upside down
-
టమోటాలు ఇలా కూడా పెంచవచ్చు!
ఇటీవల కాలంలో స్థలం లేకపోయినా మొక్కల పెంచుకునే సరికొత్త పద్ధతులు వస్తున్నాయి. ఆఖరికి ఫ్లాట్‌లోని బాల్కనీలో కూడా సులభంగా పెంచుకునే పద్ధతులను కూడా చూశాం. చిన్ని చిన్ని కుండీల్లోనే జామ, దానిమ్మ వంటి పళ్లు కాసే మొక్కలను పెంచి చూపించారు. ఇదంత ఒక ఎత్తైతే ఇప్పుడు ఏకంగా మొక్కలను తలకిందులుగా పెంచే సరికొత్త పద్ధతి మన ముందుకు వచ్చింది. పైగా దీని వల్ల ఎన్నో చీడ పీడలను కూడా నివారించొచ్చు, మంచి దిగుబడి కూడా వస్తుందంటున్నారు. అందులోనూ టమోటా మొక్కలను ఇలా పెంచితే స్థలం ఆదా అవ్వడమే గాక ఎక్కువ టమోటాలు పండించొచ్చు అంటున్నారు అగ్రికల్చర్ నిపుణులు. ఇంతకీ ఇదెలా సాధ్యం? ఎలా పెంచుతారంటే.. టమోటాలను తలకిందులుగా పెంచే పద్ధతిని ఎంచుకొనేటప్పుడూ అన్ని రకాల టమోటాలకు ఈ పద్ధతి మంచిది కాదనే విషయాన్ని గుర్తించుకోవాలి. ముఖ్యంగా చెర్రీ టమోటా వంటి కొన్ని రకాల టమాటాలకు మాత్రమే ఈ పద్ధతి సరైనది. ముందుగా వేలాడే మొక్కల కంటైనర్లను తీసుకోవాలి. ముఖ్యంగా చక్కగా వేలాదీయగల బకెట్ లేదా కుండిని తీసుకోవాలి దాని అడుగు భాగన రంధ్రం ఉండేలా చూసుకోండి. ఒకవేళ్ల రంధ్రం లేకపోతే మనం ఏర్పాటు చేసుకోవాలి. దీనికి మంచి ఎరువుతో కూడిన మట్టిని కుండీలో నింపి దానిలో టమోటా వితనాలు వేసి ఉంచాలి. ఆ విత్తనాలు మొలకెత్తిన వెంటనే..ఆ కుండీ పైభాగం కవర్ అయ్యేలా కవర్ లేదా ఏదైనా మూత వంటి వాటిని ఏర్పాటు చేసి తలకిందులుగా వేలాడదీసి ఆ రంధ్రంలో ఈ మొలకెత్తిన మొక్కను చొప్పించాలి. దీన్ని సూర్యరశ్మీ తగిలే చోట వేలాదీయండి. ఆ తర్వాత మొక్కగా మొలికెత్తిన ఈ టమోటా మొక్కను చక్కగా పెరిగేలా తీగల వంటి సపోర్టు ఏర్పాటు చేసుకుని సమయానికి నీరు అందించాలి. చక్కగా గాలికి ఎక్స్పోజ్అయ్యి మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే పరాగ సంపర్కం సులభతరమవుతుంది. ఇక ఈ పద్ధతిలో మొక్క మట్టికి బయటకు బహిర్గతం కావడం వల్ల నేల ద్వారా వచ్చే తెగుళ్లు, ఫంగస్, కట్‌వార్మ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువుగా ఉంటుంది. తలక్రిందులుగా వేలాడదీయడం వల్ల మొక్కలు ఎలాపడితే అలా వ్యాపించవు కాబట్టి చక్కగా నచ్చిన రీతీలో కట్ చేసుకుని ఆకర్షణీయంగా పెంచుకునే సౌలభ్యం ఉంటుంది. అంతేగాక వీటిని ఎండ తగిలే చోటికి తరలించుకుపోవడం సులభం, పైగా ఎక్కువ టమాటాలు కాస్తాయి కూడా. ముఖ్యంగా ఈ పద్ధతిలో పెంచాలనుకుంటే ఎంచుకునే బకెట్ లేదా కుండీ తోపాటు అందులో వేసే మట్టి, మనం వేసే మొక్కకు కాసే పళ్లని తట్టుకునే సామర్థ్యం తదితరాలు ఉన్నవాటినే ఎంచుకోవడం అత్యంత కీలకం. స్థలం సమస్యతో ఇబ్బంది పడే వాళ్లకు, ఇంటి పంటలంటే ఇష్టపడే వారికి ఈ విధానం చాలా బాగా ఉపయోగపడుతుంది. సులభంగా బాల్కనీల్లోనూ కిటికీల్లోనూ తలకిందులుగా టమాట మొక్కలను పెంచడమే గాక సమృద్ధిగా టమోటాలను పెంచగలుగుతారు కూడా. (చదవండి: ఇది గ్రీన్ పాలిటిక్స్ యుగం! రాజకీయ పార్టీలే గ్రీన్ పార్టీలుగా..!) -
గాల్లో తలకిందులుగా 30 నిమిషాలు.
టొరంటో: సరదాగా పార్కులో గడుపుదామనుకుని అక్కడికి విచ్చేసిన సందర్శకులకు చేదు అనుభవం ఎదురైంది. వారు ఎక్కిన లాంబర్‌జాక్ రైడ్ పైకి వెళ్లాక హఠాత్తుగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో చిక్కుకుపోయిన సందర్శకులు 30 నిమిషాలపాటు తలకిందులుగా వేలాడుతూ సాయంకోసం అరి్థంచారు. కెనడాలోని ఒంటారియా నగరంలోని వండర్ల్యాండ్ అమ్యూజ్మెంట్ పార్క్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. రైడ్‌లో భాగంగా అందులో కూర్చున్న వారంతా అలా గాల్లో తలకిందులుగా వేలాడుతూ హాహాకారాలు చేస్తున్న వీడియో ప్రసుత్తం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఎట్టకేలకు 30 నిమిషాలకు అందరినీ ఎలాగోలా కిందకు సురక్షితంగా తీసుకొచ్చారు. అంతసేపు తలకిందులుగా వేలాడటంతో కొందరు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. -
తలకిందులుగా వేలాడదీసి..కింద మంట పెట్టి...
మందమర్రి రూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రిలో దారుణం చోటు చేసుకుంది. మేకలు దొంగతనం చేశారని ఇద్దరు యువకులను కట్టేసి చిత్రహింసలు పెట్టారు. తలకిందులుగా వేలాడదీసి, కింద మంటపెట్టి నరకం చూపించారు. అవమానం భరించలేక ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. అతని చిన్నమ్మ శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని యాపల్ ఏరియా సమీపంలోని అబ్రహం నగర్‌కు చెందిన చాకలి రాములుకు కొన్ని మేకలు ఉన్నాయి. ఆ మేకలను కాసేందుకు తేజ అనే యువకుడిని కూలీగా పెట్టుకున్నాడు. అయితే మేకల షెడ్డు వద్ద ఉన్న ఓ పైపు, ఒక మేక ఇటీవల చోరీ అయ్యాయి. అదే ఏరియాకు చెందిన కిరణ్ ఈ పని చేసి ఉంటాడన్న అనుమానంతో రాములు పిలిచి ప్రశ్నించాడు. దీంతో తడబడిన కిరణ్ పైపు దాచిన చోటు చూపించాడు. తర్వాత చోరీ అయిన మేక గురించి కూడా ఆరా తీయగా స్థానికులు మేకను కూడా కిరణే ఎత్తుకెళ్లి అమ్ముకున్నాడని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన రాములు నిందితుడిని తాళ్లతో కట్టేసి తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు పెట్టాడు. అంతటితో ఆగకుండా కింద మంట పెట్టాడు. చిత్రహింస భరించలేక కిరణ్, తనకు మేకల కాపరి తేజ సహకరించాడని చెప్పాడు. దీంతో అతడిని కూడా తీసుకువచ్చి షెడ్డులో కట్టేసి రాములు, అతని కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెట్టారు. తర్వాత పెద్దమనుషుల వద్ద పంచాయితీ పెట్టగా మేకకు రూ.6 వేలు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఇందుకు నిందితులు అంగీకరించారు. కిరణ్ చిన్నమ్మ ఫిర్యాదుతో.. ఘటన అనంతరం అవమాన భారంతో కిరణ్ కనిపించకుండాపోయాడు. దీంతో రాములు, అతని కొడుకు శ్రీనివాస్, భార్య స్వరూప, అతని వద్ద పనిచేసే నరేశ్ రెండు రోజుల క్రితం తన అక్క కొడుకు కిరణ్‌ను తీవ్రంగా హింసించారని కిరణ్ చిన్నమ్మ నిట్టూరి సరిత శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అవమానం భరించలేక తన అక్క కొడుకు కిరణ్ కనిపించకుండా పోయాడని తెలిపింది. కిరణ్ దళితుడు కావడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రకుమార్ పేర్కొన్నారు. ఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య శనివారం పరిశీలించారు. -
మనిషి సైజులో వేలాడుతున్న గబ్బిలం.. చూస్తే వెన్నులో వణుకు ఖాయం!
చెట్లపై తలకిందులుగా వేలాడే గబ్బిలాల గురించి మనకు తెలిసిందే. అవి ఏ సైజులో ఉంటాయో కూడా మనకు తెలుసు. అయితే మనిషంత సైజులో గబ్బిలం ఉండటాన్ని మనం ఊహించగలమా? ఊహించడానికే మనకు భయం వేస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫొటో వైరల్‌గా మారింది. ఇది చూపరులను భయకంపితులను చేస్తోంది. మనిషి సైజులో ఉన్న ఈ గబ్బిలం ఇంటి చూరుకు వేలాడుతూ భయపెడుతోంది. గబ్బిలాలను పిశాచాలతో పోలుస్తుంటారు. కొన్ని జాతులకు చెందిన గబ్బిలాలు ఇతర జంతువుల రక్తం తాగుతాయి. ఈ కారణంగా వీటిని పిశాచాలతో పోలుస్తారు. అయితే ఈ ఫొటోను చూసి ఎవరూ భయపడనక్కరలేదు. ఎందుకుంటే ఎవరో గబ్బిలం తరహా వేషధారణతో జనాలను భయపెట్టేందుకు ఇలా తలకిందులుగా వేలాడుతున్నారని కొందరు అంటున్నారు. అయితే ఇది ఎంత సహజంగా ఉందంటే నిజమైన గబ్బలం వేలాడుతున్నదని ఈ ఫొటో చూసినవారంతా హడలెత్తిపోతున్నారు. అయితే అసలు విషయం తెలిశాక అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఫొటోలో గబ్బిలం రూపం అంత పెద్దగా కనిపించడానికి కెమెరా ట్రిక్ కారణమట. ఆప్టికల్ ఇల్యూజన్ సృష్టించారట. ఒక సాధారణ గబ్బిలం ఫొటోను పెద్దదిగా చేసి చూపారుట. ట్విట్టర్‌లోని ఈ ఫొటో అందరి దృష్టిని ఇట్టే ఆకర్షిస్తోంది.ఈ ఫొటోకు ఇప్పటివరకూ 58కే కు మించిన రీట్వీట్లు, 234కే కు మంచిన లైక్స్ వచ్చాయి. ఈ ఫొటో చూసిన ఒక యూజర్ ఇంత పెద్ద గబ్బిలం ప్రపంచంలో ఉంటే ఏమవుతుందో అని రాయగా, ఇది ఎడిటింగ్ పిక్చర్ అని మరో యూజర్ కామెంట్ చేశాడు. ఇది కూడా చదవండి: భార్యాపిల్లల గుర్తుగా చేసిన పనికి.. రూ. 90 కోట్లు అదృష్టం వరించింది! Remember when I told y'all about the Philippines having human-sized bats? Yeah, this was what I was talking about pic.twitter.com/nTVIMzidbC — hatdog² (@AlexJoestar622) June 24, 2020 -
Roller Coaster: తలకిందులుగా వేలాడుతూ.. 3 గంటలు నరకయాతన..
అమెరికా: అమెరికాలో ఒక అమ్యూజ్మెంట్ పార్కులో జనంతో ఉన్న ఒక రోలర్ కోస్టర్, రైడ్ జరుగుతుండగా సాంకేతిక లోపం తలెత్తి మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో ఉన్న వారు తలకిందులుగా వేలాడుతూ ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని దాదాపు 3 గంటలపాటు నరకయాతన చూశారు. చాలామందికి రోలర్ కోస్టర్ రైడ్ అంటే మహా సరదా. గాల్లో గింగిరాలు తిరుగుతూ చేసే ఈ స్వారీ సాగుతున్నంత సేపు మహదానందాన్ని మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అయితే ఇలాంటి ఒక రోలర్ కోస్టర్ రైడ్ లో ఏదైనా అపశ్రుతి దొర్లితే జరిగే నష్టాన్ని కూడా ఊహించలేము. ముఖ్యంగా యాంత్రికంగా ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు దేవుడిమీద భారం వేయడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. అచ్చంగా అలాంటి భయానకమైన సంఘటన ఒకటి అమెరికాలోని క్రాండన్ పార్క్ ఫారెస్ట్ కౌంటీ ఫెస్టివల్లో చోటు చేసుకుంది. రోలర్ కోస్టర్ రైడ్ జరుగుతుండగా సాంకేతిక సమస్య ఏర్పడటంతో కోచ్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో స్వారీ చేస్తున్నవారు తలకిందులుగా వేలాడుతూ ఊపిరిని బలంగా బిగపట్టి మూడు గంటలపాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆ క్షణంలో పరిస్థితి ఏమాత్రం పట్టు తప్పినా దారుణం జరిగుండేదని సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆగిపోయిన రోలర్ కోస్టర్ లో ఎనిమిది మంది ఉండగా అందులో ఏడుగురు చిన్నారులేనని సహాయక బృందం వెంటనే స్పందించి వారిని సురక్షితంగా కిందకు దించారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి తెలిపారు. మెకానికల్ సమస్య కారణంగానే రోలర్ కోచ్ మధ్యలో ఆగిపోయిందని.. విస్కాన్సిన్ బృందం ఇటీవలే ఇక్కడ తనిఖీలు కూడా చేశారని, అయినా ఇలా ఎందుకు జరిగిందో తెలియడంలేదని, ఇంతకు మించి మా వద్ద ఎటువంటి సమాచారం లేదని ఈ ఫెస్టివల్ నిర్వాహకులు తెలిపారు. Eight people hung upside down for about three hours, stuck in a roller coaster-like attraction. Emergency happened at a festival in American Wisconsin. Local media write that seven of the eight stranded are children. According to preliminary data, everyone got off with fright. pic.twitter.com/OP3Ow3syQZ — Sasha White (@rusashanews) July 4, 2023 ఇది కూడా చదవండి: టైటాన్ విషాదం: నా భర్త, బిడ్డ చివరి రోజులు తలచుకుంటే.. -
Viral: జిమ్‌లో వర్కౌట్ చేస్తూ తలకిందులుగా ఇరుక్కుపోయిన మహిళ
చాలామందికి ఫిట్‌గా ఉండటానికి ప్రాధాన్యతిస్తారు. దీని కోసం డైట్ ఫాలో అవడం, జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేయడం చేస్తుంటారు. లేదా ఇంట్లోనే చిన్నసైజ్ జిమ్‌ను ఏర్పాటు చేసుకొని ప్రాక్టిస్ చేస్తుంటారు. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్లు ఎక్సర్సైజ్ చేస్తే కండరాలు పట్టుకోవడం, బ్యాలెన్స్ తప్పడంలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి ఓ షాకింగ్ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఓహియాకు చెందిన క్రిస్టిన్ ఫాల్డ్స్ అనే మహిళ తెల్లవారు జామున 3గంటలకు ఒంటరిగా ఇంట్లోని జిమ్‌లో ఇన్వర్షన్ టేబుల్ అనే ఎక్విప్‌మెంట్‌పై వర్కౌట్స్ చేస్తోంది. వెన్నెముక, నడుమునొప్పి తగ్గేందుకు దీనిని ఉపయోగించి ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అప్పుడే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఉన్నట్టుండి మహిళ ఇన్వర్షన్ టేబుల్‌పై తలకిందులైంది. కాళ్లు అందులో ఇరుక్కుపోవడంతో ఎంత ప్రయత్నించినా తిరిగి మామూలు స్థితికి రాలేకపోయింది. చదవండి: వీడియో వైరల్ చేద్దామనుకున్నాడు.. పాపం తానే వైరల్ అయ్యాడు సాయం కోసం జిమ్‌లో జాసన్ అనే మరో వ్యక్తిని పిలిచినా భారీ సౌండ్‌తో మ్యూజిక్ ప్లే అవుతుండటం వల్ల అతనికి వినిపించలేదు. పైకి లేవలేక, బయటకు రాలేక అలాగే ఇబ్బంది పడింది. కాసేపు ఏం చేయాలో తోచలేదు. వెంటనే ఆమెకు ఓ ఉపాయం తట్టింది. తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ ఉపయోగించి ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేసింది. తన పరిస్థితిని వివరించి, సాయం కావాలని కోరింది. స్పందించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని తలకిందులుగా ఉన్న ఆమెను రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్వయంగా ఆమెనే టిక్‌టాక్‌లో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'This is so embarrassing' — A woman went viral after getting stuck upside down on an exercise machine and calling 911 for help 😅 pic.twitter.com/8nod8P6oQl — NowThis (@nowthisnews) September 5, 2022 -
వయసు తలకిందులు
75 ఏళ్ల వయసంటే.. నడవడానికి కూడా కష్టమే. అలాంటిది తలకిందులుగా నిలబడటమంటే మామూలు విషయం కాదు. కానీ ఒకాయన మాత్రం ఆ వయసులోనూ తలకిందులుగా నిలబడి రికార్డు సృష్టించారు. అలాంటిలాంటి రికార్డు కాదు.. గిన్నిస్ వరల్డ్ రికార్డు. 70 పదుల వయసులో ఇలాంటి పేరు సంపాదించిన ఆ వ్యక్తి పేరు టానియో హిలోవు. ఈయన కెనడాకు చెందిన వ్యక్తి. తలకిందులుగా నిలబడటాన్ని సరిగా చేయకపోతే మెడ, తలపై గాయాలవుతాయి. మామూలుగా యువకులుగా ఉన్నప్పుడే ఇవి చేస్తుంటారు. 60 ఏళ్లు పైబడిన వాళ్లు ఇలాంటివి చేయకూడదని చెబుతుంటారు. అయితే టానియో మాత్రం.. శారీరక సవాళ్లను ఏ వయసులోనైనా ఎదుర్కోవచ్చని చెప్పడానికి ఈ ప్రయత్నం చేశానన్నారు. గతేడాది అక్టోబర్‌లో టానియో గిన్నిస్ రికార్డు సాధించగా ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరలైంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
రిపబ్లిక్ డే రోజు జాతీయ జెండాకు ఘోర అవమానం..
తిరువనంతపురం: గణతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండాకు అవమానం ఎదురైంది. ఈ ఘటన కేరళలోని కాసర్గడ్ జిల్లాలో చోటుచేసుకుంది. కాసర్గఢ్లోని మున్సిపల్ స్టేడియంలో పోర్టులు,ఆర్కియాలజీ శాఖ మంత్రి అహ్మద్ దేవరకోవిల్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెండాను తలకిందులుగా ఎగరవేశారు. ఆ తర్వాత జాతీయ గీతాలాపన చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, అక్కడే ఉన్న కొంత మంది మీడియా సిబ్బంది, ఇతర కార్యకర్తలు దీన్ని గమనించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జెండాను అవనతం చేసిన మంత్రి.. తిరిగి దాన్ని సరిచేసి మళ్లీ ఎగరేశారు. ప్రస్తుతం ఇది పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. కాగా, సిపిఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డిఎఫ్ మిత్రపక్షమైన ఇండియన్ నేషనల్ లీగ్(ఐఎన్ఎల్) మంత్రి అయిన దేవర్కోవిల్ జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హజరయ్యారు. అయితే, అధికారులు జాతీయ గీతాలాపన కార్యక్రమంలో చేశారు. చాలా సేపటికి ఎవరు కూడా జాతీయ జెండా తలకిందులుగా ఎగరడం గమనించకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. అయితే, దీనిపై ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుంది. అహ్మద్ దేవరకోవిల్ వెంటనే రాజీనామా చేయాలని.. కేరళ బీజేపీ రాష్ట్ర చీఫ్ కె సురేంద్రన్ డిమాండ్ చేశారు. అదే విధంగా జెండాను అవమానపర్చిన మంత్రి దేవరకోవిల్ పై పోలీసులు కేసునమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. త్రివర్ణ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేసి.. కనీసం గమనించకుండా సెల్యూట్ చేసి వెళ్లిపోవడం మంత్రి బాధ్యతారాహిత్యానికి అద్దంపడుతుందని, అధికారులు కూడా లోపాన్ని గుర్తించకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ విచారణకు ఆదేశించాలని కోరారు. ఇదే ఘటనపై కేరళ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ రాజ్‌మోహన్ ఉన్నితాన్ స్పందించారు. జాతీయ జెండాను తలకిందులుగా ఎగరవేయడం దురదృష్టకరమన్నారు. చదవండి: రైల్వే పరీక్షా ఫలితాలపై నిరసన... ఏకంగా రైలుకే నిప్పుపెట్టారు -
జాతీయ జెండా ఉల్టా పల్టా.. కేరళ బీజేపీ చీఫ్‌పై కేసు నమోదు
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. ప్రస్తుతం ఈ సంఘటన రాజకీయంగా కలకలంగా మారింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్నిపురస్కరించుకుని కేరళ బీజేపీ చీఫ్ కె. సురేంద్రన్ తమ కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అయితే, సరైన అవగాహన లేకుండా తలకిందులుగా ఉన్న జెండాను అలాగే ఎగురవేశారు. కాసేపటికి దీన్ని గమనించిన అక్కడి నేతలు తిరిగి జెండాను సరిచేసి ఎగురవేశారు. అప్పటికే పలువురు స్థానికులు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ క్లిప్పింగ్‌లు కాస్త వైరల్ కావడంతో పోలీసులు సదరు బీజేపీ నాయకుడిపై కేసు నమోదు చేశారు. అదే విధంగా, మొదటిసారి కేరళలో సీపీఐ (యం) పార్టీ ఆఫీస్‌లో నాయకులు జాతీయ జెండాను ఎగురవేసి వివాదంలో చిక్కుకున్నారు. జాతీయ జెండాకు సమానంగా.. తమ పార్టీ జెండాను ఎగురవేశారు. జెండా కోడ్ ప్రకారం.. జాతీయ జెండాకు సమానంగా వేరే ఏ పతాకాలు ఉండకూడదు. దీన్ని సీపీఐ (యం) ఉల్లంఘించిందని, దేశ త్రివర్ణపతాకాన్ని అవమానించారని కాంగ్రెస్‌నేత కె.ఎస్. సబరినాథన్ విమర్శించారు. దీనిపై స్థానిక బీజేపీ నాయకులు కూడా స్పందించారు. వెంటనే సీపీఐ (యం) నాయకులపై జెండాకోడ్ ఉల్లంఘన కింద కేసులను నమోదు చేయాలని పోలీసులను కోరారు. బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. pic.twitter.com/FJUCHAScY9 — ☭ Raihaan Ali ☭ (@Raihaan09816906) August 15, 2021 -
మనిషేనా! అంబులెన్స్‌పై నుంచి తలకిందులుగా..
-
మనిషేనా! అంబులెన్స్‌పై నుంచి తలకిందులుగా..
సాక్షి, తిరువనంతపురం : రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిపట్ల అంబులెన్స్ డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించాడు. జాలి చూపాల్సింది పోయి అతడి విషయంలో కఠినంగా వ్యవహరించాడు. తన అంబులెన్స్‌లో బాధితుడు మూత్ర విసర్జన చేసుకున్నాడనే కారణంతో స్ట్రెచర్‌పై తలకిందులుగా ఉంచాడు. ఆస్పత్రి సిబ్బంది వచ్చి తీసుకెళ్లే వరకు కూడా ఏమాత్రం కనికరం లేకుండా అలాగే ఉంచాడు. అయితే, చికిత్స పొందుతున్న అతడు ఈ శనివారం తెల్లవారు జామున చనిపోయాడు. తలకిందులుగా పెట్టిన సమయంలో చూసిన ఓ వ్యక్తి తన ఫోన్లో వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టగా అదిప్పుడు వైరల్ అయింది. ఆ డ్రైవర్‌ను పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మార్చి 20న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. తలకు కూడా బలమైన గాయాలు అయ్యాయి. దాంతో అతడిని మొదట పాలక్కడ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం త్రిశూర్‌లోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి ఓ ప్రైవేటు అంబులెన్స్ తరలించారు. అతడిని తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులుగానీ, బంధువులుగానీ వెళ్లలేదు. దాంతో ఓ స్ట్రాఫ్ మెంబర్‌ను తీసుకొని డ్రైవర్ త్రిశూర్ తీసుకెళ్లాడు. అయితే, ఆ సమయంలో బాధితుడు అంబులెన్స్‌లో మూత్రం పోశాడట. ఆ కారణంతో త్రిశూల్ ఆస్పత్రికి వెళ్లిన తర్వాత స్ట్రెచర్‌ను అంబులెన్స్‌పై కొంత నుంచి ఏటవాలుగా నేలపై పెట్టాడు. తీవ్రగాయాలు అయిన బాధితుడిని తలకిందులుగా పెట్టాడు. దాంతో అప్పటికే గాయం అయిన అతడి తల కూడా నేలకు ఆనింది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంబులెన్స్ డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
తలకిందులుగా చెట్లు ఎక్కేస్తాడు..!
-
తలకిందులుగా చెట్లు ఎక్కేస్తాడు..!
న్యూఢిల్లీ: పక్క కొమ్మలు లేకుండా నిటారుగా ఉన్న చెట్టును ఎక్కడం అందరికీ సాధ్యంకాదు. సాధన ఉంటేనే సాధ్యం. అలాంటిది హరియాణాకు చెందిన 32 ఏళ్ల ముఖేష్ కుమార్ నేరుగా కాకుండా తలకిందులుగా చెట్లు ఎక్కుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తన అసాధారణ ప్రతిభతో గిన్నిస్ బుక్‌లో రికార్డు నెలకొల్పడంతో పాటు కుటుంబం కోసం కొంత డబ్బు సంపాదించాలని ఆశిస్తున్నట్టు ముఖేష్ చెప్పాడు. ప్రస్తుతం అతను భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల వయసు నుంచి ముఖేష్ తలకిందులుగా చెట్లు ఎక్కడం ప్రారంభించాడు. అందరూ నిటారుగా చెట్లు ఎక్కుతారని, తలకిందులుగా ఎందుకు ఎక్కరాదన్న ఆలోచన వచ్చిందని, దీంతో వినూత్న పద్ధతిలో ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. పలుమార్లు గాయపడినా, తన అలవాటును మార్చుకోలేదని తెలిపాడు. మొదట్లో తలకిందులుగా రెండు లేదా మూడు అడుగులు మాత్రమే చెట్లు ఎక్కగలిగేవాడినని, సాధన చేసి పొడవాటి చెట్లను ఎక్కడం నేర్చుకున్నానని చెప్పాడు. ఎప్పుడూ పొడవాటి చెట్లను ఎక్కేందుకు ఆసక్తి చూపుతానని, అంతేగాక తక్కువ సమయంలో ఎక్కేందుకు సాధన చేస్తున్నానని ముఖేష్ తెలిపాడు. చెట్లను ఎక్కేటపుడు కంటే వేగంగా కిందకు దిగుతానని చెప్పాడు. 50 అడుగుల ఎత్తున్న చెట్లను ముఖేష్ ఐదు నిమిషాల్లోపే ఎక్కేస్తాడు. -
ఓ ఫేక్ ఫోటోను స్పూర్తిగా తీసుకొని..
రియో డి జెనిరో: ఎత్తైన కొండ అంచు. మూడొందల అడుగుల కింద సముద్రం. ఆ కొండ అంచునుంచి కేవలం కాళ్ల సహాయంతో తలకిందులుగా వేలాడాడు ఓ వ్యక్తి. ఆ సాహసం చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడచాల్సిదే. ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తున్న బ్రెజిల్‌లోని రియో డి జెనీరోకు చెందిన 27 ఏళ్ల పోలీస్ ఆఫీసర్ చేసిన సాహసం ఇప్పుడు అందరిచే ఔరా అనిపిస్తుంది. లుయీజ్ ఫెర్నాండో క్యాండియా రియో డిజెనీరో లోని ఓ కొండ అంచునుంచి వేలాడిన ఫోటోలు ఇప్పుడు అంతర్జాలంలో హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఉంచిన ఫేక్ ఫోటోను స్పూర్తిగా తీసుకొని లుయీజ్ ఈ సాహసం చేయడం విశేషం. తన మిత్రుడి సహాయంతో తాడుతో ముందుగా కొండ అంచుకు చేరుకున్న లూయీజ్.. కాళ్ల సపోర్ట్‌తోనే వేలాడి ఫోటోలకు పోజిచ్చాడు. అనంతరం మళ్లీ తన మిత్రుడి సహాయంతో కొండపైకి చేరుకున్నట్లు లూయీజ్ తెలిపాడు. అతడి సాహసం, ఫిట్‌నెస్‌పై పొగడ్తలు వెల్లువెత్తుతున్నాయి. స్పూర్తినిచ్చిన ఫేక్ ఫోటో