Actress Ekta Sharma Joins Call Centre Amid Lack Of Work In TV, Details Inside - Sakshi

Ekta Sharma: 'పరిస్థతి తలకిందులయ్యింది.. ఉన్న నగలు అమ్మేశాను'

Sep 21 2022 3:44 PM | Updated on Sep 21 2022 4:42 PM

Actress Ekta Sharma Joins Call Centre Amid Lack Of Work In TV - Sakshi

కరోనా కారణంగా ఆర్థికంగా ఎంతోమంది నష్టపోయారు. సినీ సెలబ్రిటీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. లాక్‌డౌన్‌ కారణంగా పనిలేక చేతిలో డబ్బులు లేక అవస్థలు పడినవారు, ఇప్పటికీ సరైన పని దొరక్క ఇబ్బందులు పడుతున్నవారున్నారు. తాజాగా బుల్లితెర నటి ఏక్తా శర్మ కాల్‌ సెంటర్‌లో పని చేస్తుంది. సినీ పరిశ్రమలో సరైన అవకాశాలు రాకపోవడంతో తనకున్న చదువు రీత్యా ఈ పని చేస్తున్నట్లు తెలిపింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'కరోనా కారణంగా జీవితం తలకిందులయ్యింది. అద్దె ఇంట్లో నివసిస్తున్నాను. ఇల్లు గడవడం కష్టంగా మారడంతో ఉన్న నగలు అమ్మేశా. అవకాశాలు రావడం లేదని ఏడుస్తూ ఇంట్లోనే కూర్చోలేను కదా అందుకే కాల్‌ సెంటర్‌లో పనిచేస్తున్నా. ఈ  పని చేస్తున్నందుకు నాకేమీ తప్పనిపించడం లేదు. ప్రస్తుతం కోర్టులో నా కూతురి కస్టడీ కేసు నడుస్తుంది.

ఎవరో వస్తారు.. ఏదో అద్భుతం జరుగుతుంది అని ఎదురు చూడలేను. అందుకే కాల్‌ సెంటర్‌లో పనిచేస్తూనే, ఆడిషన్స్‌ కూడా ఇస్తున్నా. త్వరలోనే నాకు మళ్లీ ఛాన్సులు వస్తాయని ఆశిస్తున్నా' అని పేర్కొంది. కాగా ఏక్తా డాడీ సంఝా కరో, కుసుమ్‌, క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ, కామినీ-దామిని వంటి సీరియల్స్‌తో గుర్తింపు పొందిన ఏక్తా  చివరగా  'బెప్నా ప్యార్' అనే టీవీ షోలో కనిపించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement