వాషింగ్టన్: భారతీయ కాల్ సెంటర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే బిల్లును అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. అమెరికన్ కాల్ సెంటర్లను పరిరక్షించాలని డెమొక్రటిక్ సెనేటర్ షెర్రాడ్ బ్రౌన్ ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ బిల్లు చట్టమైతే భారత్‌లోని కాల్ సెంటర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. ‘బై అమెరికన్, హైర్ అమెరికన్’ అన్న ట్రంప్ విధానంలో భాగంగా ఈ బిల్లు వచ్చింది.
బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా బ్రౌన్ మాట్లాడుతూ.. ‘చాలాకాలంగా అమెరికా వాణిజ్యం, పన్ను విధానం కార్పొరేట్ వ్యాపారాల్ని ప్రోత్సహించాయి. దీంతో ఓహియోలో వ్యాపార కార్యకలాపాలు మందగించాయి. అమెరికా నౌకల ఉత్పత్తి పరిశ్రమలు మెక్సికోలోని రైనోసాకు, చైనాలోని వుహాన్‌కు తరలిపోయాయి. కాల్ సెంటర్ ఉద్యోగాలు ఇతర దేశాలకు తరలిపోయాయి. ఓహియాలోనూ, దేశవ్యాప్తంగా ఉన్న పలు కాల్ సెంటర్లను చాలా కంపెనీలు భారత్ లేదా మెక్సికోకు తరలించాయి. ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల వల్ల ఎందరో అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయార’న్నారు.
బిల్లులో ముఖ్యాంశాలివీ...
♦ భారత్ వంటి దేశాల కాల్ సెంటర్ ఉద్యో గులు తామున్న ప్రాంతాన్ని వినియోగదారులకు కచ్చితంగా తెలపాలి.
♦ వినియోగ దారులకు తమ కాల్‌ను అమెరికాలో ఉన్న సర్వీస్ ఏజెంట్‌కు బదిలీ చేయమని అడిగే హక్కు ఉంటుంది.
♦ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను విదేశీయులకు కాకుండా అమెరికన్లకు ఇచ్చే కంపెనీలకే ఫెడరల్ కాంట్రాక్టులు ఇచ్చే విషయంలో ప్రాధాన్యం.
Comments
Please login to add a commentAdd a comment