Raghuram G Rajan
-
ప్రపంచానికి ప్రమాదం: రఘురామ్ రాజన్
ప్రపంచంలో ప్రభుత్వ రుణాలు పెరుగుతున్నాయని, అవి చాలా ప్రమాదకరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ముఖ్యంగా దానివల్ల అమెరికాకు చాలా నష్టం కలుగుతుందన్నారు. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు అమెరికా ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉన్నాయని గుర్తు చేశారు.రోమ్‌లోని బ్యాంకోర్ ప్రైజ్ అవార్డు సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ప్రభుత్వ రుణాలు పెంచుకునే దేశాలకు భవిష్యత్తులో సంక్షోభాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, అంటువ్యాధులు పెరుగుతున్నాయి. దానివల్ల అప్పులు పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఇటీవలి ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ప్రపంచ దేశాల ప్రభుత్వ రుణాలు అధికమవుతున్నాయి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు ఇదో హెచ్చరిక. వచ్చే ఏడాది వైట్‌హైజ్ బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండేందుకు రుణాలు తగ్గించుకోవాలి’ అన్నారు.ఇదీ చదవండి: గోల్డ్ లోన్ చెల్లింపు విధానంలో మార్పులుప్రపంచ ప్రభుత్వ రుణం ఈ ఏడాది చివరి నాటికి 100 ట్రిలియన్ డాలర్లు లేదా ప్రపంచ జీడీపీలో 93% చేరుకుంటుందని కొన్ని సర్వేలు అంచనా వేస్తున్నాయి. యూఎస్ అప్పు దాదాపు 31 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ద్రవ్యోల్బణం మందగించడం, వడ్డీ రేట్లు తగ్గడం వంటి అంశాలు ప్రభుత్వాలు రుణాలు క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం ఇస్తాయని రాజన్ అన్నారు. దేశాల అప్పులు పెరగడంవల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఇతర దేశాల నుంచి రుణం పొందే అవకాశం ఉండదని చెప్పారు. -
మోదీ ప్రధాని అయినా, అవ్వకపోయినా అందులో మార్పులేదు: రాజన్
రానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని అయినా, అవ్వకపోయినా దేశ ఆర్థిక విధాన పథం కొనసాగుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ ప్రొఫెసర్ పనిచేస్తున్న ఆయన హాంకాంగ్‌లో జరుగుతున్న యూబీఎస్ ఆసియా ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు.ఈ సందర్భంగా బ్లూమ్‌బెర్గ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ మాట్లాడుతూ..‘భారతీయ ఆర్థిక విధాన పథం కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ మరోసారి ప్రధాని అయినా, అవ్వకపోయినా ఆర్థిక వృద్ధిలో ఎలాంటి మార్పులుండవు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బడ్జెట్‌ను ప్రకటిస్తుంది. ఆ ప్రభుత్వం అందరికీ ఉపయోగపడే విధానాలను కొనసాగిస్తుంది. అధికారంలోకి వచ్చే ప్రభుత్వం భారత్‌లో మౌలిక సదుపాయాల నాణ్యతపై దృష్టి పెట్టాలి. పెట్టుబడి కేవలం ప్రధాన పారిశ్రామిక సంస్థలకు ప్రయోజనం చేకూర్చకుండా చూడాలి’ అని తెలిపారు.ఇదీ చదవండి: నెలకు రూ.4 కోట్లు అద్దె చెల్లించనున్న గూగుల్దేశంలో ఆరు వారాల పాటు జరిగే ఎన్నికలు జూన్ 1న ముగుస్తాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి. మోదీ సారథ్యంలోని భాజపా మూడోసారి అధికారంలోకి వస్తుందని అంచనాలున్నాయి. అయినప్పటికీ ఆశించిన మెజారిటీని సంపాదించగలదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో కొందరు పెట్టుబడిదారులు ప్రభుత్వ విధానాలపై ఆధారపడే ఆర్థిక సంస్కరణల నుంచి తప్పుకునే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆర్థిక విధానాల్లో ఎలాంటి మార్పు ఉండదని, భారత్ తన ఆర్థిక పథాన్ని కొనసాగిస్తుందని రాజన్ చెప్పడం పట్ల కొంత స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. బ్లూమ్‌బెర్గ్ ఎకనామిక్స్ అంచనా ప్రకారం భారత్ 2024-2026 మధ్యకాలంలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ.44.4 ట్రిలియన్లు ఖర్చు చేస్తుంది. ఇది 2030 నాటికి ఆర్థిక వృద్ధిని 9శాతానికి పెంచేందుకు సహకరిస్తుంది. -
Raghuram Rajan: భారత్ ప్రధాన సమస్య ఏమిటంటే..?
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా పేరొందిన భారత్ ఎకానమీ ప్రస్తుతం ఉద్యోగాల కల్పనలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుటోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ జీ రాజన్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ ముందున్న సమస్యల్లో ఉద్యోగాల కల్పన ప్రధానమైందని ఆయన అన్నారు. నైపుణ్యాల పెంపు ద్వారా మానవ వనరుల అభివృద్ధి తక్షణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా రాజన్ పనిచేస్తున్నారు. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రోహిత్ లాంబా, తాను (రాజన్) సంయుక్తంగా రాసిన ‘బ్రేకింగ్ ది మౌల్డ్: రీఇమేజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్’ అనే పుస్తకం గురించి ఆయన మాట్లాడుతూ భారత్ ఎకానమీ గురించి కీలక విశ్లేషణ చేశారు. ‘‘భారత్ ప్రస్తుతం ఒక క్రాస్ రోడ్ వద్ద ఉంది‘ అన్న ముగింపు అభిప్రాయంతో ముగిసిన పుస్తకం గురించి వివరించిన సందర్భంగా రాజన్ ఏమన్నారంటే... ► భారతదేశం అతిగొప్ప బలం 140 కోట్ల జనాభా. అయితే ఈ జనాభాకు సంబంధించి ‘మూలధనం’ ఎలా బలోపేతం చేయాలన్నది ప్రశ్న. దేశం అభివృద్ధి పథంలో పయనించే ప్రతి స్థాయిలో ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉంది. ► ప్రైవేట్ రంగ ఉద్యోగాల విషయంలో ‘రిజర్వేషన్ల’ ఆందోళనలు ఉన్నాయి. ఇక కొన్ని రాష్ట్రాలు తమ నివాసితులకు మాత్రమే ఉద్యోగాలను రిజర్వ్ చేయడానికి ప్రయతి్నస్తున్నాయి. ఇది ఆందోళనకరమైన ధోరణి. ఇలాంటి ధోరణి పోవాలి. దీనివల్ల నైపుణ్యం కలిగిన మానవ వనరులు దేశం మొత్తం విస్తరించడానికి వీలవుతుంది. ► గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఒక వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ కలి్పస్తే రాబోయే ఆరు నెలల నుండి ఒక సంవత్సరంలో దేశంలో భారీ ఉపాధి కల్పన జరుగుతుంది. ఉపాధి కల్పించడానికి 10 సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ► భారత్ మానవ ‘మూలధనాన్ని’ మెరుగుపరుచుకుంటే... అవసరమైన ఉద్యోగాలు వాటంతట అవే వస్తాయి. శ్రామిక శక్తి నాణ్యతను మెరుగుపరుస్తే, కంపెనీలు భారతదేశానికి వస్తాయి. నైపుణ్యం కలిగిన ఉద్యోగస్తులు లభించడం లేదని కంపెనీలు తరచూ చెబుతుండడాన్ని మనం గమనిస్తున్నాం. ► సామాన్యునికి సైతం సైవలు అందేలా పాలనా సంస్కరణలు జరగాలి. ప్రత్యేకించి పరిపాలనా వికేంద్రీకరణపై దృష్టి సారించాలి. ► స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాల మదింపు సరిగా జరగాలి. భారత్ తన బలహీనతలపై కాకుండా బలాలపై ఆధారపడిన మార్గాన్ని ఆవిష్కరించాలి. -
కొత్త ఉద్యోగాలు సృష్టించాలంటే ఇది తప్పనిసరి
భారతదేశ దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉన్నప్పటికీ, పెరుగుతున్న ఉద్యోగ డిమాండ్‌ను తీర్చడానికి మాత్రం వృద్ధి రేటు ఎనిమిది శాతం కంటే ఎక్కువగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామరాజన్ స్పష్టం చేశారు. చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇతర దేశాలతో పోలిస్తే ప్రస్తుతం భారతదేశం 6-6.5 శాతం ఆర్థిక వృద్ధి నమోదు చేస్తోందని, కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు ఇది సరిపోదని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతోపాటు భారత దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను విశ్లేషిస్తూంటారన్నది మనకు తెలిసిన విషయమే. మరోవైపు భారత్‌లో ఏటా నిరుద్యోగం పెరుగుతోంది. దీనికి తోడు ఏటా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగ వేటలో పడుతున్నవారి సంఖ్య అధికమవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా దేశం ఏ మేరకు వృద్ధి సాధించాలో ఆయన తన అంచనాలను వెల్లడించారు. ‘జనాభా అవసరాలు తీర్చాలన్నా.. కొత్త ఉద్యోగాలు సృష్టించాలన్నా భారతదేశం 8-8.5 శాతం ఆర్థికవృద్ధి సాధించాలి. ఉత్పాదకతలో చైనా, వియత్నాం వంటి దేశాలతో పోటీ పడాలి. అందుకు అవసరమయ్యే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. ఐఫోన్ వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తులను దేశంలో తయారు చేస్తున్నారు. కానీ వీటి విడిభాగాలు తయారీలో దేశం పురోగతి చెందింది. అయితే పూర్తి స్థాయి సామర్థ్యాలను సాధించడంలో మాత్రం ఇంకా వృద్ధి చెందాలి’ అని రఘురామ్‌రాజన్ అన్నారు. ప్రపంచ బ్యాంక్ సీనియర్ ఆర్థికవేత్త ధ్రువ్ శర్మ ఇటీవల మాట్లాడుతూ 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే దాదాపు ఏటా 8 శాతం ఆర్థికవృద్ధి నమోదు చేయాలని సూచించిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం, ఇతర నియంత్రణ చర్యల వల్ల కొవిడ్ తర్వాత దేశం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోంది. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తున్నప్పటికీ, ఏటా ఉద్యోగాలు కల్పించడంలో మాత్రం సవాళ్లు ఎదుర్కొంటునట్లు నిపుణులు చెబుతున్నారు. నిరుద్యోగిత రేటు అక్టోబర్‌లో 10.05 శాతానికి చేరుకుందని ముంబైలోని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక తెలిపింది. రాబోయే దశాబ్దంలో దేశంలో ఏడు కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించాలని హెచ్ఎస్బీసీ సూచిస్తుంది. -
రాజన్ కు నోబెల్ బహుమతి?
న్యూఢిల్లీ : ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి-2017 ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ను వరించే అవకాశం ఉందని క్లారివేట్ ఎనలైటిక్స్ పేర్కొంది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రధానం కోసం నోబెల్ కమిటీ ఎంపిక చేసిన జాబితాలో రాజన్ పేరు ఉన్నట్లు తెలిపింది. కాగా, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ విన్నర్ పేరు సోమవారం అధికారికంగా వెలువడనుంది. నోబెల్ ప్రైజ్ ఎవరు గెలుస్తారన్నదానిపై క్లారివేట్ ఎనలైటిక్స్ పేర్కొన్న పేర్లు ఆసక్తిని కల్గిస్తున్నాయి. నోబెల్ పురస్కారానికి తగిన పరిశోధనలు చేసిన ఆరుగురు ప్రముఖుల పేర్లను క్లారివేట్ పేర్కొంది. రాజన్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ చికాగోలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో సర్వీస్ ప్రొఫెసర్ ఆఫ్ ఫైనాన్స్ గా పని చేస్తున్నారు. 2013లో ఆర్బీఐ గవర్నర్ గా పని చేస్తున్న సమయంలో బ్రిటిష్ మేగజిన్ సెంట్రల్ బ్యాంకింగ్స్ సెంట్రల్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు. రాజన్ ఐఐటీ, ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. -
ధరల కట్టడిని ప్రజలు కోరుతున్నారు
సిమ్లా: ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీరేటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రధాన సాధనమని గవర్నర్ రఘురామ్ జీ రాజన్ పేర్కొన్నారు. జూన్ 3 ఆర్బీఐ ద్వైమాసిక పరపతి సమీక్ష నేపథ్యంలో రాజన్ ఈ వ్యాఖ్య చేశారు. గురువారం ఇక్కడ జరిగిన బోర్డ్ సమావేశం అనంతరం రాజన్ విలేకరులతో మాట్లాడారు. భారత ప్రజలు ధరల తగ్గుదలను కోరుకుంటున్నారని అన్నారు. ఈ విషయంలో తగిన అన్ని చర్యలనూ ఆర్బీఐ తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వానికీ సాధనలు... ప్రభుత్వానికీ ద్రవ్యోల్బణం కట్టడికి సాధనాలు ఉన్నాయని రాజన్ అన్నారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, సరఫరాల మెరుగుదల వంటి అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఆర్బీఐ, ప్రభుత్వం కలసి పనిచేయాల్సి ఉంటుందని, అదే విధంగా ముందుకు సాగుతాయని సైతం స్పష్టం చేశారు. ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయ్ ప్లాస్టిక్ నోట్లను వచ్చే ఏడాది ప్రవేశపెడతామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ గురువారం తెలిపారు. వంద కోట్ల నోట్లకు టెండర్ పిలిచామని, బిడ్లు కూడా దాఖలయ్యాయని వివరించారు. ముందుగా ఈ ఏడాది ద్వితీయార్థంలో సిమ్లా సహా మరో నాలుగు నగరాల్లో వీటిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతామని, ఆ ఫలితాల ఆధారంగా వచ్చే ఏడాది ఈ ప్లాస్టిక్ నోట్లను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామన్నారు. రూ. 10 డినామినేషన్లో ఉన్న వంద కోట్ల ప్లాస్టిక్ నోట్లను ఐదు నగరాల్లో ప్రవేశపెట్టనున్నామని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రభుత్వం వెల్లడించింది. ఆ బాధ్యత ప్రభుత్వానిదే నల్ల ధనం నిరోధం ప్రభుత్వ బాధ్యతని, ఈ విషయంలో ఆర్బీఐ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోదని రాజన్ వివరించారు. విదేశీ మారక ద్రవ్య లావాదేవీల తనిఖీల్లో భాగంగా నల్లధన సంబంధిత చర్యలను గుర్తించామని పేర్కొన్నారు. ఈ విషయమై ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పారు. అయితే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారత్‌కు తీసుకురావమనేది ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతల్లో ఒకటని ఆయన వివరించారు. -
ఆర్బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్
రిజర్వు బ్యాంకు నూతన గవర్నర్‌గా రఘురామ్ జి రాజన్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. దువ్వూరి ఐదేళ్ల పదవీ కాలం సెప్టెంబర్ 4తో ముగియనుంది. ఆర్బీఐ గవర్నర్ పదవిలో రఘురామ్ జి రాజన్ మూడేళ్ల పాటు కొనసాగుతారని అధికార ప్రకటనలో తెలిపారు. రాజన్ ప్రస్తుతం ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆయనను గతేడాది ఆగస్టులో ఈ పదవిలో నియమించింది. గతంలో ఐఎంఎఫ్‌లో ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేశారు. ప్రధానికి గౌరవ ఆర్థిక సలహాదారుగానూ కొనసాగుతున్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ పలు సవాళ్లు ఎదుర్కొనున్నారు. రూపాయి పతనం, రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఐఐటీ-అహ్మదాబాద్, ఐఐటీ-ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన రాజన్ 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగా ఊహించారు.