Producer Hemanth Kumar Ties Knot With Sujani Sanjeevi - Sakshi
Sakshi News home page

Hemanth Kumar: గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నిర్మాత

Apr 2 2022 8:32 AM | Updated on Apr 2 2022 9:32 AM

Producer Hemanth Kumar Ties Knot With Sujani Sanjeevi - Sakshi

'నువ్వు నావాడివైనందుకు సంతోషంగా ఉంది, నువ్వు నా ప్రపంచానివి, లవ్‌ యూ' అంటూ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా

టాలీవుడ్‌ నిర్మాత హేమంత్‌ కుమార్‌ ఓ ఇంటివాడయ్యాడు. సుజని సంజీవితో ఏడడుగులు నడిచాడు. హంగూ ఆర్భాటలకు పోకుండా నిరాడంబరంగా ఓ గుడిలో మార్చి 30న వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని హేమంత్‌ నెట్టింట అభిమానులతో పంచుకున్నాడు.

'కోయంబత్తూరులోని ఓ దేవాలయంలో సుజని, నేను పెళ్లి చేసుకున్నాం. ఇరు కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్దిమంది సమక్షంలోనే మా వివాహం జరిగింది. నీ జీవిత భాగస్వామిగా నన్ను ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు సుజని' అని రాసుకొచ్చాడు. అటు హేమంత్‌ భార్య సుజనీ సైతం 'నువ్వు నావాడివైనందుకు సంతోషంగా ఉంది, నువ్వు నా ప్రపంచానివి, లవ్‌ యూ' అంటూ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా పలువురు సెలబ్రిటీలు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా హేమంత్‌ కుమార్‌ ఫిక్షనరీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే నిర్మాణ సంస్థకు సహ వ్యవస్థాపకుడు.

చదవండి: బుల్లితెరపై సందడి చేయనున్న 'శ్యామ్ సింగరాయ్'..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement