
అమెరికాలో ఇండో-అమెరికన్ మహిళ హత్య
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో 48 ఏళ్ల ఇండో అమెరిక న్ మహిళను ఆమె భర్త కాల్చి చంపాడు.
శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ ఇండో అమెరికన్ మహిళ దారుణ హత్యకు గురైంది. శాన్ జోన్‌లోని ఇండిగో ఓక్ లేన్‌లో నివాసముంటున్న 48 ఏళ్ల సోనియా నల్లాన్ ను ఆమె భర్త జేమ్స్ నల్లన్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ దుర్ఘటన శనివారం జరిగినట్లు తెలుస్తుంది.
మృతురాలు సోనియా నల్లాన్ ఎంకోర్ సెమీ కండక్టర్స్ అనే కంపెనీలో పనిచేస్తోంది. 63 ఏళ్ల ఆమె భర్త జేమ్స్ నల్లన్ కూడా ఇండో అమెరికన్ నే. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.