ఇన్‌చార్జి కలెక్టర్‌గా వివేక్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సోమవారం విధుల నుంచి రిలీవ్ అయ్యారు. ఐఏఎస్ అధికారుల విభజనలో భాగంగా గౌరవ్ ఉప్పల్‌ను తెలంగాణకు కేటాయించడంతో ఆయన్ను రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారమే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్‌గా ఎవరినీ నియమించకపోవడంతో ఇన్‌చార్జి బాధ్యతలను జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్‌కు అప్పగించి రిలీవ్ అయ్యారు. దాంతో కొత్త కలెక్టర్ వచ్చే వరకు జేసీయే ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తారు. 2014 అక్టోబర్‌లో హుద్‌హుద్ తుపాను సమయంలో జిల్లాకు జేసీగా వచ్చిన యాదవ్ తుపాను సహాయ పనుల్లో సమర్థంగా వ్యవహరించారు. కొత్త కలెక్టర్ నియామకంలో జాప్యం జరిగే సూచనలు కనిపిస్తుండటంతో ఆయనే కొన్నాళ్లపాటు ఇన్‌చార్జిగా కొనసాగనున్నారు.