
న్యూఢిల్లీ : ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి-2017 ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ను వరించే అవకాశం ఉందని క్లారివేట్ ఎనలైటిక్స్ పేర్కొంది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రధానం కోసం నోబెల్ కమిటీ ఎంపిక చేసిన జాబితాలో రాజన్ పేరు ఉన్నట్లు తెలిపింది. కాగా, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ విన్నర్ పేరు సోమవారం అధికారికంగా వెలువడనుంది.
నోబెల్ ప్రైజ్ ఎవరు గెలుస్తారన్నదానిపై క్లారివేట్ ఎనలైటిక్స్ పేర్కొన్న పేర్లు ఆసక్తిని కల్గిస్తున్నాయి. నోబెల్ పురస్కారానికి తగిన పరిశోధనలు చేసిన ఆరుగురు ప్రముఖుల పేర్లను క్లారివేట్ పేర్కొంది. రాజన్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ చికాగోలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో సర్వీస్ ప్రొఫెసర్ ఆఫ్ ఫైనాన్స్ గా పని చేస్తున్నారు. 2013లో ఆర్బీఐ గవర్నర్ గా పని చేస్తున్న సమయంలో బ్రిటిష్ మేగజిన్ సెంట్రల్ బ్యాంకింగ్స్ సెంట్రల్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు. రాజన్ ఐఐటీ, ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు.
Comments
Please login to add a commentAdd a comment