హుదూద్ తుపాన్ నేపథ్యంలో జిల్లాలో గత రాత్రి 11.00 గంటల నుంచి విద్యా సరఫరాను అధికారులు నిలిపివేశారు.
శ్రీకాకుళం: హుదూద్ తుపాన్ నేపథ్యంలో జిల్లాలో గత రాత్రి 11.00 గంటల నుంచి విద్యా సరఫరాను అధికారులు నిలిపివేశారు. దీంతో జిల్లాలో సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించింపోయింది. జిల్లాలోని పలు ఎమ్మార్వో కార్యాలయాల్లో కాల్ సెంటర్లు పని చేయలేదు. దాంతో ఉన్నతాధికారులు... పోలీసులు వద్ద ఉన్న యూహెచ్ఎఫ్ సెట్లపైనే అధారపడి పని చేస్తున్నారు.
సహాయక చర్యలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భారీ వర్షాలు... ఈదురు గాలులతో శ్రీకాకుళం పట్టణంలో పలు కాలనీల్లో చెట్లు కూలిపోయాయి. అలాగే శ్రీకాకుళం - పాలకొండ, శ్రీకాకుళం - కళింగపట్నం, శ్రీకాకుళం - రాజాం రహదారులపై భారీ వృక్షాలు కుప్ప కూలిపోయాయి. దీంతో ఎక్కడికక్కడ వావానాలు నిలిచిపోయాయి.