చెట్లపై తలకిందులుగా వేలాడే గబ్బిలాల గురించి మనకు తెలిసిందే. అవి ఏ సైజులో ఉంటాయో కూడా మనకు తెలుసు. అయితే మనిషంత సైజులో గబ్బిలం ఉండటాన్ని మనం ఊహించగలమా? ఊహించడానికే మనకు భయం వేస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫొటో వైరల్‌గా మారింది. ఇది చూపరులను భయకంపితులను చేస్తోంది. మనిషి సైజులో ఉన్న ఈ గబ్బిలం ఇంటి చూరుకు వేలాడుతూ భయపెడుతోంది. గబ్బిలాలను పిశాచాలతో పోలుస్తుంటారు. కొన్ని జాతులకు చెందిన గబ్బిలాలు ఇతర జంతువుల రక్తం తాగుతాయి. ఈ కారణంగా వీటిని పిశాచాలతో పోలుస్తారు.
అయితే ఈ ఫొటోను చూసి ఎవరూ భయపడనక్కరలేదు. ఎందుకుంటే ఎవరో గబ్బిలం తరహా వేషధారణతో జనాలను భయపెట్టేందుకు ఇలా తలకిందులుగా వేలాడుతున్నారని కొందరు అంటున్నారు. అయితే ఇది ఎంత సహజంగా ఉందంటే నిజమైన గబ్బలం వేలాడుతున్నదని ఈ ఫొటో చూసినవారంతా హడలెత్తిపోతున్నారు. అయితే అసలు విషయం తెలిశాక అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.
అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఫొటోలో గబ్బిలం రూపం అంత పెద్దగా కనిపించడానికి కెమెరా ట్రిక్ కారణమట. ఆప్టికల్ ఇల్యూజన్ సృష్టించారట. ఒక సాధారణ గబ్బిలం ఫొటోను పెద్దదిగా చేసి చూపారుట. ట్విట్టర్‌లోని ఈ ఫొటో అందరి దృష్టిని ఇట్టే ఆకర్షిస్తోంది.ఈ ఫొటోకు ఇప్పటివరకూ 58కే కు మించిన రీట్వీట్లు, 234కే కు మంచిన లైక్స్ వచ్చాయి. ఈ ఫొటో చూసిన ఒక యూజర్ ఇంత పెద్ద గబ్బిలం ప్రపంచంలో ఉంటే ఏమవుతుందో అని రాయగా, ఇది ఎడిటింగ్ పిక్చర్ అని మరో యూజర్ కామెంట్ చేశాడు.
ఇది కూడా చదవండి: భార్యాపిల్లల గుర్తుగా చేసిన పనికి.. రూ. 90 కోట్లు అదృష్టం వరించింది!
Remember when I told y'all about the Philippines having human-sized bats? Yeah, this was what I was talking about pic.twitter.com/nTVIMzidbC
— hatdog² (@AlexJoestar622) June 24, 2020
Comments
Please login to add a commentAdd a comment