Economics
-
Nobel Prize in Economics 2024: అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
స్టాక్‌హోమ్: దేశంలోని సంస్థలు, వ్యవస్థల అసమర్థత కారణంగా ఆ దేశం ఎలా పేదరికంలోనే మగ్గిపోతుందనే అంశాలపై విస్తృత పరిశోధనలు చేసిన ముగ్గురు ఆర్థికవేత్తలకు అర్థశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం దక్కింది. ఆయా సమాజాల్లో నిబంధనలను తుంగలో తొక్కడం, సంస్థలు, వ్యవస్థల్లో లోపాలు ఆ దేశాభివృద్ధికి ఎలా పెనుశాపాలుగా మారతాయనే అంశాలను డరేన్ ఎసిమోగ్లూ, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్లు చక్కగా విడమర్చి చెప్పారని రాయల్ స్వీడిష్ అకాడమీ సైన్స్ విభాగ నోబెల్ కమిటీ కొనియాడింది. ఈ మేరకు ముగ్గురికీ నోబెల్‌ను ప్రకటిస్తూ సోమవారం కమిటీ ఒక ప్రకటన విడుదలచేసింది. ఎసిమోగ్లూ, జాన్సన్‌లు అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సేవలందిస్తుండగా షికాగో విశ్వవిద్యాలయంలో రాబిన్సన్ పనిచేస్తున్నారు. ‘‘ దేశాల మధ్య ఆర్థిక అసమానతలను తగ్గించడం అనేది శతాబ్దాలుగా ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఆదాయ, ఆర్థికాభివృద్ధి అసమానతలను రూపుమాపడంలో అక్కడి వ్యవస్థల కీలకపాత్రను ఆర్థికవేత్తలు స్పష్టంగా పేర్కొన్నారు’’ అని ఆర్థికశాస్త్ర కమిటీ చైర్మన్ జాకబ్ సెవెన్సన్ వ్యాఖ్యానించారు. తనకు నోబెల్ రావడంపై 57 ఏళ్ల ఎసిమోగ్లూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. దేశాలు ఎందుకు సక్సెస్ కాలేవు? అవార్డ్ విషయం తెలిశాక తుర్కియే దేశస్థుడైన ఎసిమోగ్లూ మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యయుత వ్యవస్థల గొప్పతనాన్ని ఈ అవార్డ్ గుర్తించింది. అభివృద్ధిలో దేశాలు ఎందుకు వెనుకబడతాయని రాబిన్సన్, నేను కలిసి పరిశోధించాం. ప్రజాస్వామ్యం అనేది సర్వరోగ నివారిణి కాదు. ఒక్కోసారి ఎన్నికలు వచి్చనప్పుడే సంక్షోభాలు ముంచుకొస్తాయి’’ అని అన్నారు. ఒకే పార్టీ ఏలుబడిలో ఉన్న చైనా ఎలా అభివృద్ధి పథంలో దూసుకుపోగల్గుతోందని విలేఖరులు ప్రశ్నించగా.. ‘‘ శక్తివంతమైన అధికారయంత్రాంగం ఉన్న చైనా లాంటి దేశాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, వినూత్న ఆవిష్కరణల కోసం ఎన్నో అవరోధాలను దాటుతున్నారు’’ అని అన్నారు. 12 ఏళ్ల క్రితం ఎసిమోగ్లూ, రాబిన్సన్ రాసిన ‘ వై నేషన్స్ ఫెయిల్: ది ఆరిజన్స్ ఆఫ్ పవర్, ప్రాస్పారిటీ, పూర్’ పుస్తకం అత్యధిక కాపీలు అమ్ముడుపోయింది. వ్యక్తుల తప్పిదాలే ఆయా దేశాలను పేదదేశాలుగా మిగిలిపోవడానికి కారణమని రచయితలు ఆ పుస్తకంలో వివరించారు. సరిగ్గా అమెరికా–మెక్సికో సరిహద్దులో ఉన్న ఆరిజోనా రాష్ట్ర నోగేల్స్ సిటీ భిన్న పరిస్థితులను ఆర్థికవేత్తలు చక్కటి ఉదాహరణగా తీసుకున్నారు. అమెరికా వైపు ఉన్న నోగేల్స్ సిటీ ఉత్తరప్రాంత వాసులు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఆయుర్దాయం ఎక్కువ. ఎక్కువ మంది విద్యార్థులు హైసూ్కల్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తున్నారు. అదే దక్షిణవైపు ప్రాంత ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. అక్కడ వ్యవస్థీకృత నేరాలు ఎక్కువ. ఆ ప్రాంతంలో వ్యాపారాలు చేయడం కూడా రిస్క్‌తో కూడిన వ్యవహారం. అవినీతి రాజకీయనేతలను అధికారం నుంచి కిందకు దింపడం కూడా చాలా కష్టం. అమెరికాలో అయితే పౌరుల ఆస్తిహక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఇలాంటి విధానాలే ఒకరకంగా దేశం బాగుపడటానికి బాటలువేస్తాయి ’’ అని ఎసిమోగ్లూ వివరించారు. వ్యవస్థలకు తగ్గుతున్న ఆదరణ దురదృష్టవశాత్తు ఇటీవలి కాలంలో అమెరికా, యూరప్‌లలో ప్రజాస్వామ్యయుత వ్యవస్థలకు ఆదరణ తగ్గుతోంది. తమకు అన్యాయం జరిగిందని ప్రజలు భావించిన సందర్భాల్లో ప్రజాస్వామ్యదేశాలు ఓడిపోయినట్లే లెక్క. ఇలాంటి ఉదంతాలు ప్రజాస్వామ్యదేశాలు మేల్కొనాల్సిన తరుణం వచి్చందని గుర్తుచేస్తాయి. సుపరిపాలన అందించేందుకు దేశాలు మళ్లీ ప్రయత్నించాలి’’ అని ఎసిమోగ్లూ అన్నారు. -
లెదరు బ్యాగూ... బ్రీఫు కేసూ...
ప్రభుత్వాలు మొదలుకొని సామాన్యుల వరకూ ఈ రోజున చాలా విరివిగా వాడుతున్న మాట, ‘బడ్జెట్’. వ్యక్తిగత స్థాయిలో గృహస్థు, లేదా గృహిణి ఎప్పటికప్పుడు జమా, ఖర్చులు బేరీజు వేసుకుంటూ ఒడుపుగా సంసారాన్ని నడపడం కూడా బడ్జెట్ కూర్పు లాంటిదే. ప్రభుత్వాల స్థాయిలో అయితే ఏడాది కాలానికి సరిపోయే ఆదాయ, వ్యయాల ప్రణాళికకు పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. అది యావద్దేశ ప్రజల జీవన స్థితిగతులతో ముడిపడి ఉంటుంది కనుక అన్ని వర్గాలవారూ దానికోసం చకోరపక్షులవుతారు. తీరా వచ్చాక ఆశాభంగాలూ ఉంటాయి, ఆశోద్దీపనలూ ఉంటాయి. ఆ విధంగా బడ్జెట్ ఆర్థికాంశాల కూర్పే కాదు; ఆశ నిరాశల కలగలుపు కూడా! కిందటి వారమే కేంద్రం స్థాయిలో మరో బడ్జెట్ సమర్పణ ముగిసింది కానీ, దానిపై చర్చ కొనసాగుతూనే ఉంది. బడ్జెట్ అనే మాట ఎలా పుట్టిందో తెలుసుకోవడమూ ఆసక్తిదాయకమే. లాటిన్లో తోలుసంచీని ‘బుల్గా’ అనేవారు. ఆ మాటే ఫ్రెంచిలో ‘బూజ్’, ‘బగెట్’ అయింది. వాటినుంచే ‘బడ్జెట్’ పుట్టి 15వ శతాబ్ది నుంచి ప్రచారంలోకి వచ్చింది. ఆదాయ, వ్యయాల ముందస్తు ప్రకటన అనే అర్థంలో ఈ మాటను మొదటిసారి 1733లో ఉపయోగించారట. కోశాగార మంత్రి తన ద్రవ్య ప్రణాళికను ఉంచుకునే తోలుసంచీ ‘బడ్జెట్’ అనే మాటను ప్రపంచానికి అందించింది. ఈ రోజున విరివిగా వాడే ‘వాలెట్’, ‘పౌచ్’లు కూడా బడ్జెట్ అనే తోలుసంచీకి లఘురూపాలే. 14వ శతాబ్ది నుంచి వాడుకలో ఉన్న ‘వాలెట్’కు వస్తువులను చుట్టబెట్టేదని అర్థం. ఇది ‘వెల్’ అనే ప్రోటో–ఇండో–యూరోపియన్ మూలం నుంచి వచ్చింది. విశేషమేమిటంటే, సంస్కృతంలో ‘వలతే’, ‘వలయం’ అనే మాటల మూలాలు కూడా ‘వెల్’లోనే ఉన్నాయని భాషావేత్తలు అంటారు. ‘పౌచ్’ అనే మాటే రకరకాల రూపాల మీదుగా ‘ప్యాకెట్’ అయింది. బడ్జెట్ అనబడే తోలుసంచే బడ్జెట్ రోజున నేటి ఆర్థికమంత్రులు చేతుల్లో బ్రీఫ్ కేస్‌గా మారిన సంగతిని ఊహించడం కష్టం కాదు. బడ్జెట్ వివరాల గోప్యతకు సంకేతంగా కూడా దానిని తీసుకోవచ్చు. ఆధునిక కాలంలో మన దేశంలో బడ్జెట్ సంప్రదాయం 1860లో మొదలైందనీ, నాటి బ్రిటిష్ ప్రభుత్వంలో భారత ఆర్థికమంత్రిగా ఉన్న జేమ్స్ విల్సన్ దానికి నాంది పలికారనీ చరిత్ర చెబుతోంది. స్వతంత్ర భారతంలో తొలి బడ్జెట్ సమర్పకులు ఆర్.కె.షణ్ముగం చెట్టి కాగా, బడ్జెట్‌కు నేటి రూపూ, రేఖా కల్పించిన ఆర్థిక పండితుడు పి.సి.మహలనోబిస్. అయితే, చరిత్ర కాలానికి వెళితే, మౌర్యుల కాలంలోనే ఒక ఏడాదికి సరిపోయే బడ్జెట్‌నూ, గణాంకాలనూ కూర్చేవారని చరిత్ర నిపుణులంటారు. ఆ కాలానికే చెందిన కౌటిల్యుని అర్థశాస్త్రం దానికి ఆధారం. కాకపోతే, అప్పట్లో ఏడాదికి 354 రోజులు. గురుపూర్ణిమగా చెప్పుకునే ఆషాఢ పూర్ణిమ నుంచి సంవత్సరాన్ని లెక్కించేవారు. నేటి బడ్జెట్ తరహా కూర్పే ఇంచుమించుగా అర్థశాస్త్రంలోనూ కనిపిస్తుంది. అర్థమంటే డబ్బు కనుక అర్థశాస్త్రం కేవలం ఆర్థిక విషయాలే చెబుతుందనుకుంటారు కానీ, కౌటిల్యుని ఉద్దేశంలో అర్థమంటే, మనుషుల జీవన విధానానికీ, వారు నివసించే భూమికీ చెందిన అన్ని విషయాలనూ చెప్పేదని– ప్రసిద్ధ సంçస్కృత పండితుడు, అర్థశాస్త్ర వ్యాఖ్యాత పుల్లెల శ్రీరామచంద్రుడు అంటారు. అర్థశాస్త్రం ప్రకారం నాటి బడ్జెట్ సంవత్సరాన్ని ‘రాజవర్షం’ అనేవారు. నేటి ఆర్థికమంత్రిని పోలిన అధికారిని ‘సమాహర్త’ అనేవారు. ఏయే ఆదాయ వనరు నుంచి ఎంత ఆదాయం రావాలో నిర్ణయించడం, ఆదాయం పెంచడం, ఖర్చు తగ్గించడం అతని బాధ్యత. ‘ఆయముఖాలు’ అనే పేరుతో ఆదాయాన్ని వర్గీకరించేవారు. ఆదాయమిచ్చే వస్తువును ‘ఆయశరీర’ మనేవారు. నగరం, జనపదం, గనులు, సేద్యపు నీటి వనరులు, అడవులు, పశువుల పెంపకం, వర్తక మార్గాలు, వ్యవసాయం, సుంకాలు, జరిమానాలు, తూనికలు, కొలతలు, ప్రవేశానుమతులు (పాస్‌పోర్ట్‌లు), మద్యం, దారం, నెయ్యి, ఉప్పు, ఖనిజాలు, రంగురాళ్ళు, బంగారపు పని, కళారంగం, ఆలయాలనే కాక; ఆ కాలపు రీతి రివాజులను బట్టి వేశ్యావృత్తిని, జూదాన్ని కూడా ఆదాయ మార్గంగానే చూసేవారు. వీటిలో ఒక్కోదానికీ పర్యవేక్షణాధికారి ఉండేవాడు. మతపరమైన తంతులు, సాయుధ దళాలు, ఆయుధాలు, గిడ్డంగులు, కర్మాగారాలు, కార్మికులు, రాజప్రాసాద నిర్వహణ ప్రభుత్వం ఖర్చు కిందికి వచ్చేవి. రాజుకు వ్యక్తిగత సంపద ఉండేది కానీ, రాచకుటుంబంలోని మిగతా సభ్యులకు జీతాలు చెల్లించేవారు. అయితే, ఆదాయం చాలావరకు వస్తురూపంలో ఉండేది కనుక గిడ్డంగులలో భద్రపరిచేవారు. గిడ్డంగులపై అధికారిని ‘సన్నిధాత్రి’ అనేవారు. ఇంకా విశేషమేమిటంటే, నేటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వ్యవస్థ లాంటిదే అప్పుడూ విడిగా ఉండేది. ఆదాయవ్యయ పత్రాలనూ, లెక్కలనూ తనిఖీ చేసే ఆ విభాగాధికారిని ‘అక్షపటలాధ్యక్షుడ’నేవారు. ఇప్పుడున్నట్టు ఆదాయం పన్ను, కార్పొరేట్ పన్ను, పరోక్ష పన్నులు, వడ్డీ రాయితీ వంటివీ; సాధారణ సేవలు, సామాజిక సేవలు, ఆర్థిక సేవల వంటి వర్గీకరణలూ; సంక్షేమ స్పృహా అప్పుడూ ఉండేవి. కాకపోతే ఇప్పటిలా అభివృద్ధి కేంద్రితమైన ఆలోచనలు అర్థశాస్త్రంలో లేవని పండితులంటారు. కాలానుగుణమైన తేడాలను అలా ఉంచితే, ‘‘ప్రజాహితమే రాజు హితం, ప్రజలకు ప్రియమైనదే రాజుకూ ప్రియమైనది కావా’’లనే అర్థశాస్త్ర నిర్దేశం త్రికాల ప్రభుత్వాలకూ వర్తించే తిరుగులేని సూత్రం. -
జీడీపీ.. టాప్‌గేర్!
న్యూఢిల్లీ: ఆర్థిక మూలాలు బలోపేతం అవుతున్నందున భారత జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023–24) 6.9–7.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని డెలాయిడ్ ఇండియా తెలిపింది. త్రైమాసిక వారీ అవుట్‌లుక్‌ను విడుదల చేసింది. భారత ఆర్థిక వ్యవస్థలో అంతర్లీనంగా మంచి పురోగతి నెలకొందని, స్థూల ఆర్థిక గణాంకాలు దీన్ని తెలియజేస్తున్నాయని పేర్కొంది. కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) 2022–23లో 1.9 శాతంగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది మరింత తగ్గుతుందని డెలాయిట్ ఇండియా తెలిపింది. అలాగే విదేశీ మారకం నిల్వలు 568 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని, ఇవి 10 నెలల దిగుమతి అవసరాలకు సమానమని పేర్కొంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 5 శాతం స్థాయిలో ఆర్బీఐ లకి‡్ష్యత పరిధి కంటే ఎగువన ఉన్నట్టు వివరించింది. కానీ, దశాబ్ద కాలం క్రితం నాటి ద్రవ్యోల్బణంతో పోలిస్తే చాలా తక్కువలోనే ఉన్నట్టు గుర్తు చేసింది. జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన తొలి ముందస్తు జాతీయ ఆదాయం గణాంకాల ప్రకారం చూసినా.. దేశ జీడీపీ 2023–24లో 7.3 శాతం వృద్ధిని నమోదు చేయనుంది. 2022–23 సంవత్సరంలో ఉన్న 7.2 శాతం కంటే స్వల్ప వృద్ధి కావడం గమనార్హం. మైనింగ్, క్వారీయింగ్, తయారీ, సేవలకు సంబంధించి కొన్ని రంగాల బలమైన పనితీరు ఇందుకు దోహదం చేయనుందని జాతీయ గణాంక కార్యాలయం అంచనాగా ఉంది. 2024–25లో 6.4 శాతం.. ‘‘ఆర్థిక మూలాలు మెరుగుపడుతుండడం మా అంచనాలకు మద్దతుగా నిలిచింది. మా ప్రాథమిక అంచనాల ప్రకారం 2023–24లో భారత్ 6.9–7.2 శాతం మధ్య వృద్ధిని నమోదు చేస్తుంది. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఇది 6.4 శాతం, 6.7 శాతంగా ఉండొచ్చు. అంతర్జాతీయ ఆర్థిక చిత్రం మోస్తరుగానే ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ, మిగిలిన ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ అనిశ్చితులను మెరుగ్గా అధిగమించగలదు’’అని డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుక్మి ముజుందార్ తెలిపారు. ద్రవ్యోల్బణం తిరిగి 5.4 శాతానికి ఇటీవల పెరగడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అధిక ద్రవ్యోల్బణం 2023–24 ద్వితీయ ఆరు నెలల్లోనూ కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని.. అధిక ఆహార ధరలు, అస్థిరతలతో కూడిన చమురు ధరలు ఆ తర్వాతి కాలంలో స్థిరపడతాయని వెల్లడించారు. గడిచిన పదేళ్ల కాలంలో భారత్ సాధించిన వృద్ధి ప్రయాణాన్ని డెలాయిట్ ప్రస్తావించింది. ఎగుమతులను పలు దేశాల మధ్య వైవిధ్యం చేసుకోవడంతోపాటు, విలువ ఆధారిత ఉత్పత్తుల వైపు మళ్లినట్టు తెలిపింది. ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ వాటా పెరిగినట్టు వెల్లడించింది. ఎగుమతుల్లో పోటీతత్వాన్ని కూడా పెంచుకున్నట్టు పేర్కొంది. అయితే మరింత పోటీతత్వాన్ని అందిపుచ్చుకోవాలని అభిప్రాయపడింది. -
ఆర్థిక శాస్త్రంలో క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ పురస్కారం
స్టాక్‌హోమ్: 2023 ఏడాదికి గాను ఆర్థిక శాస్త్రంలో అమెరికాకు చెందిన క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ పురస్కారం లభించింది. మహిళల లేబర్ మార్కెట్ ఫలితాలపై విశేష కృషి చేసినందుకుగాను ఆమెకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ బహుమతిని కేటాయించింది. క్లాడియా గోల్డిన్ అమెరికాకు చెందిన ప్రముఖ లేబర్ ఎకనమిస్ట్. హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మహిళా శ్రామిక శక్తి, సంపాదనలో లింగ వ్యత్యాసం, ఆదాయ అసమానత, సాంకేతిక మార్పు, విద్య, వలసలతో సహా అనేక రకాల అంశాలపై ఆమె పరిశోధన చేశారు. 1990ల్లోనే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్ధిక విభాగంలో పనిచేసిన ఏకైక మహిళ క్లాడియా గోల్డిన్. మహిళా ఆర్థిక శక్తిపై ఆమె ఎనలేని పరిశోధన చేశారు. BREAKING NEWS The Royal Swedish Academy of Sciences has decided to award the 2023 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel to Claudia Goldin “for having advanced our understanding of women’s labour market outcomes.”#NobelPrize pic.twitter.com/FRAayC3Jwb — The Nobel Prize (@NobelPrize) October 9, 2023 నోబెల్ బహుమతుల విజేతలను ప్రకటించే క్రమంలో ఇప్పటికే వైద్య, భౌతిక రంగంలోని అవార్డు గ్రహీతలను ప్రకటించిన కమిటీ బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం నోబెల్ శాంతి రంగాల్లో బహుమతుల విజేతలను ప్రకటించనుంది. చివరిగా ఈ నెల 9న అర్థశాస్త్రంలో విజేతను ప్రకటించింది జ్యురీ. నోబెల్ విజేతలకు డిసెంబర్ 10న బహుమతులను ప్రదానం చేస్తారు. గత ఏడాది నోబెల్ గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు అందజేశారు. ఈసారి ఆ బహుమతిని మరింత పెంచుతూ 11 మిలియన్ల క్రోనర్లు ఇవ్వనున్నారు. ఇదీ చదవండి: Nobel Prize 2023 In Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం -
Joyeeta Gupta: డైనమిక్ ప్రొఫెసర్‌కు డచ్ నోబెల్
ఆర్థికశాస్త్రం చదువుకున్నవారి ఆసక్తి గణాంకాలకే పరిమితమని, న్యాయశాస్త్రం చదువుకున్న వారి ఆసక్తి ఆ శాస్త్రానికి సంబంధించిన అంశాలపైనే ఉంటుందనేది ఒక సాధారణ భావన. ‘విభిన్న విద్యానేపథ్యం ఉన్న మేధావి’గా గుర్తింపు పొందిన జ్యోయితా గుప్తా ఆర్థికశాస్త్రం నుంచి న్యాయశాస్త్రం వరకు ఎన్నో శాస్త్రాలు చదివింది. అయితే ఆమె ప్రయాణంలో ఆ శాస్త్రాలేవీ వేటికవే అన్నట్లుగా ఉండిపోలేదు. వాతావరణ మార్పులపై తాను చేసిన శాస్త్రీయ పరిశోధనకు మరింత విస్తృతిని ఇచ్చాయి. నెదర్లాండ్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఆమ్‌స్టార్‌డమ్‌లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జ్యోయితా గుప్తా డచ్ రిసెర్చి కౌన్సిల్ నుంచి ‘డచ్ నోబెల్’గా పేరొందిన ప్రతిష్టాత్మకమైన స్పినోజా ప్రైజ్‌ను ది హేగ్‌లో అందుకుంది... దిల్లీలో పుట్టి పెరిగింది జ్యోయితా గుప్తా. లోరెటో కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది. దిల్లీ యూనివర్శిటీలో ఎకనామిక్స్, గుజరాత్ యూనివర్శిటీలో న్యాయశాస్త్రం, హార్వర్డ్ లా స్కూల్లో ఇంటర్నేషనల్ లా చదివింది. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పులు’ అనే అంశంపై ఆమ్స్టార్ డామ్‌లోని వ్రిజే యూనివర్శిటీలో డాక్టరేట్ చేసింది. 2013లో ఈ యూనివర్శిటీలో ఫ్యాకల్టీగా చేరింది. వాతావరణ మార్పుల వల్ల సమాజంపై కలుగుతున్న ప్రభావం, ఉత్పన్నమవుతున్న సామాజిక అశాంతి... మొదలైన అంశాలపై లోతైన పరిశోధనలు చేసింది. 2016లో ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఔట్లుక్ (జీఈవో)కు కో– చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది. యూనివర్శిటీ ఆఫ్ ఆమ్‌స్టర్‌డమ్‌లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జ్యోయితా గుప్తా ‘ఆమ్స్టర్డామ్ గ్లోబల్ చేంజ్ ఇన్స్టిట్యూట్’ సభ్యులలో ఒకరు. పరిశోధనలకే పరిమితం కాకుండా పర్యావరణ సంబంధిత అంశాలపై విలువైన పుస్తకాలు రాసింది జ్యోయిత. ‘ది హిస్టరీ ఆఫ్ గ్లోబల్ క్లైమెట్ గవర్నెన్స్’ ‘ది క్లైమెట్ ఛేంజ్ కన్వెన్షన్ అండ్ డెవలపింగ్ కంట్రీస్’ ‘టాక్సిక్ టెర్రరిజమ్: డంపింగ్ హజడస్ వేస్ట్’ ‘అవర్ సిమరింగ్ ప్లానెట్’ ‘ఆన్ బిహాఫ్ ఆఫ్ మై డెలిగేషన్: ఏ సర్వె్యవల్ గైడ్ ఫర్ డెవలపింగ్ కంట్రీ క్లైమెట్ నెగోషియేటర్స్’ ‘మెయిన్ స్ట్రీమింగ్ క్లైమేట్ చేంజ్ ఇన్ డెవలప్మెంట్ కో ఆపరేషన్’... మొదలైన పుస్తకాలు రాసింది. అమెరికా పరిశ్రమల చెత్త ఏ దేశాలకు చేరుతుంది? ఎంత విషతుల్యం అవుతుందో 1990లోనే ‘టాక్సిక్ టెర్రరిజమ్: డంపింగ్ హాజడస్ వేస్ట్’ పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించింది. పాశ్చాత్య దేశాల పరిశ్రమలు ఉత్పత్తి చేసే విషపూరిత వ్యర్థాలు మరోవైపు విదేశీ మారకద్రవ్యం కోసం పరితపిస్తూ పర్యావరణాన్ని పట్టించుకోని దేశాల గురించి లోతైన విశ్లేషణ చేసింది జ్యోయిత. సాధారణంగానైతే పర్యావరణ అంశాలకు సంబంధించిన చర్చ, విశ్లేషణ ఒక పరిధిని దాటి బయటికి రాదు. అయితే జ్యోయిత విశ్లేషణ మాత్రం ఎన్నో కోణాలను ఆవిష్కరించింది. వాతావరణంలోని మార్పులు ప్రభుత్వ పాలనపై చూపే ప్రభావం, ధనిక, పేద సమాజాల మధ్య తలెత్తే వైరుధ్యాల గురించి చెప్పడం ఇందుకు ఒక ఉదాహరణ. ‘ప్రపంచవ్యాప్తంగా తగినన్ని ఆర్థిక వనరులు ఉన్నాయి. అందరి జీవితాలను బాగు చేయడానికి ఆ వనరులను ఎలా ఉపయోగించాలనేదే సమస్య. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు, నిరుపేదల మధ్య అసమానతలు ఉన్నాయి. భారత్‌లాంటి దేశాల్లో కూడా ఇదొక పెద్ద సవాలు’ అంటుంది జ్యోయిత. ఆమె విశ్లేషణలో విమర్శ మాత్రమే కనిపించదు. సందర్భాన్ని బట్టి పరిష్కారాలు కూడా కనిపిస్తాయి. ‘విస్తృతమైన, విలువైన పరిశోధన’ అంటూ స్పినోజా ప్రైజ్ జ్యూరీ గుప్తాను కొనియాడింది. కొత్త తరం పరిశోధకులకు ఆమె మార్గదర్శకత్వం విలువైనదిగా ప్రశంసించింది. తనకు లభించిన బహుమతి మొత్తాన్ని (1.5 మిలియన్ యూరోలు) శాస్త్రపరిశోధన కార్యక్రమాలపై ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకుంది జ్యోయితా గుప్తా. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు, పర్యావరణ సంరక్షణకు చట్టాలతో కూడిన ప్రపంచ రాజ్యాంగం కోసం జ్యోయితా గుప్తా గట్టి కృషి చేస్తోంది. -
Nobel Prize- 2022: ముగ్గురికి ఆర్థిక నోబెల్
స్టాక్‌హోమ్: తీవ్ర ఆర్థికమాంద్యంలో అతలాకుతలమైన అమెరికా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు అహర్నిశలు కృషిచేసిన అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ మాజీ చైర్మన్ బెన్ బెర్నాంకీని ఆర్థికశాస్త్ర నోబెల్ వరించింది. ఆయనతోపాటు బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలపై కీలక పరిశోధనలు చేసిన మరో ఇద్దరు అమెరికా ఆర్థికవేత్తలు డగ్లస్ డబ్ల్యూ.డైమండ్, ఫిలిప్ హెచ్.డైబ్విగ్లకు సోమవారం ఆర్థిక నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. ‘బ్యాంక్‌లు కుప్పకూలకుండా చూసుకోవడం మనకు ఏ విధంగా అత్యంత ముఖ్యమైన అంశం’ అనే దానిపై ఈ ముగ్గురి శోధన కొనసాగిందని స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్‌లోని నోబెల్ కమిటీ పేర్కొంది. ఆర్థికవ్యవస్థలను సంస్కరించాలనే పునాదులను ఈ ముగ్గురు 1980 దశకంలోనే వేశారని ఆర్థిక శాస్త్రాల నోబెల్ కమిటీ అధినేత జాన్ హస్లర్ చెప్పారు. ‘ ఆర్థిక వ్యవస్థను నిట్టనిలువునా కూల్చేసేవి ముఖ్యంగా రెండే. అవి ఆర్థిక సంక్షోభం, ఆర్థికమాంద్యం. వీటి నివారణ, సమర్థవంతంగా ఎదుర్కోవడం అనే వాటిలో వీరి పరిశోధనలు ఎంతగానో సాయపడనున్నాయి’ అని హస్లర్ అన్నారు. 68 ఏళ్ల బెర్నాంకీ ప్రస్తుతం ఒక బ్రోకింగ్ ఇన్స్టిట్యూట్ కోసం పనిచేస్తున్నారు. ఈయన 1930లో అమెరికా చవిచూసిన మహామాంద్యం మూలాలపై పరిశోధన చేశారు. ఆనాడు ఆందోళనకు గురైన జనం ఒక్కసారిగా బ్యాంక్‌ల నుంచి మొత్తం నగదును ఉపసంహరించుకుంటుంటే బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూలడం, తదనంతరం ఊహించనిస్థాయికి ఆర్థికవ్యవస్థ కుప్పకూలడం లాంటి వాటిపైనా బెర్నాంకీ పరిశోధన చేశారు. అంతకుముందు షికాగో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 68 ఏళ్ల డగ్లస్ డైమండ్, సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 67 ఏళ్ల ఫిలిప్ డైబ్విగ్లు బ్యాంక్ డిపాజిట్లకు ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటే సంక్షుభిత ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఎలా నిలబడగలదో అనే అంశాలపై పరిశోధన కొనసాగించారు. బ్యాంకింగ్ వ్యవస్థకు సాయపడేలా 1983లోనే డైమండ్, ఫిలిప్ సంయుక్తంగా ‘ బ్యాంక్ రన్స్, డిపాజిట్ ఇన్సూరెన్స్, లిక్విడిటీ’ రచన చేశారు. బెర్నాంకీ 2007–08 కాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలోపెట్టేందుకు స్వల్పకాలిక వడ్డీరేట్లను సున్నాకు తెచ్చారు. ఈయన నేతృత్వంలో ఫెడ్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా ఆర్థికమాంద్యం నుంచి త్వరగా గట్టెక్కింది. 2020 తొలినాళ్లలో కోవిడ్‌తో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థకు 2020నాటి ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జోరోమ్ పావెల్ సైతం ఇవే నిర్ణయాలను అమలుచేసి వ్యవస్థను మళ్లీ దారిలోపెట్టడం గమనార్హం. 1930నాటి మహామాంద్యం చాలా సంవత్సరాలు తీవ్రస్థాయిలో కొనసాగడానికి గల కారణాలను 1983నాటి పరిశోధనా పత్రంలో బెర్నాంకీ విశదీకరించారు. డిపాజిటర్లు డబ్బంతా బ్యాంక్‌ల నుంచి ఉపసంహరించుకోవడంతో ఆర్థికవ్యవస్థకు కీలకమైన కొత్త రుణాలను మంజూరుచేయలేక బ్యాంక్‌లు కుప్పకూలాయని బెర్నాంకీ కనుగొన్నారు. ఇవి బ్యాంకింగ్ వ్యవస్థను మరింతగా అర్థంచేసుకునేందుకు సాయపడుతున్నాయని నోబెల్ కమిటీ అధినేత హస్లర్ అభిప్రాయపడ్డారు. -
ఆర్థికశాస్త్ర దిగ్గజాల సరసన భారతీయురాలు.. తొలి మహిళగా రికార్డు
‘అర్థం కావాలేగానీ ఆర్థికశాస్త్ర విషయాలు చందమామ కథల కంటే ఎక్కువగా ఆకర్షిస్తాయి’ అంటారు. అది ఎంత వరకు నిజమో తెలియదుగానీ, గీతా గోపీనాథ్‌కు ఆర్థికశాస్త్రం అనేది శ్వాస! సివిల్ సర్వీసులలో చేరాలనేది తన మొదటి కల. అయితే ఆర్థికశాస్త్రంపై ఆసక్తి ఆమెను వేరే దారిలోకి తీసుకెళ్లింది. ప్రపంచ ఆర్థికశాస్త్ర దిగ్గజాల సరసన చేర్చింది... ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి) గోడ (వాల్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ ఎకనామిస్ట్స్)పై ఆ సంస్థ తరపున పనిచేసిన ప్రముఖ ఆర్థికవేత్తల ఫోటోలు వరుసగా కనిపిస్తాయి. ఒక్కో ఫొటో చూస్తూ వెళుతుంటే ఆర్థికరంగంలో వారి మేధోకృషి గుర్తుకు వస్తుంటుంది. అపురూపమైన చిత్రాలు అవి. ఇప్పుడు ఆ ఫొటోల వరుసలో ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ ఫోటో చేరింది. ఐఎంఎఫ్ వాల్ ఫొటోల వరుసలో కనిపించిన తొలి మహిళా ఆర్థికవేత్తగా గీతా గోపీనాథ్ తనప్రత్యేకతను చాటుకుంది. ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ ప్రఖ్యాత ఆర్థికవేత్తల ఫొటోల వరుసలో తన ఫోటో ఏర్పాటు చేసినందుకు ట్విట్టర్ ద్వారా సంతోషం వ్యక్తం చేసింది గీత. ఇండియన్–అమెరికన్ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్న గీతా గోపినాథ్ కోల్‌కతాలో జన్మించింది. మైసూర్‌లోని నిర్మల కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది. దిల్లీలో లేడి శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో బీఏ, యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్లో ఎం.ఏ. చేసింది. ప్రిన్స్టన్ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డి పట్టా అందుకుంది. Breaking the trend 👊💥…I joined the wall of former Chief Economists of the IMF 😀 pic.twitter.com/kPay44tIfK— Gita Gopinath (@GitaGopinath) July 6, 2022 చదువు పూర్తయిన తరువాత హార్వర్డ్ యూనివర్శిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసింది. ఏడవ తరగతి వరకు గీతకు 45 శాతం లోపు మార్కులు వచ్చేవి. తల్లిదండ్రులెప్పుడూ మార్కుల విషయంలో ఒత్తిడి తెచ్చేవారు కాదు. అయితే ఏడవ తరగతి తరువాత మాత్రం గీత చదువులో దూసుకుపోయింది. మార్కులే మార్కులు! అంతమాత్రాన చదువే లోకం అనుకోలేదు. హాయిగా ఆటలు ఆడేది. పాటలు పాడేది. గిటార్ వాయించేది. ఫ్యాషన్ షోలలో పాల్గొనేది. గణితం నుంచి సైన్స్ వరకు ఎంత జటిలమైన విషయాన్ని అయిన నాన్న గోపీనాథ్ ఇంట్లో ఉన్న వస్తువులను ఉదహరిస్తూ సులభంగా అర్థమయ్యేలా చెప్పేవాడు. బహుశా గీతకు ఆ లక్షణమే వచ్చి ఉంటుంది. జటిలమైన ఆర్థిక విషయాలను వేగంగా అర్థం చేసుకోవడంలోనే కాదు, వాటిని సులభంగా బోధించడంలో పట్టు సాధించింది. గీత పరిశోధన పత్రాలు టాప్ ఎకనామిక్స్ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ‘యంగ్ గ్లోబల్ లీడర్’ (2011) పురస్కారాన్ని అందుకుంది. 2014లో ‘టాప్ 25 ఎకనామిస్ట్స్ అండర్ 45’ జాబితాలో చోటు సంపాదించింది. భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అందుకుంది. ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకనామిస్ట్‌గా పనిచేసిన గీత ప్రస్తుతం ఐఎంఎఫ్–డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో ఉంది. -
డిజిటల్ కరెన్సీపై ఆచితూచి నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రతిపాదిత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని ప్రవేశపెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ రంగం, ద్రవ్య పరపతి విధానంపై డిజిటల్ కరెన్సీ ప్రభావాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. రిస్కీ సాధనాలైన క్రిప్టోకరెన్సీలను కట్టడి చేసే విధంగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారిత డిజిటల్ కరెన్సీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టడంపై ఆర్బీఐ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో శంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటివరకూ అధికారికంగా ఎక్కడా డిజిటల్ కరెన్సీ వినియోగంలో లేనందున దాని ప్రభావాలను ముందుగా అంచనా వేయగలిగే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర సెంట్రల్ బ్యాంకులు కూడా దీని విషయంలో క్రమానుగతంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. సీబీడీసీలతో ఒనగూరే ప్రయోజనాల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ల డిమాండ్‌పై, తత్ఫలితంగా రుణ వితరణ సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం పడవచ్చని శంకర్ అభిప్రాయపడ్డారు. -
మగపిల్లవాడిగా పుట్టి స్త్రీగా మారింది.. ఎక్కడా ఉద్యోగం రాలేదు.. రెండేళ్లపాటు
అభినా ఆహెర్ వయసు 44. ముంబయి వాసి. మగపిల్లవాడిగా పుట్టి స్త్రీగా మారింది. ఎకనమిక్స్ అండ్ డిప్లమో ఇన్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ చేసింది. కానీ ఎక్కడా ఉద్యోగం రాలేదు. కారణం ఆమె సర్టిఫికేట్లో జెండర్ ‘మేల్’ అని ఉంది. ఆమె వస్త్రధారణ, హావభావాలు మహిళలా ఉన్నాయి. ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. కడుపు నింపుకోవడానికి పడుపు వృత్తి ఒక్కటే మార్గమైంది. రెండేళ్ల తర్వాత ఆ వృత్తి నుంచి బయటపడి తనలాంటి వాళ్ల కోసం సర్వీస్ చేసే ఎన్జీవోలో ఉద్యోగంలో చేరింది. తనకంటే అధ్వాన్నమెన జీవితాలెన్నో ఉన్నాయని తెలుసుకుంది. ఆ తర్వాత ట్వీట్ (ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ ఈక్విటీ అండ్ ఎంపవర్మెంట్ ట్రస్ట్) స్థాపించి తనలాంటి వారి హక్కుల పరిరక్షణ కోసం పని చేస్తోంది. ‘చదువుకున్నాం... ఉద్యోగం చేస్తాం... ఉద్యోగం ఇవ్వండి. మా జెండర్‌ని గుర్తించండి’ అని పోరాడుతోంది. రాళ్లతో కొట్టారు అభినా అహెర్కి మూడేళ్ల వయసులోనే తండ్రి పోయాడు. తల్లి మంగళ ముంబయి మున్సిపల్ ఆఫీస్‌లో చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంది. మంగళ జానపద నాట్యకారిణి. నాట్యప్రదర్శనలు ఇస్తూ మరాఠీ సినిమాల్లో చిన్న పాత్రల్లో నటిస్తూ అభిన భవిష్యత్తు కోసం డబ్బు దాస్తుండేది. తల్లి డాన్స్ చేస్తుంటే కళ్లప్పగించి చూసేది అభిన. ఓ రోజు మంగళ ఇంటికి వచ్చేటప్పటికి తల్లి చీర కట్టుకుని, నాట్యకారిణిలా అలంకరించుకుని ఉంది. ‘నీలాగే చేస్తున్నాను చూడు’ అంటూ నాట్యం చేసి చూపించింది. ఆ క్షణంలో కొడుకుని చూసి మురిసిపోయిందా తల్లి. కానీ అదే పనిగా స్త్రీలాగ ఉండడానికి ప్రయత్నం చేయడాన్ని మాత్రం సహించలేకపోయింది. అప్పటికే ఇరుగుపొరుగు ఎగతాళి మొదలైంది. వద్దని ఎంత చెప్పినా వినని కొడుకు పట్ల తృణీకారం మొదలైంది. తన బిడ్డ గుర్తింపు పురుషుడిగా ఉండాలని తల్లి తాపత్రయం, తన గుర్తింపు స్త్రీగా ఉండాలనేది అభిన ఆకాంక్ష. ఎవరు వద్దన్నా, కాదన్నా సమాజం అభినా అహెర్ గుర్తింపును ‘హిజ్రా’ అని నిర్ధారించేసింది. తోటి పిల్లలు ఏడిపించడం, రాళ్లతో కొట్టడం నిత్యకృత్యమైంది. అభిన మానసిక క్షోభ తారస్థాయికి చేరి ఆత్మహత్యకు పాల్పడే వరకు వెళ్లింది. ఇన్ని ఆవేదనల మధ్య గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, 27వ ఏట లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని స్త్రీగా మారిపోయింది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత హార్మోన్లు తగిన మార్పు చెందడానికి కొంత సమయం పట్టింది. ఈ లోపు పరిస్థితులు ఆమె మానసిక ఆరోగ్యాన్ని సవాల్ చేశాయి. అన్నింటికీ ఎదురీది సంపూర్ణ ఆరోగ్యంతో ఉద్యోగాన్వేషణ మొదలుపెట్టింది. అసలైన పరీక్ష మొదలైంది. సందేహంగా దేహాన్ని పరిశీలనగా చూసేవారు. సర్టిఫికేట్లను, దేహాన్ని మార్చి మార్చి చూసి ‘ఉద్యోగం లేదు’ అనేవారు. కొన్నేళ్లపాటు మాట్లాడడం మానేసిన తల్లి... అభిన స్త్రీగా మారిపోయిన తర్వాత నిస్సహాయ స్థితిలో ‘జెండర్ ఏదయితేనేం. నేను కన్నబిడ్డవి. ఇద్దరి బ్లడ్ గ్రూపూ బీ పాజిటివే. మనిద్దరం ఒకటే’ అని కూతురికి ధైర్యం చెప్పి అండగా నిలిచింది. ఇది హక్కుల పోరాటం అభినా అహెర్ తనలాంటి వాళ్ల కోసం పని చేసే హమ్‌సఫర్ ఎన్జీవోలో ఉద్యోగంలో చేరింది. హెల్ప్‌లైన్ నంబర్‌కి వచ్చిన ఫోన్లు రిసీవ్ చేసుకోవడం, బాధితులకు ధైర్యం ఆమె డ్యూటీ. దాదాపుగా ఎనిమిదేళ్లపాటు ఆ ఉద్యోగంలో తనలాంటి వాళ్లు సమాజంలో ఎదుర్కొనే వెతలు ఎన్ని రకాలుగా ఉంటాయో అర్థమైంది. ట్రాన్స్జెండర్ల కోసం చేయాల్సినవి ఎన్నో ఉన్నాయనిపించింది. సొంతంగా 2013లో ట్వీట్ అనే ఎన్జీవో స్థాపించింది. ‘‘ట్రాన్స్‌జెండర్స్‌కి కూడా మిగిలిన అందరిలాగానే అన్ని ప్రాథమిక హక్కులూ వర్తిస్తాయనే వాస్తవాన్ని సమాజం మర్చిపోయింది. విద్య, వైద్యం, ఉపాధి హక్కుల పరిరక్షణ కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. నేను స్థాపించిన ట్వీట్ స్వచ్ఛంద సంస్థ ట్రాన్స్ఉమెన్, ట్రాన్స్మెన్, హెచ్ఐవీ బాధితులకు పునరావాస కేంద్రం మాత్రమే కాదు. వాళ్లకు వాళ్ల చదువు, నైపుణ్యాలను బట్టి ఉపాధి కల్పించే బాధ్యత కూడా నాదే. ఇప్పటి వరకు 250 మందిని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లలో ఉద్యోగంలో చేర్పించాను. మాలో డాన్స్ చేయడానికి ఇష్టపడే వాళ్లందరం కలిసి ‘డాన్స్క్వీన్స్’ బృందంగా ఏర్పడ్డాం.. వేడుకల్లో నాట్యం చేసి ఆ వచ్చిన డబ్బుతో సంస్థను నడపడానికి ఎల్జీబీటీల సహాయం కోసం ఖర్చు చేస్తున్నాం’’ అని చెప్పింది అభినా ఆహెర్. మా అమ్మ కూడా మాతోపాటు నాట్యం చేస్తోందని సంతోషంగా చెప్పింది అభిన. ‘నాట్యం మా తొలి అడుగు మాత్రమే. మా హక్కుల పరిరక్షణ కోసం, జెండర్ మార్చుకున్న వెంటనే మా సర్టిఫికేట్లన్నీ మార్చి ఇచ్చేవిధంగా ప్రభుత్వంలో చట్టాల రూపకల్పన కోసం ఉద్యమించడమే మా అసలు లక్ష్యం. సాధించి తీరుతాం’ అని ముక్త కంఠంతో చెబుతున్నారు ట్వీట్ సభ్యులు. -
లాభాలంటే ఇష్టం.. నష్టాలంటే కష్టం
ఆర్థిక శాస్త్రానికి సంబంధించి రెండు విరుద్ధమైన సూత్రాలున్నాయి. ఒకటి సహేతుక నడవడిక. అంటే తమకు నష్టాన్ని కలిగించే లేదా తటస్థ నిర్ణయాలు కాకుండా.. ప్రయోజనం కలిగించే నిర్ణయాలను తీసుకోవడం. మరింత వివరంగా చూస్తే.. ఈ తరహా వ్యక్తులు తమపై, తమ మనసుపై నియంత్రణ కలిగి ఉంటారు. భావోద్వేగాలతో ఊగిపోరు. బిహేవియరల్ ఫైనాన్స్ మాత్రం.. ప్రజలు భావోద్వేగాలతో ఉంటారని.. సులభంగా దారితప్పడమే కాకుండా.. హేతుబద్ధంగా వ్యవహరించలేరని చెబుతోంది. సహేతుకంగా వ్యవహరించడానికి బదులు.. తరచుగా ఆర్థిక నిర్ణయాల విషయంలో తమ భావోద్వేగాలు, ఆలోచనలకు తగ్గట్టు పక్షపాతంగా వ్యవహరిస్తారని అంటోంది. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లను పరిశీలిస్తే ఈ రెండింటిలో బిహేవియరల్ ఆర్థిక శాస్త్రం చెప్పిందే నిజమని అనిపిస్తుంటుంది. పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లపై ప్రభావం చూపించే అంశాలపై అవగాహన కలి్పంచే కథనమే ఇది... 1970, 1980ల్లో విడుదలైన పలు ఆర్థిక అధ్యయన పత్రాలు అన్నీ కూడా.. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు పెట్టుబడుల విషయాల్లో సహేతుకంగానే వ్యవహరిస్తారని చెప్పగా.. దీనికి విరుద్ధంగా అదే కాలంలో ప్రముఖ సైకాలజిస్టులు డానియల్ కహెన్‌మాన్, అమోస్ ట్వెర్స్కీ మాత్రం.. ఆర్థికవేత్తలు చెప్పినట్టు సహేతుక నిర్ణయాలను కొద్ది మందే తీసుకుంటున్నట్టు గుర్తించారు. ప్రజలు నిజంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై వీరు అధ్యయనం చేశారు. 80వ దశకం చివరి నాటికి ఆర్థికవేత్తల ఆలోచనా ధోరణిని సైకాలజిస్టులు ప్రభావితం చేయడం మొదలైంది. ఇది బిహేవియరల్ ఆర్థిక శాస్త్రానికి దారితీసిందని చెబుతారు. 2002లో డానియల్ కహెన్‌మాన్ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఇన్వెస్టర్లు ఆర్థిక వేత్తలు చెప్పినట్టు కాకుండా.. సైకాలజిస్టులు అంచనా వేసినట్టుగానే ప్రవర్తిస్తుంటారని కహెన్‌మాన్ శిష్యుడైన ఓడియన్ సైతం అంటారు. ‘‘అతి విశ్వాసం, పరిమిత శ్రద్ధ, కొత్తదనం కోసం పాకులాడడం, నష్టపోకూడదన్న తత్వం, అత్యుత్సాహం అన్నవి ఇన్వెస్టర్ల ప్రవర్తనను, ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తున్నాయని నేను గుర్తించాను’’ అని ఓడియన్ పేర్కొన్నారు. ‘‘పెట్టుబడులు అంటేనే క్లిష్టమైన అంశం. మనుషులు ఈ విషయంలో అసంపూర్ణంగా వ్యవహరిస్తుంటారు. నిర్ణయాల్లో తప్పులకు అవకాశం ఉంటుంది’’అని బిహేవియరల్ ఫైనాన్స్‌లో విస్తృత అధ్యయనం చేసిన కెనడియన్ ఆర్థికవేత్త అగ్రీడ్ హెర్‡్ష షెఫ్రిన్ (శాంతా క్లారా యూనివర్సిటీ) అంటారు. అటు ఆర్థికవేత్తలు, ఇటు మనస్వత్త శాస్త్రవేత్తలు ఎన్నో అధ్యయనాల ఆధారంగా అంగీకారానికి వచ్చిన విషయం.. పెట్టుబడుల విషయంలో మనుషుల మనస్తత్వం, ఆలోచనలు కీలక పాత్ర పోషిస్తాయని. సెబీ నమోదిత పెట్టుబడుల సలహాదారు చెంతిల్ అయ్యర్ (హోరస్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్) కూడా ఇదే విషయాన్ని అంగీకరిస్తారు. ‘‘క్లిష్టమైన అంశాల విషయంలో సత్వర పరిష్కారాలను ఇన్వెస్టర్లు కోరుకుంటారు. ఫలితంగా నిర్ణయాల్లో ఎన్నో తప్పులు దొర్లుతుంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల చర్యలపై మానసిక ప్రభావాన్ని.. అలాగే, తార్కిక, భావోద్వేగ, సామాజిక అంశాల ప్రభావాన్ని వివరించేదే బిహేవియరల్ ఫైనాన్స్. పెడచెవిన వాస్తవాలు ఇన్వెస్ట్మెంట్లు, లాభాల స్వీక రణపై అస్పష్ట మానసిక స్థితి తో పాటు, జరుగు తున్న వాస్తవా లను, హెచ్చరికలను పెడచెవిన బెట్టడం మెజారిటీ ఇన్వెస్టర్లకు మామూలే. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి ఇన్వెస్టర్లను అడిగినప్పుడు.. ఆ సంక్షోభం తాలూకూ సంకేతాలను ముందే గుర్తించామని చెబుతారు. కానీ, ఆయా సంక్షోభాలపై నిపుణుల హెచ్చరికలను మెజారిటీ ఇన్వెస్టర్లు పట్టించుకోకపోవడాన్ని గమనించొచ్చు. అం తెందుకు.. 2020 జనవరి నుంచే చైనాలో ఒక భయంకరమైన (కోవిడ్–19) వైరస్ వెలుగు చూసిందని.. అది ప్రపంచమంతా వ్యాప్తి చెందొచ్చన్న వార్తలను ఎవ్వరూ పట్టించుకోలేదన్నది కూడా వాస్తవం. అధిగమించడం ఎలా..? పెట్టుబడుల విషయంలో పలు ప్రతికూల, అస్పష్ట మానసిక స్థితి, వైఖరులను అధిగమించడం నిజానికి కష్టమైన పనే. ఎందుకంటే మానవులు సాధారణంగానే సంపూర్ణ కచ్చితత్వంతో ఉండరన్నది మనస్తత్వ శాస్త్రవేత్తల అభిప్రాయం. కాకపోతే ఈ తరహా అంశాల విషయంలో కాస్త మెరుగ్గా వ్యవహరించేందుకు ప్రయత్నించొచ్చని చెబుతారు. వీటిని అధిగమించేందుకు మంచి అలవాట్లను ఆచరణలో పెట్టుకోవాల్సి ఉంటుంది. విస్తృతమైన సమాచార పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటే.. ఈ తరహా ధోరణుల్లో పడిపోకుండా కాపాడే మంచి ఆయుధం అవుతుంది. ఇన్వెస్టర్ ముందుగా తన గురించి తాను పూర్తిగా తెలుసుకోవాలి. తన గురించి స్నేహితులను అడిగి తెలుసుకోవాలి. ఇతర ఇన్వెస్టర్ల ధోరణులను విశ్లేషించాలి. అప్పుడు తన ఆలోచనా తీరుపై అంచనాకు రావాలి. ఇన్వెస్టర్లు తమ గురించి మరింత అర్థం చేసుకునేందుకు ఇది సహకరిస్తుందన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో.. భావోద్వేగాలు, ముందుగా అనుకున్న మానసికమైన సిద్ధాంతాలు అడ్డుపడకుండా ఇది సాయపడుతుందని చెబుతారు. చాలా మంది ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఏమిటంటే.. వైవిధ్యమైన పెట్టుబడులను ఏర్పాటు చేసుకుని దీర్ఘకాలం పాటు కొనసాగించుకోవాలే కానీ.. స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చేయకూడదు. తక్కువ వ్యయాలు (ఎక్స్పెన్స్ రేషియో) ఉండే æ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లు వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో ఏర్పాటుకు చక్కని మార్గం. తాజా అంశాలపై దృష్టి ‘‘మెజారిటీ ఇన్వెస్టర్లు తాజా రాబడులకు ప్రాధాన్యం ఇస్తారే కానీ, చారిత్రక రాబడులకు కాదు’’ అని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోరి్నయా ప్రొఫెసర్ టెర్నాన్స్ ఓడియన్ అంటారు. అంటే ఇటీవలి కాలంలో మంచి పనితీరు చూపించిన స్టాక్స్ లేదా ఇతర ఆస్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ, ఆయా స్టాక్స్, ఆస్తుల పనితీరు అంతకుముందు కాలంలో ఎలా ఉన్నా పట్టించుకోనట్టు వ్యవహరిస్తారు. ఎక్కువ సంఖ్యలో ఇన్వెస్టర్లు రాబడుల వెంట పడినప్పుడు ఆయా స్టాక్స్ ధరలు స్వల్ప కాలంలోనే గణనీయంగా పెరిగిపోవడానికి దారితీస్తుంది. దీని కారణంగా దీర్ఘకాలంలో రాబడులు తక్కువగా ఉండచ్చు. నష్టాలకు కారణం పరిమిత దృష్టి ఉండడం వల్ల ఇన్వెస్టర్లు వారి దృష్టిలో పడిన స్టాక్స్‌ను కొనుగోలు చేస్తారు. కొనుగోళ్లకే కానీ.. విక్రయించడంపై ఈ ప్రభావం తక్కువగా ఉంటుంది. దీని ఫలితం ఎక్కువ మంది ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపే ఉంటారు. ‘‘తమను ఆకర్షించిన స్టాక్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. దీంతో ఆయా స్టాక్స్ ధరలపై ఇది తాత్కాలిక ఒత్తిళ్లకు దారితీస్తుంది. ఇలా ధరలు పెరిగిపోయిన స్టాక్స్‌ను కొనుగోలు చేయడం వల్ల.. అనంతరం వాటి ధరలు అమ్మకాల ఒత్తిడికి పడిపోవడంతో నష్టాల పాలవుతుంటారు’’అని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోరి్నయా ప్రొఫెసర్ టెర్నాన్స్ ఓడియన్ వివరించారు. ఏకపక్ష ధోరణి మనలో చాలా మంది సమాచార నిర్ధారణలో ఏకపక్షంగా వ్యవహరిస్తుంటామనేది కాదనలేని నిజం. ఈ ధోరణి కారణంగా మనకు ఫలానా కంపెనీకి సంబంధించి అప్పటికే తెలిసిన సమాచారంపైనే ఆధారపడతామే తప్పించి.. మన నమ్మకాలకు విరుద్ధంగా వచ్చే తాజా సమాచారాన్ని స్వీకరించలేని పరిస్థితుల్లో ఉంటాం. ఉదాహరణకు ఎక్స్ అనే కంపెనీకి సంబంధించిన వ్యాపారం, ఆర్థిక అంశాలు నచ్చి ఇన్వెస్ట్ చేశారనుకోండి. అదే కంపెనీ వ్యాపారానికి సంబంధించి వెలుగులోకి వచ్చే కొత్త అంశాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుంటాం. ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టేస్తాం. ఇది నష్టాలకు దారితీస్తుంది. నష్టపోకూడదనే తత్వం ‘రాబడి కోసం పెట్టుబడి పెడతాం.. కనుక నష్టపోయే సందర్భమే వద్దు’ అన్నది చాలా మంది ఇన్వెస్టర్లలో ఉండే ధోరణి. దీంతో రాబడులు ఎలా సంపాదించుకోవాలన్న అంశానికంటే నష్టపోకుండా ఎలా ఉండాలన్న దానిపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ ఒక తప్పుడు పెట్టుబడి నిర్ణయం తీసుకున్నాడని అనుకుంటే.. నష్టం బుక్ చేసుకోవద్దన్న ధోరణితో అందులోనే కొనసాగుతుంటారు. ఒకవేళ పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే నష్టపోయినట్టు అవుతుందని వారి ఆందోళన. నిజానికి అలాగే కొనసాగితే మిగిలినది కూడా నష్టపోవాల్సి వస్తుందేమో? అన్న ఆలోచనను వారు అంగీకరించరు. -
ముగ్గురికి ఆర్థిక నోబెల్
స్టాక్‌హోం: కనీస వేతనాల పెంపుదల ఫలితాలను విశ్లేషించిన అమెరికాకు చెందిన డేవిడ్ కార్డ్‌కు ఈ ఏడాది ప్రఖ్యాత నోబెల్ బహుమతి లభించింది. మరో ఇద్దరు ఆర్థికవేత్తలతో కలిసి ఆయన ఈ బహుమతిని పంచుకోనున్నారు. కార్డ్‌తో పాటు అమెరికాకే చెందిన జాషువా ఆంగ్రిస్ట్, గైడో ఇంబెన్స్‌లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అందిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. బహుమతి మొత్తంలో సగాన్ని డేవిడ్ కార్డ్‌కు, మిగతా సగాన్ని జాషువా, గైడోకు అందజేస్తారు. లేబర్ మార్కెట్, వలసలు, విద్యపై కనీస వేతనాల ప్రభావాన్ని కార్డ్ విశ్లేషించారు. అలాగే ఆర్థిక శాస్త్రానికి సంబంధించి విశ్లేషణాత్మకమైన పరిశోధనలపై సహకారం అందించినందుకు జాషువా, గైడోలకు కూడా పురస్కారం ఇస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ తెలిపింది. సామాజికంగా ఎదురయ్యే పలు ప్రశ్నలకు తమ సహజ పరిశోధనలతో సమాధానమివ్వొచ్చని శాస్త్రవేత్తలు డేవిడ్, జాషువా, ఇంబెన్స్ రుజువు చేశారని అకాడమీ ప్రశంసించింది. వీరు ఆవిష్కరించిన ‘సహజ ప్రయోగాలు’.. వాస్తవ జీవిత పరిస్థితులు ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని పేర్కొంది. కనీస వేతనాల పెంపుతో ఉద్యోగాల్లోసైతం పెరుగుదల నమోదైందని అమెరికాలో డేవిడ్ కార్డ్ చేసిన అధ్యయనంతో తెలియవచ్చింది. సామాజిక శాస్త్రంలోని కార్యకారణ ప్రభావంతో సామాజిక శాస్త్రంలోని పెద్ద సమస్యలకు సైతం పరిష్కారాలు లభిస్తాయనే విషయాన్ని ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు నిరూపించారని నోబెల్ అకాడమీ పేర్కొంది. గత ఏడాది అర్థిక శాస్త్రంలో పాల్ ఆర్.విుల్‌గ్రామ్, రాబర్ట్ బి.విల్సన్ సంయుక్తంగా నోబెల్ బహుమతి అందుకున్నారు. చదవండి: తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించనున్న దినేష్ కార్తీక్...! ఏమిటీ పరిశోధన? ప్రొఫెసర్ డేవిడ్ కార్డ్ 1980వ దశకంలో అలెన్ క్రూగర్‌తో కలిసి కనీస వేతనాలపై పరిశోధన సాగించారు. ఇందుకోసం న్యూజెర్సీలోని రెస్టారెంట్లను ఎంచుకున్నారు. కనీస వేతనాన్ని 4.25 డాలర్ల నుంచి 5.05 డాలర్లకు పెంచినప్పుడు, పెంచకముందు నాటి పరిస్థితుల గురించి నిశితంగా అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయని కార్డ్ చెప్పారు. అందరూ అనుకుంటున్నట్లుగా కనీస వేతనాల పెంపు వల్ల ఉద్యోగాలేవీ పోలేదని ఆయన తెలిపారు. అయితే, తమ అధ్యయన ఫలితాలను తొలుత ఎవరూ నమ్మలేదని అన్నారు. అమెరికాలో దేశీయ ఉద్యోగాలపై వలసలు చూపే ప్రభావంపైనా ఆయన అధ్యయనం చేశారు. డేవిడ్ కార్డ్‌కు మిత్రుడైన అలెన్ క్రూగర్ గతంలోనే నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు. అలెన్ క్రూగర్ 58 ఏళ్ల వయసులో 2019లో మరణించారు. BREAKING NEWS: The 2021 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel has been awarded with one half to David Card and the other half jointly to Joshua D. Angrist and Guido W. Imbens.#NobelPrize pic.twitter.com/nkMjWai4Gn — The Nobel Prize (@NobelPrize) October 11, 2021 చదవండి: D-Mart: ఆకాశమే హద్దుగా డీమార్ట్ దూకుడు...! -
డ్యాషింగ్ అడ్వైజర్
ఐక్యరాజ్య సమితి అంటేనే హై లెవల్. అందులోని ‘హై లెవల్ అడ్వైజరీ బోర్డ్’ (హెచ్.ఎల్.ఎ.బి.) అంటే ఐక్యరాజ్య సమితి కన్నా హై లెవల్! సమితికి ఏ విషయంలోనైనా మార్గదర్శనం చేసేందుకు ఆ బోర్డులోని సభ్యులు తగిన సలహాలు, సూచనలు ఇవ్వగలిగిన మేధావులు, విద్యావంతులు అయి ఉంటారు. ఆ టీమ్‌లో తాజాగా భారతదేశ ఆర్థికవేత్త జయతీ ఘోష్‌కు స్థానం లభించింది! కొన్నాళ్లుగా యూఎస్‌లోనే మసాచుసెట్స్‌లో ఉంటున్నారు జయతి. ఇప్పుడిక సలహా బృందంలో సభ్యురాలు అయ్యారు అట్నుంచటు విమానంలో అరగంట ప్రయాణదూరంలో ఉండే న్యూయార్క్‌లోని సమితి ప్రధాన కార్యాలయానికి త్వరలోనే ఆమె తన బుక్స్ సర్దుకుని వెళ్లబోతున్నారు. ఆ బుక్స్ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని అర్థం చేసుకోడానికి జయతి అధ్యయనం చేస్తూ వస్తున్నవి మాత్రమే కాదు, జయతి రూపొందించిన వివిధ దేశాల అభివృద్ధి ప్రణాళికల సమగ్ర నివేదికలు కూడా. ప్రభుత్వాలకు అవి పరిష్కార సూచికలు. ప్రస్తుతం ఆమ్‌హర్ట్స్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్’లో ఎకమిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు జయతి ఘోష్. అక్కడికి వెళ్లడానికి ముందు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జె.ఎన్.యు.) లో 35 ఏళ్ల పాటు ఆర్థికశాస్త్రాచార్యులుగా ఆమె పని చేశారు. ఇప్పుడు సమితి సలహా బృందానికి ఆమె పేరును ప్రతిపాదించినది వేరెవరో కాదు. ఐక్యరాజ్యసమితిలోని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ సోషల్ అఫైర్స్’! జయతికి హ్యూమనిస్ట్ ర్యాడికల్ అనే పేరు ఉన్నప్పటికీ ఆ ర్యాడికల్ అనే పేరును పక్కన పెట్టి, ఆమెలోని హ్యూమనిస్టుని మాత్రం సమితి తీసుకున్నట్లుంది. లేదా, దేశాల ఆర్థికస్థితిని మెరుగు పరిచి సామాజిక జీవనాలను సరళతరం చేయడానికి జయంతి సూచించే కఠినతరమైన ఆర్థిక వ్యూహాలను అనుసరించాలని నిశ్చయించుకుని ఉండొచ్చు. 2030 నాటికి ప్రపంచంలోని పేద దేశాలన్నీ శుభ్రమైన తిండి, బట్ట కలిగి ఉండాలని సమితి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. అందుకోసం రెండేళ్ల క్రితం ఎకనమిక్స్, సోషల్ అఫైర్స్ విభాగం ‘యు.ఎన్. హై–లెవల్ అడ్వయిజరీ బోర్డు’ను ఏర్పాటు చేసుకుంది. ఆ బోర్డు కాల పరిమితి రెండేళ్లు. అది పూర్తవడంతో ఇప్పుడు రెండో అడ్వయిజరీ బోర్టు అవసరమైంది. ఇందులో ఆర్థిక, సామాజిక అంశాలలో అంతర్జాతీయంగా నిపుణులు, అధ్యయనవేత్తలైన పలు రంగాల ప్రసిద్ధులు మొత్తం 20 మంది సభ్యులుగా ఉంటారు. వారిలో 65 ఏళ్ల జయతీ ఘోష్ ఒకరు. ∙∙ జె.ఎన్.యు.లో చదివి, జె.ఎన్.యు.లోనే పాఠాలు చెప్పారు జయతి. ఎకనమిక్స్‌లో ఎం.ఎ., ఎంఫిల్ ఆమె. పిహెచ్.డిని ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేశారు. సలహా బోర్డు సభ్యురాలుగా ఇక ఆమె ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గ్యుటెరస్‌కు వివిధ దేశాల వర్తమాన, భావి ఆర్థిక పరిస్థితులను మెరుగు పరిచేందుకు అవసరమైన ప్రణాళికా విధానాలను సూచించవలసి ఉంటుంది. అదేమీ ఆమెకు కష్టమైన సంగతి కాబోదు. ప్రజల్లో తిరిగిన మనిషి. విద్యార్థులతో కలిసిమెలిసి ఉన్న ప్రొఫెసర్. డెవలప్మెంట్ ఎకనమిస్ట్. ఆమె భర్త అభిజిత్ భారతదేశ ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు. జయతి ఎప్పుడూ కూడా ప్రభుత్వాలవైపు లేరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు పిడికిలి బిగించిన ప్రతి ఉద్యమంలోనూ జయతి నినాదం ఉంది. మొన్నటి ఢిల్లీ సి.ఎ.ఎ. అల్లర్లలో ప్రేరేపకులుగా పోలీస్‌లు దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్లో సీతారాం ఏచూరి, యోగేంద్ర యాదవ్‌ల పేర్లతో పాటు జయతి పేరు కూడా ఉంది. అలాగని ప్రభుత్వాలు ఆమెకు ఇవ్వవలసిన గుర్తింపును ఇవ్వకుండా ఏమీ లేవు. జెనీవాలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్.ఓ.) 2010 లో ఆమెకు ‘డీసెంట్ వర్క్ రిసెర్చ్ ప్రైజ్’ను అందించింది. యు.ఎన్.డి.పి. ‘ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనాలిసిస్’ అవార్డును ప్రకటì ంచింది. సమితి సలహాదారుగా ఇప్పుడు ఆమెకు లభించించీ అవార్డులాంటి ప్రతిష్టే. -
నది దాహం
కిష్వర్ నషీద్ ఇరవయ్యో శతాబ్దపు గొప్ప స్త్రీవాద రచయిత్రి. గత ఏడాది జూన్‌తో ఎనభై ఏళ్లు నించిన కిష్వర్ పుట్టింది ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ శహర్ లో. దేశ విభజన అనంతరం వారి కుటుంబం పాకిస్థాన్‌లోని లాహోర్‌కు వెళ్లింది. అక్కడ ఆమె ఉర్దూ, పర్షియా భాషలు చదువుకున్నారు. ఇల్లు దాటి బయటకు వెళ్లడానికి ఆడపిల్లలను అనుమతించని రోజుల్లో చదువు కోసం కిష్వర్ పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఇంట్లోనే ఉండి చదువుకుంటూ మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత చదువు కొనసాగించడానికి ఇంట్లో పెద్ద సమావేశం... సుదీర్ఘ చర్చ. ఎట్టకేలకు ఆమె కాలేజ్‌లో చేరగలిగారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారామె. ఆమె రచనా వ్యాసంగం 1968లో మొదలైంది. పన్నెండు స్వీయ రచనలతోపాటు అనేక అనువాద రచనలు కూడా చేశారామె. ఆమె కలం నుంచి జాలువారిన గజల్లకు లెక్కే లేదు. ప్రపంచ సాహిత్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు కిష్వర్. ఆమె రచనలు ప్రధానంగా మహిళలను ఒత్తిడికి గురి చేస్తున్న మతపరమైన విధానాల మీదనే సాగేవి. స్టార్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డు, సాహిత్య విభాగంలో లైఫ్ టైమ అచీవ్మెంట్ అవార్డులతోపాటు ఇతర పురస్కారాలను కూడా అందుకున్నారు. గత ఏడాది కోవిడ్ బారిన పడి కోలుకున్న నషీద్ కోవిడ్ బారిన పడిన సమాజాన్ని అక్షరబద్ధం చేశారు. ‘దర్యా కీ తిష్ణాగీ(నది దాహం)’ పేరుతో ఉర్దూలో విడుదల చేసిన సంకలనంలో ఆమె కరోనా బారిన పడిన సమాజంలో ఆమె గమనించిన విషయాలను ప్రస్తావించారు. ఆ కవిత సారాంశం క్లుప్తంగా... డబ్బాలు నిండే రోజు ‘‘కరోనా ఆర్థిక వ్యవస్థను నిలువుగా చిదిమేసింది. ఇల్లు దాటి కాలు బయటపెట్టకపోతే రోజు గడవదు, కాలు బయటపెట్టినా పని కనిపించదు. ‘ఎవరినీ తాకవద్దు– సామాజిక దూరం పాటించాలి’ అనే మాటలను వింటూనే రోజులు వెళ్లిపోతున్నాయి. మధ్య తరగతి ఎట్టకేలకు సొంతం చేసుకున్న కారును కరోనా అమ్మేసింది. ఇంటి నుంచే పని చేయమని కోరుతోంది ప్రపంచం. ఇంట్లో కూర్చుని చేసే పనులు కాని వృత్తుల్లో వాళ్లకు పని చేసే దారి మూసుకుపోయింది. ఇంట్లో దినుసుల డబ్బాలు ఎప్పుడు ఖాళీ అయిపోతాయోనని భయం. అప్పటికే ఖాళీ అయిన డబ్బాలు... నిండే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ రోజులు లెక్కపెట్టుకుంటున్నాయి. ఎవరి ముందూ చేయి చాచలేని మొహమాటం, అగ్గిపుల్లను కూడా అరువడగలేని ఆత్మగౌరవం. పిల్లల్ని ఇంట్లోనే అట్టి పెట్టుకోవాలి, ఏమీ తోచక ఏడుస్తున్న పిల్లలను రోజంతా సంతోషపెట్టాలి. ఇంటి పద్దులు చూసుకుంటూ అరుచుకుంటూ పరస్పరం కోపంతో విరుచుకుపడుతూ భార్యాభర్తలిద్దరూ అలసిపోతున్నారు. ఎవరినీ ఏమీ అడగడం చేతరానితనం, అడగడానికి అడ్డుపడే గౌరవాల మధ్య జీవితాలు నలిగిపోతున్నాయి. వాస్తవాలను అర్థం చేసుకున్న వృద్ధతరం మాత్రం ఈ కరోనా కష్టకాలానికి వారి జీవితానుభవాలను జోడించుకుని కొత్త భాష్యం చెప్పుకుంటోంది. ఇది ఇలా ఉంటే... ఇదే ఏడాది పాకిస్థాన్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కొనుగోలు జరిగింది. వార్ధక్యంలో వివాహం జరిగింది. వరుడు వివాహవేదికకు కిలో బంగారంతో వచ్చాడు. యూరప్ దేశాల వాళ్లు బాల్కనీలో నిలబడి గిటార్ వాయిస్తూ గడిపారు. కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. నలుగురు మనుషులున్న కుటుంబం కనిపించడం కష్టమైంది. సంగీతంలో శ్రావ్యతలన్నీ ఏకమయ్యాయి కానీ పాటలే వేరయ్యాయి. గోడను మరొక గోడ కలుపుతోంది. గోడల ఆలంబనతో జీవిస్తున్న ఇరుగుపొరుగు మధ్య పలుకు భయం మాటున మూగబోయింది. మౌనంగా సంభవించిన మరణాలు... పూడ్చి పెట్టిన బారులు చైనా గోడలాగ ఆకాశం నుంచి కూడా కనిపిస్తాయి. కరోనా దూసుకుపోతోంది... మానవత్వం మరణిస్తోంది... ఏడాది దాటి పోయింది’’. -
ఆర్థికశాస్త్రంలో నోబెల్ విజేతలు వీరే
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ఆర్థిక శాస్త్రవేత్తలు పాల్ ఆర్ మిల్గ్రామ్, రాబర్ట్ బి విల్సన్‌లను వరించింది. వేలం సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడం, కొత్త వేలం విధానాలను కనుగొన్నందుకు గానూ వీరద్దరికి ఈ ఏడాది ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. వేలం ప్రతిచోటా ఉంది . అది దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. పాల్ మిల్గ్రామ్, రాబర్ట్ విల్సన్ వేలం సిద్ధాంతాన్ని మెరుగుపరిచారు కొత్త వేలం ఆకృతులను కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమ్మకందారులకు, కొనుగోలుదారులకు, పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుస్తున్నారని అకాడమీ వ్యాఖ్యానించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు 10 మిలియన్ క్రోనా (1.1 మిలియన్ డాలర్లు) నగదు బహుమతి, బంగారు పతకం లభిస్తుంది. (అప్పటికి 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా భారత్) ప్రపంచవ్యాప్తంగా అమ్మకపుదారులకు, వినియోగదారులకు, టాక్స్ పేయర్స్‌కు లబ్ది చేకూర్చేలా వేలం సిద్దంతాన్ని సరళీకరించడమే కాకుండా, కొత్త వేలం విధానాలను ఆవిష్కరించిన పాల్ ఆర్ మిల్గ్రామ్, రాబర్ట్ బి విల్సన్‌కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అందజేస్తున్నామని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీ జనరల్ గోరన్ హాన్సన్ ప్రకటించారు. రాబర్ట్ విల్సన్.. కామన్ వాల్యూతో వస్తువులను వేలం విధానాన్ని అభివృద్ది చేశారు. మరోవైపు పాల్ మిల్గ్రామ్, వేలం సిద్ధాంతాన్ని మరింత సరళీకరించారు. కేవలం కామన్ వాల్యూ మాత్రమే కాకుండా ఒక బిడ్డర్ నుంచి మరో బిడ్డర్ మారేలా ప్రైవేటు వాల్య్సూను అనుమతించారు. కాగా ఆల్ ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం 1969 నుంచి ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురస్కారం ఇస్తున్నారు. గత ఏడాది ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రదానం చేయగా వీరిలో భారతీయ అమెరికన్ అభిజిత్ బెనర్జీ ఉన్న సంగతి తెలిసిందే. -
అపుడు దోసానామిక్స్, ఇపుడు థాలినామిక్స్
సాక్షి, న్యూఢిల్లీ: ఎకనామిక్ సర్వే 2019-20లో ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ తన గురువు, ఆర్బీఐ మాజీ గవర్నరు రఘురామ రాజన్ ఫాలో అయ్యారు. గతంలో రాఘురామ రాజన్ దోసానిమిక్స్ (2016 బడ్జెట్ , ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు)లో ద్రవ్యోల్బణం సైలెంట్ కిల్లర్ అని చెబితే.. తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) లో మాజీ అసోసియేట్ ప్రొఫెసర్ కేవీ సుబ్రమణియన్ నేతృత్వంలోని కమిటీ రూపొందించిన ఆర్థిక సర్వేలో థాలినోమిక్స్ డిన్నర్ టేబుల్‌పై ఆహారం ఆర్థికశాస్త్రం ఎలా ప్రభావితం చేస్తుందో తెలియచెప్పడానికి ప్రయత్నించింది. గత13 ఏళ్లలో వెజిటేరియన్-నాన్వెజిటేరియన్ కొనుగోలు శక్తి ఎంత పెరిగిందో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన సర్వేలో వివరించారు 'థాలినామిక్స్: ది ఎకనమిక్స్ ఆఫ్ ఏ ప్లేట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఇండియా' పేరుతో దీనిని ఆర్థిక సర్వేలో ప్రత్యేకంగా పేర్కొంది. దీని ఆధారంగా పై కొనుగోలు శక్తిని తెలిపింది. 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారు 80 కేంద్రాల్లో వినియోగదారుల ధరల సూచిక నుండి వచ్చిన డేటాను ‘థాలి’ ఖర్చుతో ఏప్రిల్ 2006 నుంచి అక్టోబర్ 2019 మధ్య కొనుగోలు వివరాలను ఈ సర్వే విశ్లేషించింది. భారతదేశం అంతటా ఒక థాలి (ఒక భోజనం) కోసం ఒక సాధారణ వ్యక్తి చెల్లించే మొత్తాన్ని లెక్కించే ప్రయత్నమని ఎకనామిక్ సర్వే పేర్కొంది. థాలి రేట్ల ఆధారంగా ఆర్థిక రంగంలో నెలకొన్న ఒడిదుడుకులపై అంచనా వేస్తూ 2006-07 నుంచి 2019-20 మధ్య వెజిటేరియన్ థాలి రేటులో 29 శాతం పెరుగుదల, నాన్ వెజిటేరియన్ థాలిలో 18 శాతం పెరుగుదల నమోదయినట్లు ఈ సర్వే పేర్కొంది. ఈ సర్వే ప్రకారం రోజుకు రెండుసార్లు వెజిటేరియన్ థాలీ తీసుకునే ఐదుగురు వ్యక్తులు కలిగిన ఓ కుటుంబం ఏడాదిలో సగటున రూ.10,887 సంపాదిస్తోందనీ, నాన్ వెజిటేరియన్ కుటుంబం రూ.11,787గా ఉందని పేర్కొంది. సగటున పారిశ్రామిక కార్మికుడి వార్షిక ఆదాయాన్ని బట్టి చూస్తే 2006-07 నుంచి 2019-20 మధ్య శాఖాహార థాలి కొనుగోలు శక్తి 29 శాతం, మాంసాహార థాలి శక్తి 18 శాతం మెరుగుపడింది. వెజిటేరియన్ థాలిలో తృణధాన్యాలు, సబ్జీ, పప్పు వడ్డిస్తారు. నాన్ వెజిటేరియన్ థాలీలో తృణధాన్యాలు, సబ్జీ, మాంసాహారం వడ్డిస్తారు. భారత్‌లోని నాలుగు ప్రాంతాలు... ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ప్రాంతాల్లో 2015-16 నుంచి వెజిటేరియన్ థాలీ ధరలు క్రమంగా తగ్గాయి. కానీ 2019లో మాత్రం పెరిగాయి. ఇటీవలికాలంలో భోజనం ధరను తెలుసుకోవడానికి సర్వే ప్రయత్నించడం ఇదే మొదటిసారి. #EcoSurvey2020 #WealthCreation: Despite the rise in prices this year, thalis have become more affordable in India compared to 2006-07. (3/3) #Thalinomics @FinMinIndia @PIB_India @nsitharamanoffc pic.twitter.com/eT3u4nPb7U — K V Subramanian (@SubramanianKri) January 31, 2020 -
10 రోజులు తిహార్ జైలులో ఉన్నా: అభిజిత్ బెనర్జీ
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయుడు అభిజిత్ బెనర్జీకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి వినూత్న కోణంలో పరిశోధనలు చేసి.. విప్లవాత్మక మార్పులు తెచ్చినందుకు గాను ఈ పురస్కారం వరించింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆర్థికవేత్తలు ప్రొఫెసర్ నిర్మల, దీపక్ బెనర్జీలకు 1961లో కోల్‌కతాలో అభిజిత్ బెనర్జీ జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా భారత్‌లోనే సాగింది. ప్రపంచంలోనే అత్యుత్తమ నోబెల్ పురస్కారం అందుకున్న ఈ ఆర్థికవేత్త ఒకప్పుడు కరుడుగట్టిన నేరస్తులను ఉంచే తిహార్ జైలులో గడిపారంటే ఆశ్చర్యపోక తప్పదు. ఏదో పెద్ద నేరం చేసి తిహార్ జైలుకు వెళ్లి ఉంటారని భావిస్తే.. పొరపాటే. విద్యార్థి సంఘం నాయకుడికి మద్దతుగా ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు గాను ఇతర విద్యార్థులతో పాటు అభిజిత్ కూడా తిహార్ జైలులో గడపాల్సి వచ్చింది. ఈ సంఘటన 1983లో చోటు చేసుకుంది. మూడేళ్ల క్రితం ఓ ఆంగ్ల పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో అభిజిత్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘జేఎన్‌యూలో ఓ విద్యార్థి సంఘం నాయకుడిని బహిష్కరించారు. ఇందుకు నిరసనగా విద్యార్థులందరూ వైస్ చాన్సిలర్‌ను ఘెరావ్ చేశాం. దాంతో నాతోపాటు మరికొందరు విద్యార్థులపై కేసు నమోదు చేసి 10 రోజుల పాటు తిహార్ జైలులో ఉంచారు. మమ్మల్ని కొట్టారు. అంతేకాక మా మీద రాజద్రోహం నేరమే కాక హత్యానేరాన్ని కూడా మోపారు. అయితే దేవుడి దయ వల్ల ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మా నిరసన కార్యక్రమం వల్ల మేలే జరిగింది. అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో మార్పులు జరిగాయి. కానీ పది రోజుల పాటు తిహార్ జైలులో ఉండటం మాత్రం జీవితంలో మర్చిపోలేని భయానక అనుభవం’ అంటూ చెప్పుకొచ్చారు అభిజిత్. ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి కలిపి నోబెల్ పురస్కారం ప్రకటించారు. అమెరికన్ ఆర్థికవేత్త మైకేల్ క్రెమెర్‌తో పాటు అభిజిత్ ఆయన భార్య ఎస్తర్ డఫ్లో సంయుక్తంగా ఈ అవార్డును అందుకోనున్నారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన రెండో మహిళగా డఫ్లో నిలిచారు. -
అభిజిత్‌కు నోబెల్
-
పేదరికంపై పోరుకు నోబెల్
స్టాక్‌హోమ్: ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి వినూత్న కోణంలో పరిశోధనలు చేసి ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చినందుకు ప్రవాస భారతీయుడు అభిజిత్ బెనర్జీకి అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది. ఈ ఏడాది ఆర్థిక నోబెల్ పురస్కారాన్ని ముగ్గురికి ప్రకటించారు. అభిజిత్, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో, మరో అమెరికన్ ఆర్థికవేత్త మైకేల్ క్రెమెర్‌లు సంయుక్తంగా ఈ అవార్డును అందుకోనున్నారు. భార్యతో కలిసి ఒక ప్రవాస భారతీయుడు అర్థశాస్త్రంలో నోబెల్‌ను దక్కించుకోవడం ఒక విశేషమైతే, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని పొందిన రెండో మహిళ డఫ్లో. ఈ పురస్కారం కింద తొమ్మిది లక్షల 18 వేల అమెరికా డాలర్ల నగదు, ఒక బంగారు పతకం, డిప్లొమా అందిస్తారు. అమెరికన్ ఆర్థికవేత్త మైకేల్ క్రెమెర్ పురస్కారం కింద వచ్చే నగదు బహుమానాన్ని ముగ్గురు ఆర్థికవేత్తలు సమానంగా పంచుకుంటారు. ‘‘వీరు చేసిన పరిశోధనలు, ప్రతిపాదనలతో ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని సమర్థమంతంగా ఎదుర్కొంటున్నాం. కేవలం రెండు దశాబ్దాల్లోనే ఆర్థిక రంగంలో స్పష్టమైన మార్పుల్ని , అభివృద్ధిని చూడగలుగుతున్నాం. అధ్యయనాలు చేయడానికి ఇప్పుడు ఈ రంగమే అత్యంత కీలకంగా ఉంది. ఎందరో అధ్యయనకారు లు ఈ ముగ్గురు అడుగుజాడల్లోనే నడుస్తూ పేదరికాన్ని పారద్రోలడానికి శక్తిమంతమైన ప్రతిపాదనలు చేస్తున్నారు’’ అని నోబె ల్ పురస్కారాన్ని ప్రకటించిన రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. వినూత్న ధోరణితో వీరు చేసిన అధ్యయనాలు పేదరికం నిర్మూలనకు పరిష్కార మార్గాలను చూపించిందని కొనియాడింది. ప్రధాని అభినందనలు: ఆర్థిక నోబెల్‌కు ఎంపికైన ప్రవాస భారతీయుడు అభిజిత్ బెనర్జీకి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. పేదరిక నిర్మూలనలో బెనర్జీ గణనీయ కృషి చేశారన్నారు. ఏపీ సీఎం జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎస్తర్ డఫ్లో, మైఖేల్ క్రెమెర్‌తో కలిసి సంయుక్తంగా గెలుచుకున్నందుకు అభిజిత్ బెనర్జీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. ప్రపంచంలోని పేదరికాన్ని నిర్మూలించడంలో వారు చేసిన కృషిని ఆయన కొనియాడారు. భారత్ పుంజుకునే పరిస్థితి లేదు: అభిజిత్ కోల్‌కతా/న్యూయార్క్: భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అంత ఆశాజనకంగా ఏమీ లేదని అభిజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. భారత ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా ఉందన్న బెనర్జీ.. మళ్లీ పుంజుకునే అవకాశాలు కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదని అమెరికాలోని ఒక న్యూస్ చానల్‌తో అన్నారు. మళ్లీ నిద్రపోయా..: ‘నోబెల్ పురస్కారం ప్రకటించారన్న సమాచారం తెల్లవారు జామున ఒక ఫోన్‌కాల్ ద్వారా తెలిసింది. నేను ఉదయమే నిద్రలేచే వ్యక్తిని కాదు. అందుకే ఆ వార్త విన్న తరువాత మళ్లీ పడుకున్నాను. కానీ, వరస ఫోన్‌కాల్స్‌తో ఎక్కువసేపు నిద్ర పోలేకపోయాను’ అని బెనర్జీ వివరించారు. భార్యకు తనకు కలిపి నోబెల్ రావడంపై స్పందిస్తూ. ‘అది మరింత స్పెషల్’ అన్నారు. దంపతులిద్దరికీ నోబెల్ రావడం గతంలో ఐదు పర్యాయాలు జరిగింది. నోబెల్ భారతీయం ► రవీంద్రనాథ్ ఠాగూర్ (సాహిత్యం, 1913) ► సీవీ రామన్ (భౌతికశాస్త్రం, 1930) ► హర గోవింద్ ఖురానా (ఇండియన్ అమెరికన్), వైద్యం, 1968 ► మదర్ థెరిసా (శాంతి పురస్కారం, 1979) ► సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ (ఇండియన్ అమెరికన్), భౌతికశాస్త్రం, 1983 ► అమర్త్యసేన్ (ఆర్థికశాస్త్రం, 1998) ► వెంకటరామన్ రామకృష్ణన్, (రసాయనశాస్త్రం, 2009) ► కైలాస్ సత్యార్థి (శాంతి పురస్కారం, 2014) ► అభిజిత్ బెనర్జీ (ఇండియన్ అమెరికన్), ఆర్థికశాస్త్రం, 2019 కోల్‌కతా వాసి పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆర్థికవేత్తలు ప్రొఫెసర్ నిర్మల, దీపక్ బెనర్జీలకు కోల్‌కతాలో 1961లో అభిజిత్ బెనర్జీ జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా భారత్‌లోనే సాగింది. కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ చేశారు. ఉన్నతాభ్యాసం కోసం అమెరికా వెళ్లి 1988లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ చేశారు. 2003లో ఎస్తర్ డఫ్లోతో కలిసి అబ్దుల్ లతీఫ్ జమీల్ పోవర్టీ యాక్షన్ ల్యాబ్ (జే–పాల్)ను స్థాపించారు. ప్రస్తుతం ప్రతిష్టాత్మక మాసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 2015 తర్వాత అభివృద్ధి ఎజెండా అనే అంశంలో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన హైలెవల్ ప్యానెల్ ఆఫ్ ఎమినెంట్ పర్సన్స్‌లో కూడా అభిజిత్ పనిచేశారు. ఫ్రాన్స్‌కు చెందిన ఎస్తర్ డఫ్లో ఎంఐటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ చేశారు. విద్య, ఆరోగ్యం, ఆర్థికం, పర్యావరణం, పరిపాలన వంటి పలు రంగాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఎంఐటీలో ప్రొఫెసర్‌గా ఉన్న ఆమె తనకు వచ్చిన ఈ అవార్డు ద్వారా మహిళా లోకం స్ఫూర్తి పొంది ఆర్థిక రంగంలో అద్భుతాలు చేయాలని పిలుపునిచ్చారు. 47 ఏళ్ల వయసుకే అవార్డు దక్కించుకొని అతి చిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. పురస్కారం పొందిన మరో ఆర్థికవేత్త 54 ఏళ్ల వయసున్న క్రెమర్ హార్వర్డ్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. సూటి ప్రశ్నలు సంధిస్తూ.. అభిజిత్ బెనర్జీది మొదట్నుంచి సూటిగా ప్రశ్నలు వేసే తత్వం. వాటికి తగిన సమాధానాలు దొరికేవరకు ఆయన విస్తృతంగా అధ్యయనం చేసేవారు. ఇలాంటి వినూత్న ధోరణిని అవలంబించడం వల్లే ఆయనకు నోబెల్ పురస్కారం అంది వచ్చింది. ఒక ఆర్థికవేత్తగా అభిజిత్ ఎన్నో ఆర్టికల్స్ రాశారు. కొన్ని డాక్యుమెంటరీలు తీశారు. పలు పుస్తకాలు కూడా రచించారు. వాటిలో భార్య డఫ్లోతో కలిసి రచించిన పూర్ ఎకనామిక్స్ అనే పుస్తకం విశేషంగా గుర్తింపు పొందింది. 17 భాషల్లోకి అనువాదమైంది. 2011లో ఫైనాన్షియల్ టైమ్స్, గోల్డ్‌మ్యాన్ సాచ్స్ బిజినెస్ బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల్ని గెలుచుకుంది. ► మొరాకోలో ఒక వ్యక్తికి కడుపు నిండా తిండి లేకపోయినా టీవీ కొనుక్కోవాల్సిన అవసరం ఏమిటి ? ► దారిద్య్ర ప్రాంతాల్లో చిన్నారులు పాఠశాలలకు వెళ్లినా వారికి చదువు నేర్చుకోవడం ఎందుకు కష్టంగా మారుతోంది ? ► గంపెడు మంది పిల్లలు ఉంటే నిరుపేదలుగా మారుతారా ? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకడం దుర్లభం. చిత్తశుద్ధితో వీటికి సమాధానాలు దొరికే మార్గాలను వెతకాలి అని బెనర్జీ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. -
అర్థికశాస్త్రంలో భారత సంతతి అభిజిత్ బెనర్జీకి నోబెల్ పురస్కారం
-
ప్రవాస భారతీయుడికి ప్రతిష్టాత్మక నోబెల్
స్టాక్‌హోమ్ : ఆర్థిక శాస్త్రంలో విశేష సేవలందించిన ముగ్గురికి ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి వరించింది. 2019 ఏడాదికిగానూ అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డుఫ్లో, మైఖేల్ క్రెమేర్‌లను సంయుక్తంగా నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడెమీ సోమవారం ప్రకటించింది. విశ్వవ్యాప్తంగా పేదరికాన్ని పారదోలడానికి అవసరమైన ఆర్థిక విధానాలపై చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డు ప్రకటించినట్టు వెల్లడించింది. రెండు దశాబ్దాల వీరి కృషి ఫలితంగా పేదరిక నిర్మూలనలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని అకాడెమీ తెలిపింది. వీరి ప్రయోగాత్మక విధానం ప్రపంచ పేదరికంతో పోరాడే మన సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగు పరిచిందని కమిటీ పేర్కొంది. కోల్‌కతాలో జన్మించిన అభిజిత్ బెనెర్జీ అమర్థ్యాసేన్ తర్వాత భారత్ తరపున నోబెల్ పొందిన వాడిగా చరిత్ర సృష్టించారు. అమెరికాలో స్థిరపడిన అభిజిత్ ఫ్రెంచ్-అమెరికన్ ఎస్తేర్ డుఫ్లో దంపతులు కావడం విశేషం. (చదవండి : ఇథియోపియా ప్రధానికి శాంతి నోబెల్) ఎస్తేర్ డుఫ్లో, అభిజిత్ బెనర్జీ దంపతులు ప్రైజ్‌మనీ 9 మిలియన్ డాలర్లు.. అభిజిత్ బెనెర్జీ (58) హార్వార్డ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొందారు. ప్రసిద్ధ మసాచూసెట్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇక పారిస్‌లో జన్మించిన ఎస్తేర్ డుఫ్లో (47) మసాచుసెట్స్ యూనివర్సిటీ ఎకనమిక్స్‌లో పీహెచ్డీ పట్టా పొందారు. అక్కడే ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. దంపతులైన ఈ ఇద్దరూ అమెరికాకు చెందిన మరో శాస్త్రవేత్త మైఖేల్ క్రెమెర్ (55)తో కలిసి పేదరికాన్ని ఎదుర్కోవడానికి ప్రయోగాత్మక విధానాలను రూపొందించారు. ఈ ముగ్గురికీ కలిపి ప్రైజ్‌మనీగా 9 మిలియన్ల డాలర్లను నోబెల్ కమిటీ ఇవ్వనుంది. తన కొడుకు, కోడలుకు నోబెల్ బహుమతి వరించడంతో అభిజిత్ బెనెర్జీ తల్లి నిర్మలా బెనెర్జీ ఆనందం వ్యక్తం చేశారు. ‘బెంగాల్‌కు చెందిన రెండో వ్యక్తి నోబెల్ పొందడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ ప్రతిష్టాత్మక బహుమతితో దేశం గర్వించేలా చేసిన అభిజిత్‌కు అభినందనలు’అని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనెర్జీ ట్విటర్లో పేర్కొన్నారు. అభిజిత్ బెనెర్జీకి నోబెల్ రావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. పేదరికాన్ని పారదోలడానికి అభిజిత్ తన పరిశోధనలతో ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. నోబెల్ విజేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. అభిజిత్ బెనెర్జీతో కలిసి ఎస్తేర్ డుఫ్లో, మైఖేల్ క్రెమేర్ పేదరిక నిర్మూలనకై ప్రయోగాత్మక పరిశోధనలు చేశారని ట్విటర్లో పేర్కొన్నారు. -
యూఏఈలో ఆర్థిక సంస్కరణలు
ఎన్.చంద్రశేఖర్,మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా) :యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను అమలు చేయడం ప్రవాస భారతీయుల పాలిట వరంగా మారింది. లైసెన్స్ పొంది వ్యాపారం నిర్వహించాలనుకునేవారికి యూఏఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో ఎంతో మందికి సొంతంగా కంపెనీలను ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కింది. ఫలితంగా రెండు మూడేళ్ల కాలంలో తెలంగాణ జిల్లాలకు చెందిన వారి సప్లయింగ్ కంపెనీల సంఖ్య 500కు పైగా మించిపోయింది. ఒకప్పుడు తెలంగాణ వాసుల కంపెనీలు పదుల సంఖ్యలో ఉండగా.. ఇప్పుడు పెరిగిపోయాయి. మల్టీనేషనల్ కంపెనీల్లో కార్మికులుగా పనిచేసిన వారు సొంతంగా చిన్న కంపెనీలను స్థాపించే స్థాయికి ఎదగడానికి యూఏఈ ప్రభుత్వం అవకాశం కల్పించింది. టెక్నికల్ లైసెన్స్, క్లీనింగ్ లైసెన్స్‌లు పొంది సొంత కంపెనీలను నిర్వహిస్తున్నారు. యూఏఈకి వచ్చే వలస కార్మికులతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన కార్మికులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కంపెనీల నిర్వాహకులు ఎక్కువ మొత్తంలో వేతనాలు చెల్లించడం విశేషం. ప్రస్తుతం తక్కువ పెట్టుబడితోనే.. యూఏఈ ప్రభుత్వం సంస్కరణలను అమలు చేసి కంపెనీల ఏర్పాటుకు నిబంధనలను సవరించింది. దీంతో తక్కువ పెట్టుబడితోనే యూఏఈలో కంపెనీలను ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడింది. లైసెన్స్ ఫీజు, కంపెనీ కార్యాలయం, ఇమిగ్రేషన్ ఇతర ఖర్చులు తగ్గిపోవడంతో కొత్త కంపెనీలను ప్రారంభించడానికి అవకాశాలు విస్తృతమయ్యాయి. దీనికి తోడు కార్మికులను దిగుమతి చేసుకోవడానికి జారీచేసే వీసాలకు డిపాజిట్ చెల్లించే అవసరం కంపెనీల నిర్వాహకులకు తప్పింది. కేవలం రూ.10లక్షల పెట్టుబడితోనే కంపెనీ ఏర్పాటు చేయడానికి యూఏఈ సంస్కరణలు ఎంతో దోహదపడ్డాయి. ఈ కారణంగా కొత్త కంపెనీలను ఏర్పాటు చేయడానికి ఎంతో మంది ఔత్సాహికులు ముందుకు వచ్చారు. అలా రెండు, మూడేళ్లలోనే యూఏఈ పరిధిలో కార్మికులను సరఫరా చేసే కంపెనీలు అనేకం ఏర్పాటయ్యాయి. కేరళ వాసులకు దీటుగా తెలంగాణ వాసులు సప్లయింగ్ కంపెనీలను ఏర్పాటు చేశారు. కార్మికులను పనులు చేసే ప్రాంతానికి తీసుకెళ్లేందుకు బస్సులు, వ్యాన్లు సైతం కొనుగోలు చేయడం గమనార్హం. గతంలో నెలకు మన కరెన్సీలో రూ.50వేల వేతనం పొందిన వారు ఇప్పుడు కంపెనీలను నిర్వహిస్తూ రూ.లక్షల్లో ఆదాయం సమకూర్చుకుంటున్నారు. కన్స్ట్రక్షన్ కంపెనీలకు కార్మికులను పనిలోకి పంపించడమే కాకుండా చిన్న కాంట్రాక్టులను సైతం చేపడుతున్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ కొందరు తమ స్వగ్రామాల్లో స్థిరాస్తులను సైతం కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా తమ పిల్లలను విదేశాల్లో ఉన్నత చదువులను చదివించే స్థాయికి ఎదుగుతున్నారు. గతంలో గల్ఫ్ దేశాల్లో పని కోసం వెళ్లిన వారు తమ పిల్లలకు తాము పనిచేసే కంపెనీలోనే ఏదో ఒక ఉద్యోగం చూసి వారికి కూడా తమ వద్దనే ఉండేలా చూసుకున్నారు. గతంలో పెట్టుబడి ఎక్కువ.. యూఏఈ పరిధిలోని దుబాయి, అబుదాబి, షార్జా తదితర ప్రాంతాల్లో సప్లయింగ్ కంపెనీలను నిర్వహించడానికి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. కంపెనీ లైసెన్స్ ఫీజు, ప్రభుత్వంతో ఒప్పందం, కార్మికులకు వీసాలను జారీచేయడంపై డిపాజిట్ చెల్లించడం, కంపెనీ కార్యాలయం, లైసెన్స్ జారీకి అవకాశం ఇచ్చిన షేక్‌కు కమీషన్‌ను ఎక్కువ మొత్తంలో చెల్లించే వారు. ఒక కంపెనీ ఏర్పాటు చేయాలంటే కనీసం రూ.40లక్షల పెట్టుబడి అవసరం అయ్యేది. పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం కావడంతో కొంత మందికి మాత్రమే కంపెనీలను ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడింది. సొంత కంపెనీలు ఏర్పాటు చేయడానికి మంచి అవకాశం యూఏఈ ప్రభుత్వం సప్లయింగ్ కంపెనీలను ఏర్పాటు చేయడానికి నిబంధనలు మార్చడంతో కొత్తగా సొంత కంపె నీలను ఏర్పాటు చేయడానికి నాలాంటి వారికి అవకాశం లభించింది. కొంత మంది రెండు, మూడు కంపెనీలను కూడా నిర్వహిస్తున్నారు. స్వదేశీ, విదేశీ కార్మికులకు ఉపాధి కల్పించడానికి అవకాశం కలిగింది. సొంత కంపెనీలను నిర్వహించడం సంతోషంగా ఉంది. – స్వామిగౌడ్, దుబాయి(వెల్లుట్ల, జగిత్యాల జిల్లా ) -
ఆటోమేషన్ భయమొద్దు
ఆస్ట్రేలియాలోని మేక్వయిర్ యూనివర్సిటీ ఇటీవల దీనిపై ఓ చర్చ నిర్వహించింది. ‘డెలాయిట్ ఆస్ట్రేలియా’ప్రతినిధి జులియట్ బుర్కే ఇందులో పాల్గొన్నారు. మానవ వనరులకు సాంకేతికత ప్రత్యామ్నాయం కాలేదని వివరించారు. సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంపై పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సాఫ్ట్ స్కిల్స్ ఉత్పాదకతను పెంచగలవని చెబుతున్న అధ్యయనాలను ఆమె ఉటంకించారు. బృందంలో భాగమై పనిచేయగలగడం, సహానుభూతి, సృజనాత్మకతతో వ్యవహరించడం, తన ఆలోచనలు, భావాలను బలంగా వ్యక్తం చేయగలగడం వంటి నైపుణ్యాలు ఈ కృత్రిమ మేధయుగంలో చాలా ముఖ్యం కానున్నాయని వివరించారు. కొత్త నైపుణ్యాలు అందించాలి: ఉద్యోగాల తీరుతెన్నుల్లో వస్తున్న మార్పులను తట్టుకుని నిలబడేందుకు చేపట్టాల్సిన చర్యలను మేక్వయిర్ యూనివర్సిటీలో గ్లోబల్ ఎంబీఏ ప్రోగ్రామ్ డైరెక్టర్ వైవన్ బ్రేయర్ వివరించారు. విద్యా విధానంలో కొత్త నైపుణ్యాలు అందించడం.. ఉద్యోగాలిచ్చిన పరిశ్రమలు ఇందుకు పూనుకోవాలని సూచించారు. ఉన్నత విద్యలో గత 20 ఏళ్లల్లో అంతగా మార్పులు రాకపోవడాన్ని ఈ సందర్భంగా యూనివర్సిటీ లెర్నింగ్ అండ్ టీచింగ్ విభాగం డీన్ లియోని టికిల్ వివరించారు. మనం మారాలి.. ‘టెక్నాలజీ అభివృద్ధిని మనం అడ్డుకోలేం. పని ప్రదేశాల్లోకి చొచ్చుకురాకుండా దాన్ని ఆపలేం. పని స్వభావం మారుతోంది. మారుతూనే ఉంటుంది. కాబట్టి కొనసాగుతున్న మార్పులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలి’అని జీటీఎం అండ్ సేల్స్ డిజిటల్ మీడియా (దక్షిణాసియా) హెడ్ గౌరవ్ కన్వల్ చెబుతున్నారు. నవతరం నుంచి మధ్యవయస్కుల వరకు క్రమం తప్పకుండా తమ నైపుణ్యాలను సాన పెట్టుకోవాలని సూచించారు. సృజనాత్మక సామర్థ్యాలే రక్ష.. 2030నాటికి రోబోటిక్ ఆటోమేషన్ కారణంగా 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారని ఏడాది కిందట 46 దేశాలపై మెకన్సీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ జరిపిన అధ్యయనంలో తేలింది. దీని ప్రకారం.. పేద దేశాల కంటే ధనిక దేశాల్లోనే ఆటోమేషన్ ఎక్కువ ప్రభావం చూపనుంది. భారత్‌లో కొత్త టెక్నాలజీల కారణంగా 9% ఉద్యోగాలకు ముప్పు ఉంది. 32 దేశాల్లో 46% ఉద్యోగాలపై యాంత్రీకరణ ప్రభావం చూపొచ్చని ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్) ఈ ఏడాది జరిపిన అధ్యయనం చెబుతోంది. కృత్రిమ మేధ కలిగిన యంత్రాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) చెబుతోంది. సృజనాత్మక సామర్థ్యాలున్న వారే పైచేయి సాధిస్తారని స్థూల ఆర్థిక విధానాల విభాగాధినేత ఎక్కెహర్డ్ ఎమ్స్ట్ వివరించారు. కృత్రిమ మేధ ద్వారా ఆర్థిక వ్యవస్థలు, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల తయారీ రంగం అంతగా లాభాలు గడించబోదని అభిప్రాయపడ్డారు. నిర్మాణ, ఆరోగ్య, వ్యాపారరంగ ఉద్యోగాలపైనే ఎక్కువగా కృత్రిమ మేధ ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఆ యంత్రాలతో కలసి పని చేసేందుకు ఉద్యోగులకు కొత్తరకం నైపుణ్యాలు అవసరం అవుతాయని ఎక్కెహర్డ్ చెబుతున్నారు. పెరుగుతున్న సాంకేతికత.. కార్మిక శక్తి, ఆదాయ వ్యత్యాసాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఏఐ, మెషీన్ లెర్నింగ్ ప్రభావంపై ఇప్పుడే అంచనా వేయడం కష్టమని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ కెన్ గోల్డ్బెర్గ్ చెబుతున్నారు. ఏఐ వల్ల పోయే ఉద్యోగాల కంటే వచ్చేవే ఎక్కువని స్పష్టం చేస్తున్నారు. -
ఆ రెండు పరీక్షలు మళ్లీ నిర్వహిస్తాం: సీబీఎస్ఈ
సాక్షి, న్యూఢిల్లీ: పదో తరగతి గణితం, 12వ తరగతి ఆర్థికశాస్త్రం పరీక్షలను మళ్లీ నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. ఇటీవల జరిగిన పదో తరగతి మ్యాథమెటిక్స్, 12వ తరగతి ఎకనామిక్స్ పరీక్షల సందర్భంగా ప్రశ్నాపత్రాలు లీకైనట్టు వెలుగుచూడటం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు.. ప్రశ్నాపత్రాలు లీక్ కావడం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని, మళ్లీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించామని, ఈ రెండు సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షల తేదీని తమ వెబ్సైట్లో వెల్లడిస్తామని సీబీఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షలు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ రెండు పరీక్షలు మళ్లీ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవల నిర్వహించిన ఈ రెండు పరీక్షలకు దాదాపు 28లక్షలమంది విద్యార్థులు హాజరయ్యారు. సీబీఎస్ఈ నిర్ణయంతో పదో తరగతిలో 16,38,428 మంది విద్యార్థులు, 12వ తరగతిలో 11,86,306మంది విద్యార్థులు మరోసారి పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. టెన్త్ మ్యాథమెటిక్స్ ప్రశ్నాపత్రం చాలా సులువుగా రావడం, 12వ తరగతి ఎకనామిక్స్ ప్రశ్నాపత్రం లీకై.. వాట్సాప్‌లో చక్కర్లు కొట్టడం పరీక్షల సందర్భంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. -
రాజన్ కు నోబెల్ బహుమతి?
న్యూఢిల్లీ : ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి-2017 ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ను వరించే అవకాశం ఉందని క్లారివేట్ ఎనలైటిక్స్ పేర్కొంది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రధానం కోసం నోబెల్ కమిటీ ఎంపిక చేసిన జాబితాలో రాజన్ పేరు ఉన్నట్లు తెలిపింది. కాగా, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ విన్నర్ పేరు సోమవారం అధికారికంగా వెలువడనుంది. నోబెల్ ప్రైజ్ ఎవరు గెలుస్తారన్నదానిపై క్లారివేట్ ఎనలైటిక్స్ పేర్కొన్న పేర్లు ఆసక్తిని కల్గిస్తున్నాయి. నోబెల్ పురస్కారానికి తగిన పరిశోధనలు చేసిన ఆరుగురు ప్రముఖుల పేర్లను క్లారివేట్ పేర్కొంది. రాజన్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ చికాగోలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో సర్వీస్ ప్రొఫెసర్ ఆఫ్ ఫైనాన్స్ గా పని చేస్తున్నారు. 2013లో ఆర్బీఐ గవర్నర్ గా పని చేస్తున్న సమయంలో బ్రిటిష్ మేగజిన్ సెంట్రల్ బ్యాంకింగ్స్ సెంట్రల్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు. రాజన్ ఐఐటీ, ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. -
మోదీ ఆ పరీక్షల్లో ఫెయిల్
న్యూఢిల్లీ : పెద్ద నోట్లను రద్దుచేయాలని వాంఛూ కమిటీ చేసిన సిఫార్సులను ఇందిరాగాంధీ తోసిపుచ్చారని ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. ప్రధాని నరేంద్రమోదీకి అసలు ఆర్థికశాస్త్రంపై జ్ఞానమే లేదని, ఆయన ఎప్పుడూ చరిత్ర టెస్టుల్లో ఫెయిలయ్యేవారని విమర్శించింది. ప్రధాని ప్రస్తుతం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు అతిపెద్ద ఆర్థిక కుంభకోణమని అభివర్ణించింది. 'దురదృవశాత్తు ప్రధానికి ఎకనామిక్స్‌పై అసలు అవగాహనే లేదు, చరిత్ర టెస్టుల్లో ఎప్పుడూ విఫలమవుతూనే ఉంటారు' అని కాంగ్రెస్ నేత ఓమ్ ప్రకాశ్ మిశ్రా అన్నారు. అతిపెద్ద ఆర్థిక కుంభకోణం కంటే పెద్ద నోట్ల రద్దు తక్కువేమీ కాదని విమర్శించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ను ఆర్థిక తీవ్రవాద దిశగా ప్రధాని మరలిస్తున్నారన్నారు. 1971లో నోట్ల రద్దును ఇందిరాగాంధీ ప్రభుత్వం తొక్కేసిందనే ప్రధాని ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ఆయనపై మండిపడింది. నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతంపై ప్రధాని స్పందిస్తూ ఎన్నికల్లో గెలవడానికి ఇందిరాగాంధీ నోట్లను రద్దు చేయలేదని, వారికి దేశం కంటే పార్టీనే ముఖ్యమని బిగ్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.