ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం కాల్ సెంటర్, హెల్ప్‌లైన్‌గా మారిందని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముకేశ్ శర్మ విమర్శించారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం కాల్ సెంటర్, హెల్ప్‌లైన్‌గా మారిందని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముకేశ్ శర్మ విమర్శించారు. శనివారం నగరంలో నిర్వహించిన జనతా దర్బార్‌లో ప్రజల రద్దీ ఎక్కువగా ఉంద న్న సాకుతో మధ్యలోనే బయటకు వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు చేశారు. కేజ్రీవాల్ సామాన్యుడికి ఏమీ చేయలేరని అన్నారు. విద్యుత్ కోతలు, అవినీతి, నర్సరీ అడ్మిషన్‌ల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌లు ప్రారంభించడంపై ఆయన మండిపడ్డారు. ఈ ప్రభుత్వం కాల్ సెంట ర్, హెల్ప్‌లైన్‌గా మారిందన్నారు. ప్రజలకు సేవ చేస్తామని అధికారంలోకి వచ్చిన ఆప్ ఇప్పుడు వారి సమస్యలను గాలికొదిలేస్తుందని ఆరోపించారు. కేజ్రీవాల్ వల్ల తమ సమస్యలు తీరుతాయని భావించిన సామాన్యుడికి చుక్కెదురైందని విమర్శించారు.