
సాక్షి, విజయవాడ: దేశంలో కరోనా రెండోదశ తీవ్ర ఉపద్రవంలా మారిందని మంత్రి వెల్లంపల్లి ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందు చూపుతోనే ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని వెల్లంపల్లి అన్నారు. తొలిదశ తరహాలోనే సెకండ్‌వేవ్‌లో కరోనా కట్టడికి అన్నివిధాల చర్యలు చేపట్టామని వెల్లంపల్లి పేర్కొన్నారు. కరోనా బాధితులకు తక్షణ సేవలందించడం కోసం కమాండ్ కంట్రోల్ సదుపాయాన్ని బలోపేతం చేశామని స్పష్టం చేశారు.
విజయవాడలో ఇప్పటికే 42 ఆస్పత్రుల్లో 3500 బెడ్‌లు సిద్ధం చేశామని.. అదేవిధంగా, కరోనా బాధితుల కోసం కోవిడ్ కేర్ సెంటర్‌లో 2500 ప్రత్యేక బెడ్‌లను ఏర్పాటు చేశామని మంత్రి వెల్లంపల్లి వెల్లడించారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎల్లవేళలా కృషిచేస్తుందని, మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ప్రజలకు అన్నిరకాల సేవలందిస్తోందని తెలిపారు.