Hemanth kumar
-
AP: ‘ఆగస్టులో మెగా డీఎస్సీ హర్షణీయం’
సాక్షి, అమరావతి: ఆగస్ట్‌లో మెగా డీఎస్సీ విడుదలతో పాటు త్వరలో అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చినట్లు ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ చెప్పారు. శుక్రవారం విజయవాడలో మంత్రి బొత్సను కలిసి నిరుద్యోగుల సమస్యలపై వినతిపత్రమిచ్చారు. ఈ సందర్బంగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇటీవల జరిగిన ప్రాథమిక పరీక్షలో తప్పుదొర్లిన ప్రతి ప్రశ్నకి ఒక మార్కు కేటాయించాలని కోరారు. జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, డిజిటల్ గ్రంథాలయ శాఖ, పోలీసు విభాగాల్లో పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. జనరల్ కేటగిరీల్లో వయోపరిమితిని ఏపీపీఎస్సీ, డీఎస్సీ అభ్యర్థులకు 47 ఏళ్లకు, కానిస్టేబుల్‌కు 27 ఏళ్లకు, ఎస్ఐ అభ్యర్థులకు 30 ఏళ్లకు, ఫైర్, జైలు వార్డెన్స్ అభ్యర్థులకు 32 ఏళ్లకు పెంచాలని కోరారు. హోంగార్డులకు జనరల్ అభ్యర్థులతో కాకుండా ప్రత్యేకంగా రాత పరీక్ష పెట్టాలన్నారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ఇది కూడా చదవండి: వైద్యవిద్య పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభం -
విశాఖ కిడ్నాప్ కేసు: లవర్‌కు 40 లక్షలు పంపిన హేమంత్
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 48 గంటలపాటు ఎంపీ కుటుంబ సభ్యులకు కిడ్నాపర్లు నరకం చూపించారు. రూ.20 కోట్లు ఇవ్వాలంటూ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ)ను చిత్ర హింసలు పెట్టారు. ఈ వ్యవహారంపై పోలీసులు చేపట్టిన దర్యాప్తులో అనేక కీలక అంశాలు వెలుగు చూశాయి. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. భీమిలి ప్రాంతానికి చెందిన కోలా వెంకట హేమంత్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మధుసూదనరావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసిన కేసులో జైలుకు వెళ్లాడు. చోరీలు చేసే రాజేష్, ఇతర గ్యాంగ్‌తో అక్కడ అతనికి పరిచయం ఏర్పడింది. చిన్న చిన్న చోరీలు చేసే కంటే ఒకేసారి బిగ్‌షాట్‌ను కిడ్నాప్ చేస్తే సెటిల్ అయిపోవచ్చని హేమంత్ వారికి ఆశపెట్టాడు. టార్గెట్ ఎంపీ కుటుంబం బయటకు వెళ్లాక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయాలని నిర్ణయించారు. హేమంత్‌కుమార్, రాజేష్, సాయి, చిన్న సాయి, గోవర్ధన్, మరో వ్యక్తి కలిసి ఎంపీ కొత్త ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ఇంట్లోకి చొరబడి ఎంపీ కుమారుడు శరత్‌పై దాడి చేశారు. కాళ్లు, చేతులు కట్టేశారు. శరత్‌తో ఫోన్ చేయించి సెక్యూరిటీ గార్డును పంపించేశారు. శరత్ ఒంటిపై ఉన్న బంగారం దోచుకున్నారు. మరుసటి రోజు ఉదయం శరత్‌తో ఫోన్ చేయించి ఒంట్లో బాగోలేదని చెప్పించి, తల్లి జ్యోతిని ఆ ఇంటికి రప్పించారు. ఆమె వద్ద ఉన్న బంగారాన్ని తీసుకుని, ఆమెనూ బంధించారు. అనంతరం ఎంపీ ఎంవీవీ స్నేహితుడు జీవీ వద్ద డబ్బులు ఉంటాయని భావించి అతనికి బలవంతంగా ఫోన్ చేయించి రప్పించారు. హేమంత్ రాజేష్‌లు అతడిపై దాడి చేసి.. చేతులు, కాళ్లు కట్టేశారు. కారు డ్రైవర్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఫోన్ చేయించారు. రూ.20 కోట్లు ఇస్తావా? లేదా ఇల్లు, స్థలం రాసిస్తావా? అసలు ఎందుకు తమను నిర్బంధించారని, ఏం కావాలో చెబితే ఇస్తామని జీవీ కిడ్నాపర్లకు చెప్పగా.. రూ.100 కోట్లు కావాలి ఇస్తావా? అని హేమంత్ ప్రశ్నించాడు. అంత డబ్బు ఉండదని, తమను వదిలేస్తే రూ.5 కోట్ల వరకు సమకూరుస్తామని చెప్పారు. దానికి హేమంత్ అంగీకరించలేదు. ఎవరికి ఫోన్ చేస్తే డబ్బులు వస్తాయో వారి పేర్లను హేమంత్కుమారే సూచించి, ఫోన్లు చేయించారు. ఇలా జీవీ రూ.కోటి వరకు సమకూర్చి డ్రైవర్ ద్వారా ఆ డబ్బు తెప్పించారు. వచ్చిన డబ్బులో హేమంత్‌కుమార్, రాజేష్‌లకు 40 శాతం చొప్పున, సాయికి 10 శాతం, ఇతర ఖర్చుల కోసం 10 శాతం పంపకాలు చేసుకున్నారు. శరత్ బ్యాంక్ అకౌంట్లో రూ.65 లక్షలు జీవీ అకౌంటెంట్ ద్వారా విత్‌డ్రా చేయించి తెప్పించుకున్నారు. వచ్చిన డబ్బులో రూ.21 లక్షలు బెయిల్ కోసం రాజేష్ అనే లాయర్‌కు పంపించారు. లవర్‌కు రూ.40 లక్షలు నజరానా హేమంత్‌కుమార్ తన వాటాలో వచ్చిన డబ్బులో రూ.40 లక్షలు తన లవర్ సుబ్బలక్ష్మికి ఇవ్వాలని భావించాడు. అయితే గతంలో చేసిన కిడ్నాప్ వ్యవహారంలో ఇతనితో పాటు సుబ్బలక్ష్మి కూడా జైలుకు వెళ్లింది. ఫలితంగా వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. రూ.40 లక్షలు ఇచ్చి మళ్లీ ఆమెకు దగ్గరవ్వాలని భావించాడు. నేరుగా డబ్బులు ఇస్తానంటే అంగీకరించదని జీవీతో ఫోన్ చేయించి.. రెండు గంటల సేపు మాట్లాడి ఒప్పించేలా చేశాడు. జీవీ కారు డ్రైవర్‌ను రప్పించి రూ.40 లక్షలు ఆమెకు అందేలా చేశారు. రెండు రోజుల పాటు కిడ్నాపర్లు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టారు. వారికి పెరుగన్నం పెట్టి, కిడ్నాపర్లు మాత్రం బిర్యానీ తినేవారు. రూ.20 కోట్లు ఇవ్వాలంటూ రాజేష్.. వారి చేతులపై కత్తితో కొడుతూ.. దుర్భాషలాడుతూ వారి చేతికి ఉన్న ఉంగరాలను లాక్కున్నాడు. డబ్బు లేదంటే ఎంపీ ఇల్లు, జీవీకి ఉన్న స్థలాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని హేమంత్ డిమాండ్ చేశాడు. శరత్‌ను డిక్కిలో కుక్కి.. ఫోన్ చేసినప్పుడు జీవీ పొంతన లేని సమాధానాలతో ఎంపీకి అనుమానం వచ్చింది. వెంటనే పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే పోలీసులు జీవీ నెంబర్‌కు వరుసగా ఫోన్ చేస్తుండటంతో.. అనుమానం వస్తుందని భావించిన కిడ్నాపర్లు ఫోన్లో మాట్లాడించారు. పోలీసులకు అనుమానం వచ్చినట్లు గ్రహించిన హేమంత్‌కుమార్ గ్యాంగ్ వెంటనే అక్కడి నుంచి శరత్ కారులోనే తప్పించుకోవాలని చూసింది. చేతులు, కాళ్లు కట్టేసి శరత్‌ను డిక్కీలో కుక్కారు. హేమంత్ కార్ డ్రైవ్ చేయగా ముందు సీట్లో రాజేష్ ఎక్కాడు. జ్యోతి, జీవీతో పాటు సాయి కూర్చున్నాడు. మధ్యలో వీరు తమ వద్ద ఉంటే ప్రమాదమని భావించిన హేమంత్‌కుమార్.. వారిని ఆనందపురం మండలంలో దించేశాడు. దీంతో జ్యోతి, జీవీలు జాతీయ రహదారి వరకు నడుచుకుంటూ వచ్చి ఆటో ఎక్కారు. అనంతరం కారు ఆపి మధ్యలోనే సాయి దిగిపారిపోయాడు. అంతలో పోలీసులు వారి కారును వెంబడించి హేమంత్, రాజేష్‌లను పట్టుకుని.. శరత్‌ను విడిపించిన విషయం తెలిసిందే. ముగ్గురి అరెస్ట్.. రూ.86.6 లక్షలు రికవరీ దొండపర్తి (విశాఖ దక్షిణ): ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటనలో ముగ్గురు కిడ్నాపర్లను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వాస్తవానికి గురువారమే కోలా వెంకట హేమంత్‌కుమార్, రాజేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా కిడ్నాప్‌లో పాల్గొన్న వారి వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం శుక్రవారం గాజువాకకు చెందిన సాయిని షీలానగర్ ప్రాంతంలో పట్టుకున్నారు. వీరి ముగ్గురి నుంచి రూ.86.6 లక్షలు రికవరీ చేశారు. ఈ ముగ్గురిని సాయంత్రం కేజీహెచ్‌కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా, మరో ముగ్గురు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. -
తప్పు మీద తప్పు.. ప్రియురాలి చెంత చేరి.. పోలీసులకు చిక్కి..
సాక్షి, విశాఖటపట్నం, పీఎం పాలెం(భీమిలి): టీడీపీ నేత, రియల్టర్ పాసి రామకృష్ణను ఇటీవల కిడ్నాప్ చేసిన ముఠాను పీఎం పాలెం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు కోలా వెంకట హేమంత్‌తో పాటు ఓ మహిళ, మరో నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు ఈ కేసు వివరాలను నగర డీసీపీ సునీల్ సుమిత్ గరుడ పీఎంపాలెం పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. భీమిలి మండలం గొల్లల తాళ్లవలసకు చెందిన కోలా వెంకట హేమంత్ రౌడీషీటర్‌గా పోలీస్ స్టేషన్లో రికార్డులకెక్కాడు. మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి హత్యలో ప్రధాన నిందితుడు కూడా. దొంగతనం, కొట్లాట వంటి ఐదారు నేరాలపై ఈయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. జైలులో శిక్ష అనుభవించి ప్రస్తుతం బెయిల్‌పై బయట తిరుగుతున్నాడు. ఈయనకు విశాలాక్షినగర్‌లో ఉంటున్న సుబ్బలక్ష్మి(48) అనే ప్రియురాలు ఉంది. హేమంత్‌కు ఆమె అన్ని విధాలా సహకరిస్తుంటుంది. కిడ్నాప్‌కు ఉపయోగించిన కారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు బయటకు చెప్పుకుంటారు. సుమారు రూ.35 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. ఆ అప్పుల నుంచి బయట పడాలంటే పెద్ద మొత్తంలో డబ్బు రాబట్టడానికి కిడ్నాప్ ఒకటే మార్గమని హేమంత్ పథకం రచించాడు. ఇందు కోసం భీమిలి మండలం జేవీ అగ్రహారానికి చెందిన రియల్టర్, టీడీపీ నేత పాసి రామకృష్ణను పావుగా ఎంచుకున్నాడు. తాను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటానని ఆయనను పరిచయం చేసుకుని సుమారు 20 రోజుల పాటు చాలా నమ్మకంగా వ్యవహరించాడు. చదవండి: (Chandrababu: ఒప్పందాలంటూ అమెరికన్లతో ఫొటోలు.. 20 సంస్థల్లో ఒక్కటొస్తే ఒట్టు) ఈ క్రమంలో ఓ స్థలం డెవలప్మెంట్కు సంబంధించి డీల్ కుదుర్చుకోవడానికి ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం రుషికొండ ఏరియాలోని ఎంబీకే గెస్ట్‌హౌస్‌కు రప్పించాడు. అప్పటికే పీఎం పాలెం ఆర్‌హెచ్ కాలనీకి చెందిన రౌడీషీటర్ మున్నా(27)తో పాటు మరో ఇద్దరు రౌడీషీటర్లు పెంటకోట కిరణ్(19), అంబటి మధుసూదన్‌రావు(31), కొలగాని రాజ్‌కుమార్‌లను తనకు సహాయంగా గెస్ట్‌హౌస్‌లో అందుబాటులో ఉంచాడు. హేమంత్ మాటలు నమ్మి వచ్చిన పాసి రామకృష్ణను తాళ్లతో బంధించి నోటికి ప్లాస్టర్ అంటించారు. వారంతా కలిసి ఆయనను అప్పటికే అద్దెకు తీసుకున్న కారులోకి బలవంతంగా ఎక్కించారు. కోటి రూపాయలు ఇస్తేనే విడిచి పెడతామని కత్తులతో బెదిరించి విజయనగరం వైపు తీసుకుపోయారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, కత్తులు సీసీ కెమెరాతో అడ్డం తిరిగిన కథ ఈ కిడ్నాప్ తతంగం అంతా సీసీ కెమోరాలలో కనిపించడంతో గెస్ట్‌హౌస్ సిబ్బంది పీఎం పాలెం పోలీసులకు సమాచారం అందించారు. సీసీ ఫుటేజీలో కారు నంబర్‌ను గుర్తించారు. కారు యజమానికి ఫోన్ చేసి, డ్రైవర్ ఫోన్ నంబరు సంపాదించారు. ఆ నంబర్‌కు ఫోన్ చేయడంతో.. కిడ్నాప్ విషయం పోలీసులకు తెలిసిపోయిందని గ్రహించి కారులో ఉన్నవారందరూ తలో దిక్కుకూ పారిపోయారు. అదే సమయంలో కట్లు విడిపించుకుని బాధితుడు రామకృష్ణ కారులోంచి దూకి తప్పించుకున్నాడు. ఏదోలా భీమిలి చేరుకుని పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. చదవండి: (ఆపసోపాలు.. పడరాని పాట్లు.. నవ్వులపాలైన టీడీపీ) తప్పు మీద తప్పు చేసిన కిడ్నాపర్ కిడ్నాప్ పథకం బెడిసికొట్టడంతో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కిడ్నాపర్ వెంకటహేమంత్ తప్పుల మీద తప్పులు చేశాడు. పోలీసులు వెంటాడుతూనే ఉన్నారు. గంట్యాడ పోలీసులను అప్రమత్తం చేయగా కారుకు అడ్డంగా స్టాపర్లు పెట్టగా వాటిని గుద్దుకుంటా ఉడాయించాడు. ఎస్.కోట పోలీసులు అడ్డుకోగా వారి నుంచి కూడా దౌర్జన్యంగా తప్పించుకున్నాడు. ఈ రెండు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ప్రియురాలి చెంత చేరి.. పోలీసులకు చిక్కి.. పోలీసుల నుంచి తప్పించుకున్న వెంకట హేమంత్ తన నిత్య స్థావరమైన విశాలాక్షినగర్‌లో నివసిస్తున్న సిరంగి సుబ్బలక్ష్మి ఇంట్లో తల దాచుకున్నాడు. గతంలో పలుమార్లు నేరాలకు పాల్పడినప్పుడు ఇలాగే చేసేవాడు. పోలీసులు ఈ కేసు ఛేదనలో నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించి, ఆమెతో పాటు హేమంత్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మిగతా నలుగురు నిందితులను మధురవాడ ఐటీ సెజ్ సమీపంలో అరెస్ట్ చేశారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన సీఐ రవికుమార్, సిబ్బందిని డీసీపీ ఈ సందర్భంగా అభినందించారు. -
గుడిలో పెళ్లి చేసుకున్న నిర్మాత, ఫొటోలు వైరల్
టాలీవుడ్ నిర్మాత హేమంత్ కుమార్ ఓ ఇంటివాడయ్యాడు. సుజని సంజీవితో ఏడడుగులు నడిచాడు. హంగూ ఆర్భాటలకు పోకుండా నిరాడంబరంగా ఓ గుడిలో మార్చి 30న వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని హేమంత్ నెట్టింట అభిమానులతో పంచుకున్నాడు. 'కోయంబత్తూరులోని ఓ దేవాలయంలో సుజని, నేను పెళ్లి చేసుకున్నాం. ఇరు కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్దిమంది సమక్షంలోనే మా వివాహం జరిగింది. నీ జీవిత భాగస్వామిగా నన్ను ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు సుజని' అని రాసుకొచ్చాడు. అటు హేమంత్ భార్య సుజనీ సైతం 'నువ్వు నావాడివైనందుకు సంతోషంగా ఉంది, నువ్వు నా ప్రపంచానివి, లవ్ యూ' అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా పలువురు సెలబ్రిటీలు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా హేమంత్ కుమార్ ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థకు సహ వ్యవస్థాపకుడు. It’s Mr. and Mrs. from now. Thank you @crhemanth for choosing to be mine, to hold and cherish forever. You mean the world to me. Love you so much❤️ pic.twitter.com/wCZ9VERzq4 — Sujani Sanjeevi (@sujani_sanjeevi) April 1, 2022 Thank you so much for all your wishes and messages. @sujani_sanjeevi and I are really touched by your kind words and love ❤️😇🤗 https://t.co/uGiJfI5uQy — Hemanth Kumar C R (@crhemanth) March 31, 2022 చదవండి: బుల్లితెరపై సందడి చేయనున్న 'శ్యామ్ సింగరాయ్'.. -
హేమంత్ హత్యకేసు.. పోలీసుల పిటిషన్
సాక్షి, హైదరాబాద్: హేమంత్ కుమార్ హత్య కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరముందంటూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు. హేమంత్ కుమార్ హత్య కేసులో నిందితులకు శిక్ష పడేందుకు కావాల్సిన పూర్తి సమాచారంతో పాటు శాస్త్రీయ ఆధారాలు సేకరించేందుకు విచారించాల్సిన అవసరముందని కస్టడీ పిటిషన్లో కోరారు. ఇదిలాఉండగా కుటుంబసభ్యులైన అశిష్‌రెడ్డి, సందీప్ రెడ్డి వల్ల కూడా తమ కుటుంబానికి ప్రాణహని ఉందని హేమంత్ కుమార్ భార్య అవంతిరెడ్డి ఆరోపించారు. మామయ్య మురళీ కృష్ణకు సందీప్‌రెడ్డి ఫోన్‌కాల్ చేసి ఇంతకుముందు బెదిరించాడని తెలిపారు. వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. (చదవండి: హేమంత్ హత్య కేసులో మరో ట్విస్ట్!) శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులకు ముగిసిన పోలీసు కస్టడీ అమీర్‌పేట: టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులైన దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డిల పోలీసు కస్టడీ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించేందుకు చంచల్‌గూడ జైలులో ఉన్న దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డిలను ఎస్ఆర్నగర్ పోలీసులు మూడు రోజులు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ ముగియడంతో వారిని ఆదివారం తిరిగి జైలుకు తరలించారు. శ్రావణి ఆత్మహత్యకు ఒక రోజు ముందు ఏమి జరిగిందన్న దానిపై సుదీర్ఘంగా విచారించారు. పంజగుట్టలోని శ్రీకన్య హోటల్లో జరిగిన దాడిపై మరిన్ని వీడియో, ఆడియో సంభాషణలను సేకరించినట్లు తెలిసింది. మూడో నిందితుడిగా ఉన్న సినీ నిర్మాత అశోక్‌రెడ్డి సాయితో కలిసి ఆత్మహత్య జరిగిన రోజు రాత్రి శ్రావణి ఇంటికి వచ్చారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అశోక్‌రెడ్డిని కూడా కస్టడీకి తీసుకుని విచారించనున్నట్లు సమాచారం. (దేవరాజ్‌తో వివాహం చేయండి : శ్రావణి) -
హేమంత్ హత్య కేసులో మరో ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్ : హేమంత్ కుమార్ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భర్త హత్యలో సందీప్ రెడ్డి గూడూరు, ఆశిష్ రెడ్డి ప్రమేయం కూడా ఉందని అవంతి ఆరోపిస్తున్నారు. గతంలో సందీప్‌రెడ్డి హేమంత్ తండ్రిపై బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె తెలిపారు. హేమంత్ రెండు లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నాడంటూ నెల రోజుల క్రితం సందీప్ బెదిరింపులకు దిగాడని చెప్పారు. సందీప్‌రెడ్డి నుంచి తనకు ప్రాణ హాని ఉందని అవంతి అంటున్నారు. అయితే హేమంత్ కుమార్ కిడ్నాప్ అయిన రోజునే గచ్చిబౌలి పోలీసులు సందీప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి : హేమంత్ హత్య : అసలు తప్పెవరిది? -
గంజిపడి చిన్నారికి గాయాలు
కదిరి టౌన్ : ముక్కుపచ్చలారని ఓ చిన్నారి పొయ్యిపై ఉడికే అన్నం పాత్రను లాగటంతో, కాలే గంజి మీద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. నల్లమాడ మండలంలోని బొగ్గిటివారిపల్లికి చెందిన విజయకుమార్, సుకన్య దంపతులకు చెందిన ఏడాదిన్నర వయసున్న హేమంత్‌కుమార్ ఉన్నాడు. ఆదివారం ఉదయం ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఇదే సమయంలో చిన్నారి తల్లి వంట గదిలో వంట చేస్తోంది. చిన్నారి ఆడుకుంటూ పొయ్యి వద్దకు వెళ్లి, పొయ్యిపై వున్న అన్నం పాత్రను లాగి మీదకు వేసుకున్నాడు. దీంతో కాలుతున్న గంజి అన్నం పడి, ఛాతీ, మెడపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మంటకు బిగ్గరగా కేకలు పెట్టగా తల్లి సుకన్య పరుగున వచ్చి బిడ్డను అక్కున చేర్చుకొని వెంటనే 108 వాహనంలో వైద్యచికిత్సల నిమిత్తం కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. డాక్టరు పరీక్షించి ప్రథమ చికిత్స అనంతరం ఆరోగ్యపరిస్థితి విషమంగా వుండటంతో మెరుగైన వైద్యసేవల కోసం అనంతపురం పెద్దాసుపత్రికి తరలించారు. -
ప్రేమ పురాణం బయటపడుతుందని...
వివాహిత ఘాతుకం బీరులో విషం కలిపి.... కారుతో ఢీకొట్టి ప్రియుడిని చంపేసిన వైనం గతనెల 31న రామనగర వద్ద హత్య నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు బెంగళూరు : ప్రేమ ముసుగులో ప్రియుడి ని మోసగిస్తూ చివరి వరకు తనకు పెళ్లి కాలేదని మభ్య పెడుతూ అతనితో తిరుగుతూ జల్సాలు చేస్తూ చివరికి అతడినే సినిమా ఫక్కిలో దారుణంగా హత్య చేసిన వివాహితను పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడి సదాశివనగరలో నివాసం ఉంటున్న నఫీజా (40)ను అరెస్టు చేశామని ఆదివారం పోలీసులు చెప్పారు. గతనెల 31న విజయనగరకు చెందిన హేమంత్ కుమార్ (47) దారుణ హత్యకు గురైన విషయం తెల్సిందే. వివరాలు... నఫీజా, ఉదయ్ కుమార్‌లకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. నఫీజా కాల్ సెంటర్ ఉద్యోగి. అక్కడే హేమంత్ కుమార్ అనే వ్యక్తి నఫీజాకు పరిచయమయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. విలాసాల కోసం నఫీజా హేమంత్‌తో భారీగా ఖర్చు చేయించేది. ఇదే సమయంలో తాను వివాహితనని ఎక్కడ కూడా బయటపెట్టలేదు. హేమంత్ కుమార్ పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చాడు. అదిగో ఇదిగో అంటూ నఫీజా కాలం వెళ్లదీస్తూ వచ్చింది. దీంతో విసిగిపోయిన హేమంత్ నిలదీయడంతో తనకు అంతకు ముందే పెళ్లి అయిందని చెప్పడంతో అతను నిర్ఘంతపోయాడు. అప్పటి నుంచి నఫీజాపై పగ పెంచుకున్నాడు. కొన్ని సందర్భాల్లో నఫీజాను హెచ్చరించాడు. దీంతో భయపడిపోయిన నఫీజా హేమంత్‌ను హతమార్చాలని పథకం వేసింది. తన వివాహేతర సంబంధాన్ని ఇంటిలో భర్తకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇదిలా ఉంటే ఒకరోజు హేమంత్‌ను కలిసి ఎక్కడైన విహార యాత్రకు వెళ్దామని కోరింది. ప్రియురాలు కోరడంతో జులై 31న ఇద్దరు కారులో మైసూరు బయలుదేరారు. మధ్యాహ్నం రామనగర ప్రాంతంలో రెస్టారెంట్ వద్ద హేమంత్ కారు నిలిపి బీరు తెచ్చుకున్నాడు. ఇదే సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లిన సమయంలో అంతకు ముందే తెచ్చుకున్న విషం బీరులో కలిపింది. రాత్రి 11 గంటల సమయయంలో నాగరహోలె చేరుకున్న తరువాత హేమంత్ బీరు తాగాడు. కొద్దిసేపు అనంతరం కారు దిగి మూత్ర విసర్జకు వెళ్లిన సమయంలో నఫీజా కారు స్టార్ట్ చేసి హేమంత్‌ను ఢీకొట్టింది. కిందపడిన అతనిపై పలుమార్లు ముందుకు వెనక్కు వచ్చిన ఆనవాళ్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి బెంగళూరు చేరుకుంది. స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుడి వివరాలు సేకరించారు. సంఘటన స్థలంలో నఫీజా మొబైల్‌తో పాటు కొన్ని విజిటింగ్ కార్డులు కనిపించాయి. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నఫీజాను అరెస్ట్ చేశారు. -
పరీక్ష ఫీజు కట్టేందుకు వెళ్తూ ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
గోల్నాక, న్యూస్‌లైన్: పరీక్ష ఫీజు కట్టేందుకు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. గాయాలకు గురైన మరో విద్యార్థి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ కిందే పడి ఇద్దరూ చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. అంబర్‌పేట ఇన్స్పెక్టర్ పి.వెంకటరమణ కథనం ప్రకారం... రామంతాపూర్, చర్చికాలనీలో నివాసముంటున్న హేమంత్‌కుమార్(18), వివేక్భారత్(17), సాయి స్నేహితులు. ముగ్గురూ హబ్సిగూడలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. వివేక్ పరీక్షల్లో తప్పడంతో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు కట్టేందుకు కాలేజీకి వెళ్లడానికి గురువారం మధ్యాహ్నం 2 గంటలకు మిత్రుడు నవీన్ బైక్ ను తీసుకున్నాడు.బైక్‌పై తన వెంట స్నేహితులు హేమంత్‌కుమార్, సాయిలను తీసుకెళ్లాడు. అంబర్‌పేట మెయిన్‌రోడ్డు దగ్గరకు రాగానే ముందు వెళ్తున్న ఆటోను ఓవర్టేక్ చేశారు. ఇదే క్రమంలో ముందు వె ళ్తున్న స్వీదా అంబులెన్స్ సర్వీస్‌కు చెందిన టెంపో (ఏపీ22టి6818)ను కూడా ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించగా.. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో పాటు అంబులెన్స్‌ను తాకింది. దీంతో హేమంత్‌కుమార్, వివేక్‌లు అంబులెన్స్ వెనుక టైర్ కింద పడ్డారు. హేమంత్ తలపై నుంచి టైర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలకు గురైన వివేక్ రక్తపు వాంతులు చేసుకోగా... అతడిని రామంతాపూర్‌లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ కొద్దిసేపటికే వివేక్ చనిపోయాడు. సాయికి స్వల్పగాయాలు తాకడంతో అతను అసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హేమంత్, వివేక్ మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వివేక్ తల్లిదండ్రులకు ఒకడే కుమారుడు కావడంతో వారి దుఖాఃనికి అంతులేకుండాపోయింది. కాగా, ప్రమాద స్థలిలో బైక్ రామంతాపూర్ వైపు పడి ఉండటం అనుమానాలు రేకెత్తిస్తోంది. రాంగ్రూట్లో వెళ్లడంతోనే...? గోల్నాక: అంబులెన్స్‌ను ఢీకొని ఇద్దరు విద్యార్థులు మరణించిన ఘటనపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పరీక్ష ఫీజు కట్టేందుకు వెళ్తూ ప్రమాదానికి గురయ్యారని కొందరంటుండ గా... బిర్యానీ కోసం వెళ్లి ప్రమాదానికి గురయ్యారని మరి కొందరుంటున్నారు. రామంతాపూర్ చర్చి కాలనీలో ఉండే కొందరు మిత్రులు బిర్యానీ తీసుకురమ్మని చెప్పగా నవీన్ అనే స్నేహితుడి బైక్‌ను తీసుకొని వివేక్ తన మిత్రులు హేమంత్, సాయిలను తీసుకొని అంబర్‌పేట మెయిన్‌రోడ్డుకు వ చ్చాడంటున్నారు. బిర్యానీ తీసుకొని రామంతాపూర్ తిరిగి వెళ్తున్న వీరు.. ట్రాఫిక్ పోలీసులు చలాన్లు రాస్తున్న విషయం గమనించి, వారి నుంచి తప్పించుకునేందుకు రాంగ్ రూట్లో వెళ్తూ ప్రమాదానికి గురయ్యారంటున్నారు. -
హైస్పీడ్ రైళ్లపై ప్రజాభిప్రాయం కోరిన పశ్చిమరైల్వే
దాదర్, న్యూస్‌లైన్: కొత్తగా కొనుగోలు చేసిన హైస్పీడ్ రైళ్లపై తమ తమ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా ప్రయాణికులను.... పశ్చిమ రైల్వే (డబ్ల్యూఆర్) కోరింది. వీటిలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ప్రయాణికులు తమ సలహాలు, సూచనలు ఇచ్చిన తర్వాత వాటినన్నింటినీ పరిశీలించి ఇకపై కొనుగోలు చేయనున్న రైళ్లను వారి మనోభావాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని వెస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్ హేమంత్ కుమార్ తెలిపారు. చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో తయారు చేసిన రెండు హైస్పీడ్ రైళ్లను డబ్ల్యూఆర్ ఇటీవల కొనుగోలు చేసింది. 12 బోగీలు కలిగిన ఈ రెండు రైళ్లను నవంబర్‌లో స్వాధీనం చేసుకుంది. ఒక్కో రైలు కొనుగోలు కోసం రూ.30 కోట్లను వెచ్చించినట్లు ప్రస్తుతం వీటిని స్థానిక రైలు యార్డులో ఉంచామన్నారు. రాత్రి వేళల్లో వీటిని ప్రయోగాత్మకంగా నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వెస్టర్న్ రైల్వే పరిధిలో రాకపోకలు సాగిస్తున్న 75 లక్షల మంది ప్రయాణికులకు రద్దీ నుంచి కొంతమేర ఉపశమనం లభిస్తుందన్నారు. ముంబై అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ (ఎంయూటీపీ) రెండో దశలో భాగంగా 72 హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే అంశాన్ని సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ రైళ్లు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి ఈ రైళ్లలోని సీట్లు, హ్యాండిళ్లు తలుపులు, కిటికీలను ఎంతో అందంగా, అత్యాధునికంగా తీర్చిదిద్దారు.