
ప్రమాదంలో కాల్ సెంటర్ ఉద్యోగాలు..
వాషింగ్టన్ : హెచ్1బీ వీసాల నియంత్రణ చేపట్టిన ట్రంప్ సర్కార్ తాజాగా కాల్‌సెంటర్ ఉద్యోగాలను అమెరికన్లకే కట్టబెట్టేలా అడుగులు వేస్తోంది. భారత్‌లో కాల్‌సెంటర్ ఉద్యోగాలు పెనుముప్పును ఎదుర్కోనున్నాయి. విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహించే కాల్‌సెంటర్ ఉద్యోగులు తమ ప్రదేశాన్ని వెల్లడించడంతో పాటు అమెరికాలోని సర్వీస్ ఏజెంట్‌కు కాల్‌ను బదలాయించాలని కోరే హక్కు కస్టమర్‌కు కల్పించేలా ఓ బిల్లును కాంగ్రెస్ ఆమోదించింది. ఒహియో సెనేటర్ షెరుద్ బ్రౌన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
కాల్‌సెంటర్ జాబ్స్‌ను అవుట్‌సోర్స్ చేసే కంపెనీల జాబితాను రూపొందించాలని, ఈ ఉద్యోగాలను విదేశాలకు అవుట్‌సోర్స్ చేయని అమెరికన్ కంపెనీలకే కాంట్రాక్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. అమెరికాలో కాల్‌సెంటర్ జాబ్స్ కనుమరుగయ్యాయి..ఒహియో సహా అమెరికా అంతటా తమ కాల్ సెంటర్‌లను మూసివేసిన కంపెనీలు భారత్, మెక్సికోకు తరలించాయని సెనేటర్ బ్రౌన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాల్‌సెంటర్ ఉద్యోగుల సేవలను స్వీకరించాల్సి ఉందని, వారి జాబ్‌లను విదేశాలకు ఎగరేసుకుపోరాదని అన్నారు. కాగా ఈ బిల్లు చట్టరూపం దాల్చితే ముఖ్యంగా భారత్‌లో కాల్ సెంటర్ ఉద్యోగాలకు రిస్క్ పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment