scham
-
కాల్ సెంటర్ స్కామ్ జరుగుతుందిలా! ఆదమరిస్తే..
Call Centre Scheme: రోజు రోజుకి ప్రపంచ వ్యాప్తంగా కాల్ సెంటర్ మోసాలు భారీగా జరుగుతున్నాయి. వీటిని నివారించడానికి సంబంధిత శాఖలు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, మోసగాళ్లు కూడా ఎత్తుకి పైఎత్తు వేస్తున్నారు. ఇలాంటి సంఘటనలో గతంలో కోకొల్లలుగా జరిగాయి. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ట్విటర్ ద్వారా వెల్లడైన వీడియోలో మీరు గమనించినట్లతే కాల్ సెంటర్ అందులో పని చేసే ఉద్యోగులు స్పష్టంగా కనిపిస్తారు. ఇందులో ఒక ఉద్యోగి 'చర్చిల్' అనే వ్యక్తికి ఫోన్ చేసి మీ వాషింగ్ మిషన్ వారంటీ ముగిసిందని, వారంటీ పొడిగించడానికి కాల్ చేస్తున్న అంటూ మాట్లాడుతుంది. నిజానికి ముందుగానే పక్కా ప్రణాళిక ప్రకారం ఈ మోసాలు జరుగుతున్నట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. Making Life HELL For Scammers pic.twitter.com/hhPJ50EYVG — Insane Reality Leaks (@InsaneRealitys) June 28, 2023 కాల్ సెంటర్లో పనిచేస్తున్న ఉద్యోగులలో ఒక వ్యక్తి ల్యాప్ టాప్ ముందు ఉన్నట్లు, పక్కన ఉన్న మరో వ్యక్తి డ్యూయెల్ మానిటర్ సెటప్ కలిగి ఉండటం చూడవచ్చు. బహుశా వీరే ఆ కాల్ సెంటర్ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. వారు ముందుగానే కొంతమందిని సెలక్ట్ చేసుకుని వారికి ఫోన్స్ చేస్తున్నట్లు కూడా మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. ఇలాంటి మోసాలు జరగటం ఇదే మొదటి సారి కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇలాంటి మోసాలు ఎక్కువైపోతున్నాయి. కొంత మంది వందల కోట్లు ఈ కాల్ సెంటర్ల ద్వారా స్కామ్ చేస్తున్నారు. బాగా చదువుకున్న వ్యక్తులు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మొత్తానికి మీకు తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే వారంటీలు, ఇతరత్రా కారణాలు చెప్పి మభ్య పెట్టాలని చూస్తే వాటికి స్పందించకపోవడం మంచిది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి కాల్స్ వస్తే పోలీసులకు పిర్యాదు చేయవచ్చు. -
పాఠశాలల్లో వసతులపై మే నుంచి తనిఖీలు
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలను గుర్తించి వాటిపై చర్యలు చేపట్టేందుకు ఈ ఏడాది మే నుంచి ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ చెప్పారు. బాలల హక్కులను పరిరక్షించే అంశంపై న్యాయసేవా సదన్‌లో గురువారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల నిర్వహణకు అనుమతులిచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా ఫీజులు, పుస్తకాల రూపంలో దోపిడీ చేస్తే సహించేది లేదన్నారు. విద్యార్థులకు తగిన నిష్పత్తిలో మరుగుదొడ్లు, క్రీడామైదానం, రెండు అంతస్తులకు మించిన భవనాల్లో స్కూళ్లు నడపకుండా చూడటం, అన్ని అంతస్తుల్లో తాగునీటి సౌకర్యం, అగ్నిప్రమాదాల నుంచి రక్షణకు చర్యలు తదితర ప్రభుత్వ నిబంధనలు పాటించిన స్కూళ్లకు మాత్రమే అనుమతులివ్వాలన్నారు. లేని వసతులు ఉన్నట్లు రికార్డుల్లో చూపించి, అనుమతిస్తే అందుకు అధికారులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ అంశాలపై తల్లిదండ్రులు, ఇంకెవరైనా అన్యాయం జరుగుతోందని భావిస్తే వారికి తెలిసిన న్యాయవాది లేదా జిల్లా న్యాయసేవా సంస్థ ద్వారా తమను సంప్రదించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు స్కూళ్లకు వెళ్లకుండానే హాజరైనట్లు చూపిస్తున్నారని, అటువంటి వారిపై భవిష్యత్‌లో చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. డీఆర్వో ఆర్.రాజ్‌కుమార్, ఏఎస్పీ ఏ.వి.రమణ, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ భువనగిరి కృష్ణవేణి, డీఈఓ నాగమణి, ఫ్యామిలీ కోర్టు జడ్జి భీమారావు, జిల్లా న్యాయసేవాసంస్థ కార్యదర్శి ఎం.శ్రీహరి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఏమార్చే యత్నం !
సాక్షిప్రతినిధి, అనంతపురం: ఎరువుల కుంభకోణంలో సూత్రదారులైన ఇద్దరు అధికారులను తప్పించేలా విచారణ సాగుతోందా..? వ్యవసాయాధికారులతో పాటు మిక్సింగ్‌ప్లాంటుపై ఎలాంటి చర్యలు లేకుండా చూడాలని ఓ ముఖ్య ప్రజాప్రతినిధి చేసిన ఆదేశాలను విచారణ అధికారులు పాటిస్తున్నారా...? తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. ఎరువుల కుంభకోణంలో మార్క్‌ఫెడ్‌కు వెళ్లాల్సిన 50 శాతం ఎరువులు భాస్కర్ ఫర్టిలైజర్స్‌కు వెళ్లినట్లు తేలింది. ఈ ఎరువులను అధికారులు సీజ్ చేశారు. వాస్తవానికి కలెక్టర్, జేడీ, ఏడీ పీపీ కనుసన్నల్లో ఎరువుల కేటాయింపులు జరగాలి. ‘సాక్షి’లో కథనాలు వచ్చే వరకూ భాస్కర్‌ఫర్టిలైజర్స్ వైపు అధికారులు కన్నెత్తి చూడలేదు. దీన్నిబట్టే అధికారుల ప్రమేయంతోనే ఎరువులు ప్లాంటుకు చేరినట్లు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదిన వచ్చిన రేక్‌లోని ఎరువులను కూడా ప్లాంటుకు తరలించినట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ‘సాక్షి’లో ‘దారితప్పిన ఎరువులు’ శీర్షికతో కథనం ప్రచురితం కావడంతో అదేరోజు మధ్యాహ్నం లోపు ఎరువులను ‘సెంట్రల్‌వేర్‌హౌస్’ గోడౌన్ తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలన్నీ బట్టి చూస్తే వ్యవసాయధికారులే 1,300 టన్నుల ఎరువులను దారి మళ్లించారని తెలుస్తోంది. ఈ ఘటనకు ఎరువుల పర్యవేక్షణ చూసే అధికారులు బాధ్యత వహించాలి. అయితే వీరిని తప్పించేందుకు ఇప్పుడు కథ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ‘మార్క్‌ఫెడ్’ అధికారులు వద్దన్నారు కాబట్టే ఎరువులు ప్లాంటుకు పంపామని కథ అల్లుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మార్క్‌ఫెడ్‌తో పాటు, రేక్ ఆఫీసర్ పాత్రను తెరపైకి తెచ్చారు. వాస్తవానికి రేక్ ఆఫీసర్ అనే పోస్టు లేదు. లోకల్ ఏఓ లేదా ఏడీని నామినేట్ చేయాలి. ప్రస్తుతం ఏఓగా వాసుప్రకాశ్, రవి ఏడీఏగా ఏడాదిన్నరగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవ్వరినీ రేక్ ఆఫీసర్‌గా నామినేట్ చేయలేదు. ఎరువులను జేడీఏ కార్యాలయ అధికారులే పర్యవేక్షిస్తున్నారు. అంటే వేల టన్నుల ఎరువులు రైల్వేస్టేçÙన్కు వస్తుంటే అవి ఎవరికి పంపాలి..? కేటాయింపులు ఎవరు చూడాలి..? బాధ్యత ఎవరిదనేది లే కుండా ఇంత కాలం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో తెలుస్తోంది. భాస్కర్ ఫర్టిలైజర్స్‌కు కేటాయింపులు కీలక అధికారుల కనుసన్నల్లో జరగడం, విషయం బయటకు పొక్కడంతో బాధ్యులని తప్పించేందుకు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తెలుస్తోంది. కలెక్టర్ నిస్పాక్షికంగా విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.