కాల్‌ సెంటర్‌లో ‘కేటుగాళ్లు’ | Jamtara gang in Call Center | Sakshi
Sakshi News home page

కాల్‌ సెంటర్‌లో ‘కేటుగాళ్లు’

Published Fri, Feb 3 2017 3:07 AM | Last Updated on Tue, Aug 14 2018 3:18 PM

కాల్‌ సెంటర్‌లో ‘కేటుగాళ్లు’ - Sakshi

కాల్‌ సెంటర్‌లో ‘కేటుగాళ్లు’

వినియోగదారుల డేటా లీక్‌ చేస్తోంది బీపీవో ఉద్యోగులే
►  దీని ఆధారంగానే స్వాహా చేస్తున్న ‘జమ్‌తార’గ్యాంగ్‌
కరంతాడ్‌ ద్వయం ఇళ్లల్లో జరిపిన సోదాల్లో ఆధారాలు లభ్యం
►  కాల్‌ సెంటర్‌ ఉద్యోగులపై చర్యలకు సన్నాహాలు


సాక్షి, హైదరాబాద్‌: జాతీయ బ్యాంకులు తమ ఖాతాదారులకు అవసరమైన సేవలందించడా నికి ఏర్పాటు చేసుకున్న కాల్‌ సెంటర్ల నుంచే కస్టమర్ల ‘డేటా’ లీక్‌ అవుతోంది. దీని ఆధారం గానే సైబర్‌ నేరగాళ్లు ఆయా వినియోగదా రులకు ఫోన్లు చేసి అందినకాడికి దండుకుం టున్నారు. సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన కరంతాడ్‌ ద్వయం కేసులో దీనికి సంబంధించిన కీలకా ధారాలు లభించాయి.

ఫిర్యాదు వివరాలు చెప్పడంతో...
నగరంలోని డీఆర్‌డీఏలో పనిచేసే ఓ సైంటిస్ట్‌ తన సమస్యపై ఎస్‌బీఐ కాల్‌ సెంటర్‌కు ఫిర్యా దు చేశారు. 24 గంటల్లోనే ఆయనకు ‘కాల్‌ సెంటర్‌’ నుంచి ఫోన్‌ వచ్చింది. ఫిర్యాదు పరి ష్కరించడానికి ఫోన్‌ చేశామని చెప్పిన నేరగా ళ్లు.. దానికోసం మరో బ్యాంకు ఖాతా వివరా లు కోరారు. దీంతో తనకు మరో బ్యాంక్‌లో ఉన్న ఖాతా వివరాలు చెప్పారు. ఇలా ఆ సైంటిస్ట్‌ను బుట్టలో వేసుకున్న సైబర్‌ గ్యాంగ్‌ ఆయన ఖాతా నుంచి రూ.1.09 లక్షలు కాజేసింది. దీనిపై సైంటిస్ట్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.

సైంటిస్ట్‌ కేసు దర్యాప్తులో భాగంగా...
‘బ్యాంక్‌ కాల్స్‌’ పేరుతో రెచ్చిపోతున్న ఉదం తాలు ఇటీవల పెరిగిపోయాయి. ఈ నేర గాళ్లలో కొందరు జార్ఖండ్‌– పశ్చిమ బెంగాల్‌ మధ్య ఉన్న జమ్‌తార కేంద్రంగా దందాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. వీరిని పట్టుకోవడా నికి అక్కడికి వెళ్లిన సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం కరంతాడ్‌లో మనీష్‌బర్నవాల్, వికాస్‌కుమార్‌ రావణిని పట్టుకున్నారు. సైంటిస్ట్‌ ఖాతా నుంచి డబ్బు కాజేసింది వీరిద్దరే కావడంతో.. కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే విషయం ఎలా తెలిసిందనేది ఆరా తీశారు.

మరో కేసు నమోదుకు సన్నాహాలు...
మనీష్, వికాస్‌ను లోతుగా విచారించగా.. తమకు బ్యాంక్‌ కస్టమర్ల సమాచారం కాల్‌ సెంటర్‌ నుంచే అందుతోందని అంగీకరించా రు. నష్టపోతున్న వారిలో ఎక్కువగా కొన్ని బ్యాంకుల వినియోగదారులు ఉండటానికీ ఇదే కారణమని పోలీసులు అంచనా వేస్తు న్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు సదరు కాల్‌ సెంటర్‌ పాత్రనూ కేసులో పొందుపరచాలని నిర్ణయించారు. కాల్‌ సెంటర్‌ ఉద్యోగుల్నీ నిందితులుగా చేర్చి అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేశారు. దీనిపై సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ రఘువీర్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘ఇక్కడ నమోదైన కేసుకు సంబంధించి వినియోగదారుడి సమాచారం మనీష్, వికాస్‌కు ఏ కాల్‌ సెంటర్‌ నుంచి అందిందనేది గుర్తించాలి. న్యాయస్థానం అనుమతితో నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని ఈ కోణంలో విచారిస్తాం. వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’అని చెప్పారు.

సోదాల్లో దొరికిన ‘కోల్‌కతా నోటీసు’..
మనీష్, వికాస్‌ ఇళ్లల్లో సోదాలు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు లభించిన కోల్‌కతా పోలీసుల నోటీసు ‘సమాచారం గుట్టు’ వీడడానికి కీలకమైంది. బెంగాల్‌ల్లో ఎస్‌బీఐ కాల్‌ సెంటర్‌ను ఇంటెల్‌ నెట్‌ గ్లోబెల్‌ సర్వీసె స్‌ బీపీవో సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో పని చేసే విధాన్‌ దాస్‌ మరికొందరు ఉద్యోగులు సైబర్‌ నేరగాళ్లకు సహకరిస్తు న్నారు. కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదుల సమాచారాన్ని కమీషన్‌ తీసుకుని మనీష్, వికాస్‌కు అందిస్తున్నారు. ‘లీకేజ్‌’వ్యవహారా న్ని గతంలోనే గుర్తించిన బ్యాంకు.. కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా మనీష్, వికాస్‌ పేర్లు వెలుగులోకి రావడంతో విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ఇవే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సోదాల్లో లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement