అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ!
Published Mon, Oct 20 2014 11:51 PM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
శ్రీకాకుళం: హుదూద్ తుఫాన్ తాకిడి గురైన ప్రాంతాల్లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని 21 గ్రామాలు మినహా అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధిరించామని ట్రాన్స్ కో సీఎండీ విజయానంద్ తెలిపారు.
ఉత్తరాంధ్రలో ఈపీడీసీఎల్ కు 1200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు. త్వరలోనే గురివిడి సబ్ స్టేషన్ కు 220 కేవీ లైన్ ను పునరుద్దరిస్తామని విజయానంద్ తెలిపారు.
Advertisement