బజ్జున్న బంగారు తల్లి
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: ప్రభుత్వం ఏదైనా సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడితే దాన్ని సమర్థంగా నడిపించగలగాలి. చట్టం చేస్తే దాన్ని ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆపరాదు. కానీ బంగారు తల్లి పథకాన్ని మాత్రం ఎటువంటి లక్ష్యాలూ లేకుండానే ప్రవేశపెట్టారు. ఏడాది తిరక్కముందే ఆపేశారు. బంగారు తల్లి పథకం గురించి పెద్దఎత్తున ప్రచారం చేసిన ప్రభుత్వ యంత్రాంగం తరువాత పట్టించుకోవడం మానేసింది. మార్చి నెలనుంచి నిధులు జమచేయకపోవడంతో లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఇద్దరు ఆడపిల్లలున్న కుటుంబానికి ఆర్థిక సహా యంగా పలుమార్లు నిధులు వచ్చేలా చట్టం చేసినప్పటికీ నిధులు మాత్రం విడుదల కావడం లేదు. ఇంతకీ ఈ పథకానికి కొత్త ప్రభుత్వ యంత్రాంగం నిధులు విడుదల చేస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గత ఏడాది మే 1న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బంగారు తల్లి పథకాన్ని ప్రారంభిం చారు.
మే1వ తేదీ తరువాత జన్మించిన ఆడపిల్లలందరికీ ఈ పథకం వర్తిస్తుందనడంతో పిల్లల తల్లిదండ్రులు బ్యాంకుల్లో అకౌంట్లు ప్రారంభించి, పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. పథకం ప్రారంభంలో దరఖాస్తు చేసుకున్న వారి బ్యాంకు అకౌంట్లలో కొద్ది మొత్తంలో డబ్బులు వేశారు. దీంతో మిగతా వారిలో కూడా నమ్మ కం పెరిగింది. కానీ అన్ని పథకాల్లాగే ఇది కూడా నిధుల లేమితో నిలిచిపోరుుంది. ఈ సంవత్సరం జూన్ 6 నాటి కి జిల్లాలో వెబ్‌సైట్ ప్రకారం 9,600 మంది రిజిస్టర్ చేసుకోగా, వారిలో కేవలం 4,875 మందికే పథకాన్ని వర్తింపజేశారు. నిధుల్లేక మిగతా వారికి వర్తింపచేయలే దు. అయితే పథకాన్ని పర్యవేక్షిస్తున్న డీఆర్‌డీఏ అధికారుల వివరణ ప్రకారం...7,828 మంది దరఖాస్తుచేసుకోగా 4,875 మందికి నిధులు విడుదల చేశామని, ఇంకా 2953 మందికి పథకాన్ని వర్తింపజేయాల్సి ఉందని చెబుతున్నారు.
వ్యయప్రయాసలతో రిజిస్ట్రేషన్
ఈ పథకం కోసం రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వ్యయప్రయాసలకు గురవుతున్నా ఫలితం లభించడం లేదు. దీనికి దరఖాస్తు చేసుకోడానికి ఆరురకాల ధ్రువీ కరణ పత్రాలు ఉండాలి. అలాగే పాస్‌పోర్ట్‌సైజ్ ఫొటో లు, తల్లి పేరుమీద బ్యాంకు ఖాతా తెరిచినట్లు ధ్రువీకరణ పత్రాల జిరాక్స్, తదితర వాటి కోసం దరఖాస్తుదారులు ఖర్చు చేసి, అధికారుల చుట్టూ తిరిగినా...నిధులు మాత్రం రావడం లేదు.
ఎప్పుడెప్పుడు ఎంతెంత మంజూరు అంటే...
ఆడపిల్ల పుట్టగానే రూ.2,500 తల్లి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు.
రెండేళ్ల వరకూ టీకాల కోసం రూ.2000 (ఏడాదికి వేయి చొప్పున)
పాపకు ఐదేళ్లు వచ్చే వరకూ సంవత్సరానికి రూ.1500 చొప్పున రూ.4,500
పదేళ్లవరకూ సంవత్సరానికి రూ.2,500 చొప్పున రూ.పదివేలు
13 ఏళ్ల వరకూ రూ.7,500 (ఏడాదికి రూ.2,500 చొప్పున)
15 ఏళ్ల వరకూ రూ.3 వేల చొప్పున రూ.6,000
17ఏళ్ల వ రకూ రూ.3,500 చొప్పున రూ.7,000
21 ఏళ్ల వరకూ రూ.4వేల చొప్పున రూ.16000 జమ చేస్తూ 21 ఏళ్ల తరువాత అప్పటికి ఇంటర్ పాసయితే రూ.50 వేలు, గ్రాడ్యుయేషన్ పాసయితే రూ.లక్ష. మొత్తంగా రూ.1,55,500 ప్రోత్సాహకాలు అందిస్తామ ని ప్రకటించారు. కానీ దీనికోసం ఇప్పటివరకూ నిధులు మాత్రం మంజూరు కాలేదు. జిల్లాలో పీడీ ప్రత్యేక చొరవ తీసుకుని ఓ కాల్‌సెంటర్‌ను కూడా (800834 2244)ఏర్పాటు చేశారు. దీంతో మరిన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి, కానీ నిధుల వద్దకు వచ్చేసరికి ఈ పథకం నిద్రపోతోంది.