ప్రపంచంలో ప్రభుత్వ రుణాలు పెరుగుతున్నాయని, అవి చాలా ప్రమాదకరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ముఖ్యంగా దానివల్ల అమెరికాకు చాలా నష్టం కలుగుతుందన్నారు. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు అమెరికా ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉన్నాయని గుర్తు చేశారు.
రోమ్‌లోని బ్యాంకోర్ ప్రైజ్ అవార్డు సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ప్రభుత్వ రుణాలు పెంచుకునే దేశాలకు భవిష్యత్తులో సంక్షోభాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, అంటువ్యాధులు పెరుగుతున్నాయి. దానివల్ల అప్పులు పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఇటీవలి ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ప్రపంచ దేశాల ప్రభుత్వ రుణాలు అధికమవుతున్నాయి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు ఇదో హెచ్చరిక. వచ్చే ఏడాది వైట్‌హైజ్ బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండేందుకు రుణాలు తగ్గించుకోవాలి’ అన్నారు.
ఇదీ చదవండి: గోల్డ్ లోన్ చెల్లింపు విధానంలో మార్పులు
ప్రపంచ ప్రభుత్వ రుణం ఈ ఏడాది చివరి నాటికి 100 ట్రిలియన్ డాలర్లు లేదా ప్రపంచ జీడీపీలో 93% చేరుకుంటుందని కొన్ని సర్వేలు అంచనా వేస్తున్నాయి. యూఎస్ అప్పు దాదాపు 31 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ద్రవ్యోల్బణం మందగించడం, వడ్డీ రేట్లు తగ్గడం వంటి అంశాలు ప్రభుత్వాలు రుణాలు క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం ఇస్తాయని రాజన్ అన్నారు. దేశాల అప్పులు పెరగడంవల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఇతర దేశాల నుంచి రుణం పొందే అవకాశం ఉండదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment