పాఠశాల విద్యార్థుల కోసం కాల్‌సెంటర్‌ | Call Centres For School Students | Sakshi
Sakshi News home page

పాఠశాల విద్యార్థుల కోసం కాల్‌సెంటర్‌

Published Fri, Mar 9 2018 3:44 AM | Last Updated on Fri, Mar 9 2018 3:44 AM

Call Centres For School Students - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించేందుకు, పరీక్షలపై సలహాలు, కెరీర్, ఇతర విద్యా సంబంధిత విషయాలను తెలుసుకునేందుకు పాఠశాల విద్యా శాఖ విద్యార్థుల కోసం కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసింది. పాఠశాల విద్యా డైరెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఈ కాల్‌సెంటర్‌కు (1800 425 7462) ఫోన్‌ చేసి విద్యార్థులు సలహాలు, సూచనలు పొందవచ్చని పాఠశాల విద్య డైరెక్టర్‌ కిషన్‌ వెల్లడించారు. ఈ సదుపాయం మార్చి 12వ తేదీన అందుబాటులోకి వస్తుం దన్నారు. విద్యార్థులే కాకుండా తమ పిల్లల సమస్యలపై తల్లిదండ్రులు కూడా ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు సంప్రదించవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement