మరో భారీ కాల్ సెంటర్ గుట్టు రట్టు
థానే: మహారాష్ట్రలోని థానేలో భారీ నకిలీ కాల్ సెంటర్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్థానిక బిపిఓపై దాడిచేయడంతో రాకెట్ గుట్టు రట్టయింది. అమెరికన్లే టార్గెట్‌గా అక్రమాలకు పాల్పడుతున్న కాల్ సెంటర వ్యవరం బట్టబయలైంది. ఈ నకిలీ కాల్ సెంటర్ల ద్వారా అమెరికన్ పౌరులకు భారీ లోన్ల పేరుతో ఎరవేసినట్టునట్టు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మధుకర్ పాండే చెప్పారు.
మధుకర్ పాండే అందించిన సమాచారం ప్రకారం గత రాత్రి జిల్లాలోని అంబర్‌నాథ్‌లోని ఆనంద్ నగర్ వద్ద మౌంట్ లాజిక్ సొల్యూషన్స్ సంస్థ పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కొంతమంది మహిళలతోపాటు, 25మందిని అదుపులోకి తీసుకున్నారు. 31 హార్డ్ డిస్క్‌లు మూడు ల్యాప్ టాప్లు, ఇతర అనేక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
కొలంబస్ బ్యాంక్‌నుంచి మాట్లాడుతున్నామని నమ్మబలికి, కమీషన్ ముట్టిన అనంతరం బాధితులకు మొఖం చాటేస్తున్నారని తెలిపారు. కాల్ సెంటర్కు ఇది 2015 నుంచి ఉనికిలోఉన్న ఈ కాల్ సెంటర్ ద్వారా యజమాని జయా గుంజాల్ నెలకు రూ. 7-8 లక్షలు సంపాదించినట్టు పోలీసులు గుర్తించారు. సిబ్బందికి అమెరికన్ యాసతో శిక్షణ ఇప్పించి మరీ దోపిడీకి పాల్పడుతున్నారని పోలిస్ సీనియర్ అధికారి చెప్పారు. ఈ వ్యవహారంపై శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
కాగా గత ఏడాది, థానే జిల్లాలోని మీరా రోడ్డులో ఇదే తరహా కాల్ సెంటర్ రాకెట్‌ను ఛేదించామని, 75మందిని అరెస్ట్‌చేశామని పోలీసులు వెల్లడించారు. అప్పట్లో ఈ భారీ స్కాం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.