కారు అద్దం పగులగొట్టి హీరో అయ్యాడు.. | Ontario pedestrians rescue dog locked in car during 30 degree heat | Sakshi
Sakshi News home page

కారు అద్దం పగులగొట్టి హీరో అయ్యాడు..

Published Thu, Jun 16 2016 5:23 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

కారు అద్దం పగులగొట్టి హీరో అయ్యాడు.. - Sakshi

కారు అద్దం పగులగొట్టి హీరో అయ్యాడు..

ఒంటారియో: పార్కింగ్లో ఉన్న ఓ కారు అద్దాన్ని బండరాయితో పగులగొట్టి, ఓ వ్యక్తి హీరో అయ్యాడు. ఈ సంఘటన కెనడాలో ఒంటారియోలోని గ్రాండ్  బెండ్లో చోటు చేసుకుంది.  గ్రాండ్ బెండ్ లో జరుగుతున్న ఓ ఫెస్ట్కు చాలా మంది వచ్చారు. అక్కడికి వచ్చిన ఇద్దరు దంపతులు తమ కుక్కను కారులోనే వదిలేసి వెళ్లారు. లాక్ చేసి ఉన్న కారులోనే ఆ కుక్క చాలా సమయం నుంచి ఉంది. అక్కడ ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉండటంతో అప్పటికే ఆ శునకం నీరసించిపోయింది. అయితే కుక్క కారులో ఉందని, యజమానులు రావల్సిందిగా ముందుగా ఓ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. అక్కడికి ఎవరూ రాకపోవడంతో చివరకు అక్కడే ఉన్న బండ సాయంతో కారు అద్దం పగులగొట్టి కుక్కను బయటకు తీశాడు ఓ బాటసారి.  

'ఆ కుక్క పరిస్థితి చూసి చాలా జాలేసింది. బయట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో కారులో మరింత వేడికి కుక్క మగ్గిపోయింది. కారు అద్దాలు పగుల గొట్టిన మరో గంట వరకు అక్కడికి కారు యజమానులు రాలేదు. ఒక వేళ ఆ వ్యక్తి అలా చేసి ఉండకపోతే కుక్క పరిస్థితి మరింత విషమంగా మారేది..'అని ప్రత్యక్ష సాక్షి  విల్ కోస్టా తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుక్క యజామానులను స్టేషన్ కు తీసుకువెళ్లారు. బాటసారి కారు అద్దం పగులగొడుతున్న సంఘటనను అక్కడే ఉన్న వారు వీడియో  తీసి ఇంటర్నెట్లో పెట్టడంతో అతన్ని అందరూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పడు ఆ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా యజమానుల నిర్లక్ష్య ధోరణితో ఎన్నో పెంపుడు శునకాలు కార్లలోనే వదిలి వెళ్లడంతో వేడిమికి, ఊపిరాడక బలవుతున్నాయి. ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని జంతుప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement