కాల్ సెంటర్ ఉద్యోగి దుర్మరణం
Published Sat, Aug 31 2013 10:55 PM | Last Updated on Tue, Aug 14 2018 3:18 PM
ఘజియాబాద్: వేగంగా వెళుతున్న ట్యాంకర్ ఢీకొనడంతో కాల్‌సెంటర్ ఉద్యోగి చనిపోయాడు. ఈ ఘటన విజయ్‌నగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగింది. మృతుడిని దమన్‌కుమార్ (24)గా గుర్తిం చారు. జిల్లాలోని భరత్‌నగర్‌లో నివసించే దమన్‌కుమార్ నోయిడా సెక్టార్ 62లోని కాల్‌సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని మోటార్‌సైకిల్‌పై ఇంటికి తిరిగివెళుతుండగా ఎదురుగా వేగంగా వస్తున్న ట్యాంకర్ ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన దమన్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. మోటార్‌సైకిల్‌ను ఢీకొన్న ఘటన వెంటనే ట్యాంకర్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ట్యాంకర్ నంబర్‌ను గుర్తించామని, నింది తుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కేసు విచారణలో ఉంది.
Advertisement
Advertisement