కాల్‌సెంటర్‌పై దాడిలో ఇద్దరు మృతి | call center attack in two killed | Sakshi
Sakshi News home page

కాల్‌సెంటర్‌పై దాడిలో ఇద్దరు మృతి

Published Sat, Oct 5 2013 11:53 PM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM

call center  attack in two  killed

గుర్గావ్: హర్యానా రాష్ట్రం గుర్గావ్‌లో శనివారం కాల్‌సెంటర్‌పై జరిగిన ఒక దాడిలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా.. స్థానిక ఉద్యోగ్ విహార్ కాల్ సెంటర్‌లో పనిచేస్తున్న సునీల్‌కుమార్ (25), తన కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా సహోద్యోగులను పార్టీకి పిలిచేందుకు కాల్‌సెంటర్‌కు వచ్చాడు. అదే సమయంలో  సునీల్‌తో పాతకక్షలున్న ముఖేష్ అనే వ్యక్తి తన అనుచరులతో వచ్చి పదునైన ఆయుధాలతో దాడిచేశాడు. ఈ ఘటనలో రామ్ అవతార్(32) అనే మెడికల్ రిప్రజెంటెటివ్, సునీల్ సోదరుడు దేవేందర్(30) అక్కడికక్కడే మరణించగా, సునీల్, సంజయ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దాడి అనంతరం నిందితులు పారిపోయారు. కాగా, నిందితుల విషయమై ఆరా తీస్తున్నామని, సీసీటీవీ పుటేజీలను సేకరించామని పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement