Call Centre Scheme: రోజు రోజుకి ప్రపంచ వ్యాప్తంగా కాల్ సెంటర్ మోసాలు భారీగా జరుగుతున్నాయి. వీటిని నివారించడానికి సంబంధిత శాఖలు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, మోసగాళ్లు కూడా ఎత్తుకి పైఎత్తు వేస్తున్నారు. ఇలాంటి సంఘటనలో గతంలో కోకొల్లలుగా జరిగాయి. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ట్విటర్ ద్వారా వెల్లడైన వీడియోలో మీరు గమనించినట్లతే కాల్ సెంటర్ అందులో పని చేసే ఉద్యోగులు స్పష్టంగా కనిపిస్తారు. ఇందులో ఒక ఉద్యోగి 'చర్చిల్' అనే వ్యక్తికి ఫోన్ చేసి మీ వాషింగ్ మిషన్ వారంటీ ముగిసిందని, వారంటీ పొడిగించడానికి కాల్ చేస్తున్న అంటూ మాట్లాడుతుంది. నిజానికి ముందుగానే పక్కా ప్రణాళిక ప్రకారం ఈ మోసాలు జరుగుతున్నట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది.
Making Life HELL For Scammers pic.twitter.com/hhPJ50EYVG
— Insane Reality Leaks (@InsaneRealitys) June 28, 2023
కాల్ సెంటర్లో పనిచేస్తున్న ఉద్యోగులలో ఒక వ్యక్తి ల్యాప్ టాప్ ముందు ఉన్నట్లు, పక్కన ఉన్న మరో వ్యక్తి డ్యూయెల్ మానిటర్ సెటప్ కలిగి ఉండటం చూడవచ్చు. బహుశా వీరే ఆ కాల్ సెంటర్ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. వారు ముందుగానే కొంతమందిని సెలక్ట్ చేసుకుని వారికి ఫోన్స్ చేస్తున్నట్లు కూడా మీరు ఈ వీడియోలో గమనించవచ్చు.
ఇలాంటి మోసాలు జరగటం ఇదే మొదటి సారి కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇలాంటి మోసాలు ఎక్కువైపోతున్నాయి. కొంత మంది వందల కోట్లు ఈ కాల్ సెంటర్ల ద్వారా స్కామ్ చేస్తున్నారు. బాగా చదువుకున్న వ్యక్తులు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మొత్తానికి మీకు తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే వారంటీలు, ఇతరత్రా కారణాలు చెప్పి మభ్య పెట్టాలని చూస్తే వాటికి స్పందించకపోవడం మంచిది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి కాల్స్ వస్తే పోలీసులకు పిర్యాదు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment