స్ట్రెచర్‌పై తలకిందులుగా ఉన్న రోడ్డు ప్రమాద బాధితుడు
సాక్షి, తిరువనంతపురం : రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిపట్ల అంబులెన్స్ డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించాడు. జాలి చూపాల్సింది పోయి అతడి విషయంలో కఠినంగా వ్యవహరించాడు. తన అంబులెన్స్‌లో బాధితుడు మూత్ర విసర్జన చేసుకున్నాడనే కారణంతో స్ట్రెచర్‌పై తలకిందులుగా ఉంచాడు. ఆస్పత్రి సిబ్బంది వచ్చి తీసుకెళ్లే వరకు కూడా ఏమాత్రం కనికరం లేకుండా అలాగే ఉంచాడు. అయితే, చికిత్స పొందుతున్న అతడు ఈ శనివారం తెల్లవారు జామున చనిపోయాడు. తలకిందులుగా పెట్టిన సమయంలో చూసిన ఓ వ్యక్తి తన ఫోన్‌లో వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టగా అదిప్పుడు వైరల్ అయింది. ఆ డ్రైవర్‌ను పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మార్చి 20న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు.
తలకు కూడా బలమైన గాయాలు అయ్యాయి. దాంతో అతడిని మొదట పాలక్కడ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం త్రిశూర్‌లోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి ఓ ప్రైవేటు అంబులెన్స్ తరలించారు. అతడిని తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులుగానీ, బంధువులుగానీ వెళ్లలేదు. దాంతో ఓ స్ట్రాఫ్ మెంబర్‌ను తీసుకొని డ్రైవర్ త్రిశూర్ తీసుకెళ్లాడు. అయితే, ఆ సమయంలో బాధితుడు అంబులెన్స్‌లో మూత్రం పోశాడట. ఆ కారణంతో త్రిశూల్ ఆస్పత్రికి వెళ్లిన తర్వాత స్ట్రెచర్‌ను అంబులెన్స్‌పై కొంత నుంచి ఏటవాలుగా నేలపై పెట్టాడు. తీవ్రగాయాలు అయిన బాధితుడిని తలకిందులుగా పెట్టాడు. దాంతో అప్పటికే గాయం అయిన అతడి తల కూడా నేలకు ఆనింది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంబులెన్స్ డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment