ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి వినూత్న కోణంలో పరిశోధనలు చేసి ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చినందుకు ప్రవాస భారతీయుడు అభిజిత్ బెనర్జీకి అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది. ఈ ఏడాది ఆర్థిక నోబెల్ పురస్కారాన్ని ముగ్గురికి ప్రకటించారు. అభిజిత్, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో, మరో అమెరికన్ ఆర్థికవేత్త మైకేల్ క్రెమెర్‌లు సంయుక్తంగా ఈ అవార్డును అందుకోనున్నారు. భార్యతో కలిసి ఒక ప్రవాస భారతీయుడు అర్థశాస్త్రంలో నోబెల్‌ను దక్కించుకోవడం ఒక విశేషమైతే, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని పొందిన రెండో మహిళ డఫ్లో. ఈ పురస్కారం కింద తొమ్మిది లక్షల 18 వేల అమెరికా డాలర్ల నగదు, ఒక బంగారు పతకం, డిప్లొమా అందిస్తారు.
అభిజిత్‌కు నోబెల్
Published Tue, Oct 15 2019 8:35 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement