ఎస్సారెస్పీ ఉద్యోగి దుర్మరణం
Published Sun, Sep 18 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
హస¯ŒSపర్తి : హన్మకొండ – కరీంనగర్ ప్రధాన రహదారిలోని హస¯ŒSపర్తి పాత సినిమా టాకీస్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్సారెస్పీ ఉద్యోగి మృతి చెందాడు. ఎస్సారెస్పీ స్పెషల్ డిప్యూటీ కార్యాలయం–1లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న తుమ్మ సురేష్(44) వరంగల్‌లో నివాసం ఉంటున్నాడు. అతను శనివారం సాయంత్రం హస¯ŒSపర్తిలో స్నేహితుడిని పరామర్శించడానికి వచ్చాడు. తిరిగు ప్రమాణంలో హన్మకొండ వైపు వెళ్తున్న క్రమంలో హస¯ŒSపర్తి పాత సినిమా టాకీస్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్నాడు. తీవ్ర గాయాలతో ఉన్న అతడిని స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సంఘటన జరిగిన ప్రదేశం పూర్తిగా చీకటిని కమ్ముని ఉండడం వల్లే లారీ కనిపించక ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన వివరాలను మృతుడి తండ్రి తెలిపారు.
Advertisement
Advertisement