ప్రేమ పురాణం బయటపడుతుందని... | After Outing, BPO Employee Crushes Blackmailer Under Car in bangalore | Sakshi
Sakshi News home page

ప్రేమ పురాణం బయటపడుతుందని...

Published Mon, Aug 11 2014 8:15 AM | Last Updated on Tue, Sep 18 2018 7:36 PM

ప్రేమ పురాణం బయటపడుతుందని... - Sakshi

ప్రేమ పురాణం బయటపడుతుందని...

  •     వివాహిత ఘాతుకం
  •     బీరులో విషం కలిపి....
  •   కారుతో ఢీకొట్టి ప్రియుడిని చంపేసిన వైనం
  •    గతనెల 31న రామనగర వద్ద హత్య
  •   నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • బెంగళూరు : ప్రేమ ముసుగులో ప్రియుడి ని మోసగిస్తూ చివరి వరకు తనకు పెళ్లి కాలేదని మభ్య పెడుతూ అతనితో తిరుగుతూ జల్సాలు చేస్తూ చివరికి అతడినే సినిమా ఫక్కిలో దారుణంగా హత్య చేసిన వివాహితను పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడి సదాశివనగరలో నివాసం ఉంటున్న నఫీజా (40)ను అరెస్టు చేశామని ఆదివారం పోలీసులు చెప్పారు.

    గతనెల 31న విజయనగరకు చెందిన హేమంత్ కుమార్ (47) దారుణ హత్యకు గురైన విషయం తెల్సిందే. వివరాలు...  నఫీజా, ఉదయ్ కుమార్‌లకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. నఫీజా కాల్ సెంటర్ ఉద్యోగి. అక్కడే హేమంత్ కుమార్ అనే వ్యక్తి నఫీజాకు పరిచయమయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. విలాసాల కోసం నఫీజా హేమంత్‌తో భారీగా ఖర్చు చేయించేది.

    ఇదే సమయంలో తాను వివాహితనని ఎక్కడ కూడా బయటపెట్టలేదు. హేమంత్ కుమార్ పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చాడు. అదిగో ఇదిగో అంటూ నఫీజా కాలం వెళ్లదీస్తూ వచ్చింది. దీంతో విసిగిపోయిన హేమంత్ నిలదీయడంతో తనకు అంతకు ముందే పెళ్లి అయిందని చెప్పడంతో అతను నిర్ఘంతపోయాడు. అప్పటి నుంచి నఫీజాపై పగ పెంచుకున్నాడు.
     
    కొన్ని సందర్భాల్లో నఫీజాను హెచ్చరించాడు. దీంతో భయపడిపోయిన నఫీజా హేమంత్‌ను హతమార్చాలని పథకం వేసింది. తన వివాహేతర సంబంధాన్ని ఇంటిలో భర్తకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇదిలా ఉంటే ఒకరోజు హేమంత్‌ను కలిసి ఎక్కడైన విహార యాత్రకు వెళ్దామని కోరింది. ప్రియురాలు కోరడంతో జులై 31న ఇద్దరు కారులో మైసూరు బయలుదేరారు. మధ్యాహ్నం రామనగర ప్రాంతంలో రెస్టారెంట్ వద్ద హేమంత్ కారు నిలిపి బీరు తెచ్చుకున్నాడు. ఇదే సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లిన సమయంలో అంతకు ముందే తెచ్చుకున్న విషం బీరులో కలిపింది.
     
    రాత్రి 11 గంటల సమయయంలో నాగరహోలె చేరుకున్న తరువాత హేమంత్ బీరు తాగాడు. కొద్దిసేపు అనంతరం కారు దిగి మూత్ర విసర్జకు వెళ్లిన సమయంలో నఫీజా కారు స్టార్ట్ చేసి హేమంత్‌ను ఢీకొట్టింది. కిందపడిన అతనిపై పలుమార్లు ముందుకు వెనక్కు వచ్చిన ఆనవాళ్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి బెంగళూరు చేరుకుంది. స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుడి వివరాలు సేకరించారు. సంఘటన స్థలంలో నఫీజా మొబైల్‌తో పాటు కొన్ని విజిటింగ్ కార్డులు కనిపించాయి. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నఫీజాను అరెస్ట్ చేశారు.  
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement