‘ఆప్’ నిర్ణయం హాస్యాస్పదం
Published Wed, Jan 1 2014 12:32 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీవాసులకు ఉచితంగా నీటిని సరఫరా చేస్తానంటూనే ఆప్ సర్కార్ షరతులు విధిం చడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖేశ్‌శర్మ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌సర్కార్ పేదలు, మధ్య తరగతి కుటుంబాలపై పెద్దజోక్ వేసిందంటూ ఉచితనీటి సర ఫరా నిర్ణయా న్ని ఎద్దేవా చేశారు. మంగళవారం డీడీయూ మార్గ్‌లోని రాజీవ్‌భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీవాసులందరికి ఉచితంగా ప్రతి ఇంటికి రోజుకు 700 లీటర్ల నీరు అందిస్తామంటూ ఆమ్‌ఆద్మీపార్టీ వాగ్ధానం చేసిందన్నారు.
అధికారంలోకి వచ్చాక మాట మార్చి షరతులతో అమలు చేస్తాననడం సబబు కాదన్నారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఢిల్లీలోని కేవలం 15 నుంచి 20 శాతం మంది మాత్రమే లబ్ధిపొందుతారని పేర్కొన్నారు. అనధికారిక కాలనీలు, పునరావాస కాలనీలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి పరిస్థితి ఏంటని, వారి సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చూపుతారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ నిర్ణయం మధ్యతరగతి వారిని దోచుకుని ఆ లాభాన్ని పేదలకు చేసేలా ఉందన్నారు. ఆప్ నిర్ణయాన్ని కాంగ్రెస్ అంగీకరించబోదన్నారు. ఢిల్లీ జల్ బోర్డు చెబుతున్న ప్రకారం 19.5 లక్షల మంది గృహ నీటి వినియోగదారులుండగా 6.5 లక్షల ఇళ్లకు మాత్రమే మీటర్లు కలిగి ఉన్నారన్నారు. ప్రభుత్వం నిర్ణయం కేవలం వీరికి మాత్రమే వర్తిస్తుందన్నారు.
కేజ్రీవాల్ అయోమయంలో ఉన్నాడు: షీలా
తాజాగా అధికార పగ్గాలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ అయోమయంలో ఉన్నాడని మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ విమర్శించారు. ప్రజలకు చేసిన వాగ్ధానాలు, హామీలు నేరవేర్చడానికి ఆయన తీసుకునే చర్యలేమిటో ఇప్పుడే చెప్పడం కష్టమని, అయితే ఆయన చర్యల్లో గందరగోళం మాత్రం కనిపిస్తోందని స్పష్టం చేశారు.అయితే కేజ్రీవాల్ తాను చేసిన హమీలను ఎలా నెరవేరుస్తాడో కాలమే తెలియజేయాల్సి ఉందని షీలా దీక్షిత్ అన్నారు. ‘వారు ప్రతి ఇంటికి రోజుకు 20 వేల లీటర్ల నీరు సరఫరా చేస్తామన్నారు. అది కూడా ఉచితంగా, అయితే ఢిల్లీ జల్‌బోర్డు ఈ ఖర్చును భరించగలదా? ఇది వేచి చూడాల్సిన విషయం. ఇక విద్యుత్ చార్జీల తగ్గింపు విషయం గురించి ప్రశ్నించగా బహుశా అందుకే ఆయన కాగ్ ఆడిట్‌ను కోరినట్లుంది. కాగ్ అంగీకరిస్తే మంచిదేనని స్పష్టం చేసింది.
Advertisement
Advertisement