడవిలోకి వేటకు వెళ్లి పిల్లలతో కలిసి తిరుగుతున్న ఓ భారీ ఎలుగుపై బాణం వేయడంతో దెబ్బతిన్న ఆ ఎలుగుబంటి అతడిపై క్రూరంగా దాడి చేసి దాదాపు చంపేసినంత పని చేస్తుంది. అచ్చం ఇప్పుడు అలాంటి వీడియోనే యూట్యూబ్‌లో తెగ హల్చల్ చేస్తోంది. కెనడాలోని ఒంటారియోలో ఫైర్ నది పక్కన రిచర్డ్ వెస్లీ అనే ఓ వ్యక్తి సరదాగా వేటకు వెళ్లాడు. అతడికి ఓ నల్లటి ఎలుగుబంటి కనిపించింది. అయితే, తొలుత అది దాని దారిన వెళ్లిపోతుందని అనుకున్నాడు. క్షణంలోనే అది కాస్త తన వైపు మళ్లింది. దాంతో అతడు బాణాన్ని దానివైపు ఎక్కుపెట్టి గట్టిగా అరిచి భయపెట్టే ప్రయత్నం చేశాడు. దాంతో అది తన నడకను ఆపి పరుగందుకొని వేగంగా అతడు బాణం సందించేలోగా మీదకు దూసుకొచ్చి దాడి చేసింది. దీంతో అతడి వద్ద ఉన్న కెమెరా కిందపడిపోయింది.అందులో రికార్డయిన వీడియో, వాయిస్ ప్రకారం ఎలుగుబంటితో అతడు గట్టిగానే పోరాడాడు. అదృష్టవశాత్తు అతడిని ఎలుగు వదిలిపెట్టి వెళ్లిపోయింది. దీంతో ఆ వీడియోలో తన చివరి మాటలుగా ‘దాన్ని దూరంగా ఉన్నప్పుడే బాణంతో కొట్టాల్సింది. నాకు చాలా భయం వేసింది’ అని అన్నాడు. అతడి మోచేతికి గాయం కూడా అయింది. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. వచ్చిన అతిథి
ఇండియానా: దాదాపు 140 సంవత్సరాల తర్వాత ఓ అతిథి ఇండియానా అడవులను పలకరించింది. దీంతో అటవీశాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. తిరిగి ఆ సంతతి తమ వద్ద పునరుత్పత్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ అతిథి ఎవరనీ అనుకుంటున్నారా. నల్లటి ఎలుగుబంటి. అవును.. 1871 నుంచి ఇండియానా అడవుల్లో ఎలుగు బంట్లు కరువై పోయాయట. అంతకుముందు కుప్పలుగా ఉన్న అవి ఉన్నపలంగా అంతరించిపోయి పూర్తిగా కనిపించడం మానేశాయి. వారి వద్ద ఉన్న డేటా ప్రకారం.. 140 ఏళ్లుగా ఒక్క ఎలుగుబంటి కూడా తమ అడవుల్లో ఉన్నట్లు రికార్డుల్లో లేదు. తాజాగా దాని పాదముద్రలు, మల విసర్జన గుర్తించిన అధికారులు వచ్చింది మగ ఎలుగుబంటి అని, అది మిచిగాన్ ప్రాంతం నుంచి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, చాలాకాలం తర్వాత ఎలుగుబంట్లు కనిపించడంతో అక్కడి వారు చాలా ఆందోళన చెందుతున్నారట. ఎందుకంటే అవి చాలా క్రూరమైన జాతికి చెందినవి. -
కొత్తింటి కోసం వెతుకులాట